Day trading guide: యాక్సిస్ బ్యాంక్ సహా ఈ రోజు లాభాల్లో దూసుకువెళ్లే స్టాక్స్ ఇవే..-day trading guide for stock market today six stocks to buy or sell on friday ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Day Trading Guide: యాక్సిస్ బ్యాంక్ సహా ఈ రోజు లాభాల్లో దూసుకువెళ్లే స్టాక్స్ ఇవే..

Day trading guide: యాక్సిస్ బ్యాంక్ సహా ఈ రోజు లాభాల్లో దూసుకువెళ్లే స్టాక్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu

Day trading guide for today: జిందాల్ స్టీల్, ఐషర్ మోటార్, సీసీఎల్ ప్రొడక్ట్స్, టోరెంట్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, హెచ్ సీ ఎల్ టెక్.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

Day trading guide for today: మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. జిందాల్ స్టీల్, ఐషర్ మోటార్, సీసీఎల్ ప్రొడక్ట్స్, టోరెంట్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, హెచ్ సీ ఎల్ టెక్.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.

మిశ్రమంగా..

గురువారం స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా కొనసాగాయి. నిఫ్టీ 50, సెన్సెక్స్ లాభాల్లో ముగియగా, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ 50 సూచీ 36 పాయింట్ల లాభంతో 20,133 స్థాయిల వద్ద, బిఎస్‌ఇ సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 66,988 వద్ద ట్రేడింగ్ ను ముగించగా, బ్యాంక్ నిఫ్టీ 84 పాయింట్లు కోల్పోయి 44,481 స్థాయిల వద్ద ముగిసింది. బ్రాడ్ మార్కెట్‌లో, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 40,407 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. మిడ్-క్యాప్ ఇండెక్స్ కూడా 34,293 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది.

ఈ రోజు ఎలా?

ఈరోజు నిఫ్టీ 50 ఔట్‌లుక్‌పై, హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి మాట్లాడుతూ, "నిఫ్టీ యొక్క స్వల్పకాలిక ట్రెండ్ సానుకూలంగా కొనసాగుతోంది. ఇటీవల కీలకమైన అడ్డంకులను అధిగమించినందున, మార్కెట్ కొత్త ఆల్-టైమ్‌లోకి జూమ్ అవుతుందని భావిస్తున్నారు. గురువారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోయే మార్కెట్లకు తాజా దిశను చూపుతాయని భావిస్తున్నారు. తక్షణ మద్దతు 19900-19950 స్థాయిలలో ఉండవచ్చు" అని వివరించారు.

ఎగ్జిట్ పోల్స్ ప్రభావం

ఈరోజు స్టాక్ మార్కెట్ ఔట్‌లుక్‌పై మోతీలాల్ ఓస్వాల్‌కు చెందిన సిద్ధార్థ ఖేమ్కా మాట్లాడుతూ, "శుక్రవారం స్టాక్ మార్కెట్ పై ఎగ్జిట్ పోల్ ఫలితాలు, భారతదేశ జిడిపి డేటా కీలక ప్రభావం చూపనున్నాయి. మొత్తంమీద మార్కెట్‌లో సానుకూల ధోరణి కొనసాగుతుందని మేము భావిస్తున్నాము.

ఈ స్టాక్స్ తో లాభాలు

మార్కెట్ నిపుణులు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా, ఆనంద్ రాఠీలో సీనియర్ మేనేజర్ టెక్నికల్ రీసెర్చ్ గా ఉన్న గణేశ్ దోంగ్రె, బొనాంజా పోర్ట్ ఫోలియోలో రీసెర్చ్ అనలిస్ట్ గా ఉన్న కునాల్ కాంబ్లే అంచనాల ప్రకారం.. జిందాల్ స్టీల్, ఐషర్ మోటార్, సీసీఎల్ ప్రొడక్ట్స్, టోరెంట్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, హెచ్ సీ ఎల్ టెక్.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.

జిందాల్ స్టీల్: ప్రస్తుత ధర రూ. 670.80; టార్గెట్ ప్రైస్ రూ. 700; స్టాప్ లాస్ రూ. 652.

ఐషర్ మోటార్: ప్రస్తుత ధర రూ. 3896.90; టార్గెట్ ప్రైస్ రూ. 4127; స్టాప్ లాస్ రూ. 3775.

సీసీఎల్ ప్రొడక్ట్స్: ప్రస్తుత ధర రూ. 660; టార్గెట్ ప్రైస్ రూ. 675; స్టాప్ లాస్ రూ. 650

టోరెంట్ ఫార్మా: ప్రస్తుత ధర రూ. 2134; టార్గెట్ ప్రైస్ రూ 2200; స్టాప్ లాస్ రూ.1020.

యాక్సిస్ బ్యాంక్: ప్రస్తుత ధర రూ. 1067; టార్గెట్ ప్రైస్ రూ 1132; స్టాప్ లాస్ రూ.1039

హెచ్ సీ ఎల్ టెక్: ప్రస్తుత ధర రూ. 1337; టార్గెట్ ప్రైస్ రూ 1341; స్టాప్ లాస్ రూ.1290

సూచన: ఇవి మార్కెట్ నిపుణుల అంచనాలు, అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.