Day trading guide: ఈ తొమ్మిది స్టాక్స్ తో ఈ రోజు లాభాలు గ్యారెంటీ..-day trading guide for stock market today nine stocks to buy or sell on thursday ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For Stock Market Today: Nine Stocks To Buy Or Sell On Thursday

Day trading guide: ఈ తొమ్మిది స్టాక్స్ తో ఈ రోజు లాభాలు గ్యారెంటీ..

HT Telugu Desk HT Telugu
Jan 25, 2024 09:10 AM IST

Day trading guide: ఇన్ఫోసిస్, మిశ్రా ధాతు నిగమ్, ఎల్టీ, ఎన్సీసీ, అపర్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్స్యూమర్, ఐపీసీఏ ల్యాబ్స్, హనీవెల్ ఆటోమేషన్, కైనెస్ టెక్నాలజీ.. ఈ తొమ్మిది షేర్లను ఈ రోజు కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Day trading guide: బుధవారం ఆచితూచి ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్ ద్వితీయార్థంలో వేగంగా కోలుకుని లాభాల్లో ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 215 పాయింట్లు పెరిగి 21,453 స్థాయిలో, బీఎస్ఈ సెన్సెక్స్ 689 పాయింట్లు లాభపడి 71,060 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 45,082 వద్ద ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.80 శాతం, 1.70 శాతం చొప్పున లాభపడ్డాయి. బీఎస్ఈలో అడ్వాన్స్-క్షీణత నిష్పత్తి 1.83గా ఉండటంతో క్షీణించిన షేర్ల కంటే అడ్వాన్సింగ్ షేర్లు పెరిగాయి.

ట్రెండింగ్ వార్తలు

సానుకూల అంతర్జాతీయ సంకేతాలు

నిన్నటి భారీ అమ్మకాల తర్వాత దేశీయ ఈక్విటీలు ఈ రోజు బలంగా పుంజుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, ఆకట్టుకునే త్రైమాసిక ఫలితాలు, ఊహించిన దానికంటే మెరుగైన జనవరి పీఎంఐ డేటాతో సెంటిమెంట్లు ఊపందుకున్నాయి. నిఫ్టీ 215 పాయింట్లు (+1.0%) పెరిగి 21454 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ 100 1.8%, స్మాల్ క్యాప్ 100 1.7% పెరగడంతో బ్రాడ్ మార్కెట్ కూడా పుంజుకుంది. ఐటీ, పీఎస్యూ బ్యాంకులు, రైల్వేస్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్యూలు, మీడియా తదితర రంగాలు నష్టపోయాయి. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఫిబ్రవరి 5 న బ్యాంకులకు రిజర్వ్ అవసరాల నిష్పత్తిని తగ్గించనున్నట్లు చెప్పడంతో ప్రపంచ మార్కెట్లు పుంజుకున్నాయి.

నిఫ్టీ 50 ఇండెక్స్ అవుట్ లుక్

నిఫ్టీ 50 ఇండెక్స్ అవుట్ లుక్ పై హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి మాట్లాడుతూ ‘‘నిఫ్టీ స్వల్పకాలిక ట్రెండ్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. అయితే మార్కెట్ లో అనిశ్చితి ఎక్కువగానే ఉంది’’ అన్నారు. వచ్చే సెషన్లో మార్కెట్ 21,500 నుంచి 21,600 స్థాయిల వద్ద బలమైన ప్రతిఘటనను ఎదుర్కోవచ్చన్నారు. ఈ రోజు నిఫ్టీకి తక్షణ మద్దతు 21,220 స్థాయిలో ఉంటుందని అంచనా వేశారు.

నిఫ్టీ కాల్ పుట్ ఆప్షన్ డేటా

నిఫ్టీ కాల్ పుట్ ఆప్షన్ డేటాలో ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ టెక్నికల్ అండ్ డెరివేటివ్ రీసెర్చ్ హెడ్ చిన్మయ్ బార్వే మాట్లాడుతూ, "మేజర్ మొత్తం కాల్ ఓపెన్ ఇంట్రస్ట్ వరుసగా 21500, 21600, 21700 స్ట్రైక్స్ వద్ద కనిపించింది, మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ వరుసగా 160603, 165431, 211581 కాంట్రాక్ట్స్ గా ఉంది’’ అన్నారు.

ఈ రోజు డే ట్రేడింగ్

ఈ రోజు ట్రేడింగ్ చేయాల్సిన స్టాక్స్ పై స్టాక్ మార్కెట్ నిపుణులు ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా, ఆనంద్ రాఠీ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ గణేష్ డోంగ్రే, బొనాంజా పోర్ట్ఫోలియో టెక్నికల్ అనలిస్ట్ విరాట్ జగద్, ప్రభుదాస్ లిల్లాధేర్ టెక్నికల్ అనలిస్ట్ షిజు కూతుపాలక్కల్ వివరించారు.

  • ఇన్ఫోసిస్: కొనుగోలు ధర రూ.1675; టార్గెట్ ధర రూ.1745; స్టాప్ లాస్ రూ.1635.
  • మిశ్రా ధాతు నిగమ్: కొనుగోలు ధర రూ.494. టార్గెట్ ధర రూ.520; స్టాప్ లాస్ రూ.481.
  • ఎల్ టి: కొనుగోలు ధర రూ.3590. టార్గెట్ ధర రూ.3650; స్టాప్ లాస్ రూ.3545.
  • ఎన్సీసీ: కొనుగోలు ధర రూ.198. టార్గెట్ ధర రూ.204; స్టాప్ లాస్ రూ.192
  • అపర్ ఇండస్ట్రీస్: కొనుగోలు ధర రూ.5625. టార్గెట్ ధర రూ.5850; స్టాప్ లాస్ రూ.5445.
  • గోద్రెజ్ కన్స్యూమర్: కొనుగోలు ధర రూ.1163. టార్గెట్ ధర రూ. 1210; స్టాప్ లాస్ రూ.1130.
  • ఐపిసిఎ ల్యాబ్స్: కొనుగోలు ధర రూ.1098. టార్గెట్ ధర రూ. 1155; స్టాప్ లాస్ రూ.1070.
  • హనీవెల్ ఆటోమేషన్ ఇండియా: కొనుగోలు ధర రూ.38,640. టార్గెట్ ధర రూ. 40,350; స్టాప్ లాస్ రూ.37,800.
  • కేన్స్ టెక్నాలజీ ఇండియా: కొనుగోలు ధర రూ.2845. టార్గెట్ ధర రూ. 3010; స్టాప్ లాస్ రూ.2770.

సూచన: ఈ కథనంలోని అభిప్రాయాలు నిపుణులవి మాత్రమే. హిందుస్తాన్ టైమ్స్ తెలుగుకు ఎటువంటి సంబంధం లేదు. పెట్టుబడులు పెట్టేముందు వ్యక్తిగత అధ్యయనంతో పాటు నిపుణుల సూచనలు తీసుకోవడం శ్రేయస్కరం.

WhatsApp channel