Customary ‘halwa’ ceremony: హల్వా ఉత్సవంలో ఉత్సాహంగా నిర్మల సీతారామన్
Customary ‘halwa’ ceremony: కేంద్ర బడ్జెట్ (Budget 2023) ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు సంప్రదాయంగా నిర్వహించే హల్వా ఉత్సవం (‘halwa’ ceremony) గురువారం పార్లమెంటులోని నార్త్ బ్లాక్ లో జరిగింది.

Customary ‘halwa’ ceremony: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ హల్వా తయారీ (‘halwa’ ceremony) కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతీ ఏటా బడ్జెట్ పత్రాల క్రోడీకరణను ప్రారంభించే ముందు సంప్రదాయంగా హల్వా ఉత్సవం (‘halwa’ ceremony) నిర్వహిస్తారు. స్వయంగా ఆర్థిక మంత్రి ఈ హల్వా తయారీ కార్యక్రమంలో (‘halwa’ ceremony) పాల్గొంటారు. బడ్జెట్ రూపకల్పనలో పాల్గొనే అధికారులకు స్వయంగా హల్వా అందజేస్తారు. ఈ హల్వా ఉత్సవంలో (‘halwa’ ceremony) ఆర్థిక శాఖ సహాయ మంత్రులు భగవత్ కిషన్ రావు కరాద్, పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Customary ‘halwa’ ceremony: ఫిబ్రవరి 1న
కేంద్ర బడ్జెట్ (Budget 2023) ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ హల్వా ఉత్సవంతో ప్రారంభమవుతుంది. నేటి నుంచి బడ్జెట్ (Budget 2023) ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేవరకు ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారులంతా ఇళ్లకు కూడా వెళ్లకుండా అక్కడే ఉంటారు. బడ్జెట్ (Budget 2023) ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తరువాతనే వారు నార్త్ బ్లాక్ నుంచి బయటకు వెళ్తారు. సాధారణంగా బడ్జెట్ రూపొందించే ప్రక్రియ ప్రతీ సంవత్సరం అక్టోబర్ తొలి వారంలో ప్రారంభమవుతుంది.
Customary ‘halwa’ ceremony: పేపర్ లెస్ బడ్జెట్
ఈ సారి కూడా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేపర్ లెస్ బడ్జెట్ (Budget 2023) నే ప్రవేశపెట్టనున్నారు. గత రెండు సంవత్సరాలుగా నిర్మల సీతారామన్ ఈ బడ్జెట్ (e -Budget) నే ప్రవేశపెడ్తున్నారు. బడ్జెట్ (Budget 2023) ను ప్రవేశపెట్టిన రోజు నుంచి బడ్జెట్ (Budget 2023) పత్రాలు “Union Budget Mobile App” లో అందుబాటులో ఉంటాయి.