Stocks to buy today : టాటా మోటార్స్​, ఐటీసీ స్టాక్స్​.. ఇప్పుడు కొనాల్సిందే!-day trading guide for monday tata motors itc and other stocks to buy today ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For Monday: Tata Motors, Itc And Other Stocks To Buy Today

Stocks to buy today : టాటా మోటార్స్​, ఐటీసీ స్టాక్స్​.. ఇప్పుడు కొనాల్సిందే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 30, 2023 07:51 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​.. ((Photo: iStock))

Stocks to buy today : అదానీ గ్రూప్​ స్టాక్స్​ పతనంతో దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను భారీ నష్టాలతో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 874 పాయింట్ల నష్టంతో 59,331కి చేరింది. నిఫ్టీ50.. 287 పాయింట్లు కోల్పోయి 17,604 వద్ద స్థిరపడింది. బీఎస్​ఈ మిడ్​క్యాప్​ 1.29శాతం, బీఎస్​ఈ స్మాల్​క్యాప్​ 1.89శాతం మేర పడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ ప్రస్తుతం డౌన్​ ట్రెండ్​లోకి షిఫ్ట్​ అయ్యింది.

Stock market news in Telugu : "ఇక్కడి నుంచి నిఫ్టీ ర్యాలీ అయినప్పటికీ.. 17,750 లెవల్స్​ వద్ద బలమైన రెసిస్టెన్స్​ను ఎదుర్కొంటుంది. అక్కడి నుంచి అమ్మకాల ఒత్తిడి మరింత పెరగొచ్చు. 2023 బడ్జెట్​ మెగా ఈవెంట్​ ఉన్నందున.. మరో 1-2 సెషన్స్​లో వీక్​నెస్​ కనిపించొచ్చు. బడ్జెట్​ తర్వాతే.. నిఫ్టీకి స్పష్టమైన డైరక్షన్​ లభిస్తుంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి పేర్కొన్నారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో.. ఎఫ్​ఐఐలు రూ. 5977.86కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4252.33కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

US Stock market investments : అమెరికా స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.08శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.25శాతం, నాస్​డాక్​ 0.95శాతం మేర లాభపడ్డాయి.

స్టాక్స్​ టు బై..

Tata Motors share price target : టాటా మోటార్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 408, టార్గెట్​ రూ. 490

మహీంద్రా అండ్​ మహీంద్రా​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్, స్టాప్​ లాస్​ రూ. 1274, టార్గెట్​ రూ. 1390

ITC Share price target : ఐటీసీ లిమిటెడ్​:- బై రూ. 346, స్టాప్​ లాస్​ రూ. 340, టార్గెట్​ రూ. 360

దివీస్​ ల్యాబ్​:- బై రూ. 3387, స్టాప్​ లాస్​ రూ. 3340, టార్గెట్​ రూ. 3510

మెక్​డావెల్​:- బై రూ. 767, స్టాప్​ లాస్​ రూ. 755, టార్గెట్​ రూ. 790

Stocks to buy : కమిన్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్, స్టాప్​ లాస్​ రూ. 1360, టార్గెట్​ రూ. 1410- రూ. 1425

జైడస్​ లైఫ్​​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్, స్టాప్​ లాస్​ రూ. 421, టార్గెట్​ రూ. 440- రూ. 445

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం