ఈ బైకుతో కస్టమర్లు లవ్‌లో పడ్డారు.. అమ్మకాల్లో నిజంగానే హీరో.. ధర కేవలం రూ.80 వేలు-customers fall in love with this bike its a hero in sales price 80 thousand rupees hero motocorp october sales 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ బైకుతో కస్టమర్లు లవ్‌లో పడ్డారు.. అమ్మకాల్లో నిజంగానే హీరో.. ధర కేవలం రూ.80 వేలు

ఈ బైకుతో కస్టమర్లు లవ్‌లో పడ్డారు.. అమ్మకాల్లో నిజంగానే హీరో.. ధర కేవలం రూ.80 వేలు

Anand Sai HT Telugu
Nov 09, 2024 01:00 PM IST

Hero Motocorp : ఇండియాలో హీరో బైకులకు మంచి క్రేజ్ ఉంది. ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో హీరో మోటోకార్ప్ దూసుకెళ్తోంది. అక్టోబర్ అమ్మకాల్లో అన్నింటికంటే ముందుగా ఉంది.

హీరో స్ప్లెండర్​ ప్లస్​
హీరో స్ప్లెండర్​ ప్లస్​ (HT AUTO)

హీరో మోటోకార్ప్ మరోసారి దేశంలోనే నంబర్ వన్ ద్విచక్ర వాహన కంపెనీగా నిలిచింది. అక్టోబర్ 2024కి సంబంధించిన బైక్‌లు, స్కూటర్ల విక్రయ నివేదికను హీరో బయటకు విడుదల చేసింది. పండుగ సీజన్‌లో హీరో విపరీతమైన విక్రయాలను చేసింది. అయితే ఈ కంపెనీకి చెందిన హీరో స్ప్లెండర్ భారీగా అమ్మకాలు నమోదు చేసింది.

అక్టోబర్ 2024లో హీరో మోటోకార్ప్ 6,79,091 యూనిట్ల బైక్‌లు, స్కూటర్‌ల అమ్మకాలు చేసింది. 2023లో ఈ సంఖ్య 5,74,930 యూనిట్లుగా ఉంది. ఈ విధంగా చూసుకుంటే.. కంపెనీ వార్షిక ప్రాతిపదికన 18.12 శాతం వృద్ధిని నమోదు చేసింది.

సెప్టెంబర్ 2024లో కంపెనీ మొత్తం 6,37,050 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అక్టోబర్‌లో 6.60 శాతం పెరుగుదల కనిపించింది. హీరోతో పోలిస్తే, హోండా గత నెలలో 5,97,711 యూనిట్ల ద్విచక్ర వాహనాలను మాత్రమే విక్రయించింది. హీరో స్కూటర్ల కంటే ఎక్కువ మోటార్‌సైకిళ్లను విక్రయించింది. అక్టోబర్ 2024లో, హీరో 6,35,787 యూనిట్ల బైక్‌లను విక్రయించగా, 43,304 యూనిట్ల స్కూటర్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

ఈ అమ్మకాల్లో హీరో స్ప్లెండర్ బైక్ కీలక పాత్ర పోషించింది. హీరో స్ప్లెండర్ అనేక వేరియంట్లలో వస్తుంది. దీని చౌకైన వేరియంట్ స్ప్లెండర్ ప్లస్ రూ. 76,356 నుండి రూ. 77,496 ఎక్స్-షోరూమ్ మధ్య ఉంటుంది. ఇది లీటరుకు 80.6 కిమీల వరకు మైలేజీని ఇస్తుంది. ఈ బైకును ఎక్కువమంది కొనేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీని ధరతోపాటుగా మైలేజీ కూడా ఇందుకు ఓ కారణం.

హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ మోటార్‌సైకిల్ ధర రూ. 97,089 నుండి రూ. 1 లక్ష వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్). ఇందులో 97.2 cc పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 8.02 పీఎస్ హార్స్ పవర్, 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 82,298 నుండి రూ. 86,298 మధ్య ఉంది. ఇది 124.7 సీసీ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 10.7 పీఎస్ శక్తిని, 10.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 69 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.

హీరో స్ప్లెండర్ ఎక్స్‌టెక్ మోటార్‌సైకిల్ ధర రూ. 83,350 నుండి రూ. 87,350 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇందులో 124.7 సిసి పెట్రోల్ ఇంజన్ వస్తుంది. ఈ ఇంజన్ 10.84పీఎస్ పవర్, 10.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్ప్లెండర్‌తో పాటు హీరో లైనప్‌లో హెచ్ఎప్ డీలక్స్, మావెరిక్ 440, కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్, గ్లామర్ వంటి బైక్‌లు ఉన్నాయి. ప్లెజర్ ప్లస్, జూమ్, డెస్టినీ 125 ఎక్స్‌టెక్, ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ వంటి స్కూటర్‌లను కూడా విక్రయిస్తుంది. మెుత్తానికి హీరో మోటోకార్ప్ అమ్మకాల్లో దూసుకెళ్తోంది.

Whats_app_banner