Day Trading Guide Today: ట్రేడర్లు గమనించాల్సిన స్టాక్స్.. నేటి స్టాక్స్ టు బై లిస్ట్ ఇదే..
Day Trading Guide December 9: డే ట్రేడింగ్ చేసే వారు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే. అలాగే మార్కెట్‍ను ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయంటే..
Day Trading Guide December 9: నాలుగు సెషన్ల వరుస నష్టాల తర్వాత.. గురువారం మోస్తరు లాభాలతో భారత స్టాక్ మార్కెట్లు ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 160 పాయింట్లు పెరిగి 62,570.68 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 48.8 పాయింట్లు లాభపడి 18,609 వద్ద ఉంది. ముఖ్యంగా ఐటీతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్స్ లాభపడ్డాయి. మరి నేడు (డిసెంబర్ 9) మార్కెట్లు ఎలా ఉండొచ్చంటే..
ఎస్‍జీఎక్స్ నిఫ్టీ
SGX Nifty: ఎస్‍జీఎక్స్ నిఫ్టీని బట్టి చూస్తే నేడు (డిసెంబర్ 9) భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 83 పాయింట్ల పాజిటివ్‍తో ఉంది.
“వచ్చే వారంలో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను దూకుడుగానే పెంచుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. అయితే గుజరాత్‍లో బీజేపీ భారీ విజయం సాధించడం వల్ల దేశీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ద్రవ్యోల్బణం, జీపీపీ వృద్ధిపై ఆర్‍బీఐ కామెంట్లతో మార్కెట్‍లో సెంటిమెంట్ కాస్త దెబ్బతింది. అయితే ఎన్నికల ఫలితాలతో అది కాస్త మారినట్టు కనిపిస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరలు బారెల్‍కు 80 డాలర్లలోపు పడిపోవడం కూడా సెంటిమెంట్‍కు బలం చేకూరుస్తుంది. బలమైన ఎకానమిక్ డేటాతో పాటు అనుకూలమైన ప్రభుత్వ విధానాలు వస్తే మరింత సానుకూలంగా ఉంటుంది” అని మోతీలాల్ ఓస్వాల్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ కేమ్కా అంచనా వేశారు.
నిఫ్టీకి బలమైన సపోర్టుగా 18450 లెవెల్స్ ఉన్నాయని హెచ్‍డీఎఫ్‍సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి చెప్పారు. ఒకవేళ అది కూడా బ్రేక్ అయి అంతకంటే కిందికి వెళితే 18,150 లెవెల్స్ సపోర్టుగా ఉంటుందని చెప్పారు.
Stocks to Buy:ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే
కెనరా బ్యాంక్: బై ఎట్ కరెంట్ ప్రైస్(Buy), టార్గెట్: రూ.340, స్టాప్ లాస్: రూ.320.
ఎన్‍ఎండీసీ: బై (Buy), టార్గెట్: రూ.135, స్టాప్ లాస్: రూ.121.
ఎస్‍బీఐ: బై, టార్గెట్: రూ.618, స్టాప్ లాస్: రూ.612.75.
అంబుజా సిమెంట్స్: బై, టార్గెట్: రూ.595.9, స్టాప్ లాస్: రూ.589.5.
కోరమాండెల్ ఇంటర్నేషనల్: బై, టార్గెట్: రూ.1,030, స్టాప్ లాస్: రూ.885.
(గమనిక:- ఇవి నిపుణులు సూచనలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంత ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)