Credit Score myths : సంపాదన ఎక్కువ ఉంటే క్రెడిట్​ స్కోర్​ అధికంగా ఉంటుందా?-credit score 7 myths that most people believe ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Credit Score Myths : సంపాదన ఎక్కువ ఉంటే క్రెడిట్​ స్కోర్​ అధికంగా ఉంటుందా?

Credit Score myths : సంపాదన ఎక్కువ ఉంటే క్రెడిట్​ స్కోర్​ అధికంగా ఉంటుందా?

Sharath Chitturi HT Telugu
Published Feb 19, 2025 01:30 PM IST

Credit Score myths : క్రెడిట్​ స్కోర్​ చుట్టూ చాలా మందిలో కొన్ని అపోహలు ఉంటాయి. సంపాదన ఎక్కువగా ఉంటే క్రెడిట్​ స్కోర్​ అధికంగా ఉంటుందా? వంటి వాటితో పాటు మరికొన్ని అపోహలు, వాస్తవాలను ఇక్కడ తెలుసుకోండి..

క్రెడిట్​ స్కోర్​పై అనేక అపోహలు.. అసలు నిజాలు ఏంటంటే..
క్రెడిట్​ స్కోర్​పై అనేక అపోహలు.. అసలు నిజాలు ఏంటంటే..

క్రెడిట్​ స్కోర్​ అనేది ఫైనాన్షియల్​ ప్రపంచంలో చాలా ముఖ్యం! లోన్​ తీసుకోవాలన్నా, లోన్​ ఇవ్వాలన్నా ఈ క్రెడిట్​ స్కోర్​ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్​ స్కోర్​ అనేది మీ క్రెడిట్ అర్హతను సూచించే మూడు అంకెల సంఖ్య.

తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే క్రెడిట్​ అర్హత తక్కువగా ఉంటుంది. అదే సమయంలో క్రెడిట్​ స్కోర్​ ఎక్కువగా ఉంటే, క్రెడిట్ అర్హత ఎక్కువగా ఉంటుంది. బ్యాంకులు ఎవరికైనా రుణాలు ఇవ్వడానికి ముందు, అవి ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్ ద్వారా అతని / ఆమె క్రెడిట్ అర్హతను అంచనా వేస్తాయి.

క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తే, సదరు వ్యక్తి ఆర్థికంగా దృఢంగా ఉన్నారని బ్యాంక్​లకు అర్థమవుతుంది. కాబట్టి రుణాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఆర్థికంగా బలంగా లేడని అర్థం, తద్వారా ఆ వ్యక్తికి బ్యాంకు రుణం అందకపోవచ్చు. అయితే ఈ క్రెడిట్​ స్కోర్​ చుట్టూ సాధారణంగా కొన్ని అపోహలు ఉంటాయి. వాటిని ఇక్కడ తెలుసుకోండి..

క్రెడిట్ స్కోర్- ఇవి అపోహలు మాత్రమే..

క్రెడిట్​ స్కోర్​ని తరచూ చెక్​ చేస్తే, స్కోర్​ పడిపోతుంది : తరచుగా చెక్​ చేస్తే మీ క్రెడిట్ స్కోరు క్షీణిస్తుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో సాఫ్ట్​ అండ్​ హార్డ్​ ఎంక్వైరీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాఫ్ట్ ఎంక్వైరీ అనేది మీరు మీ స్కోరును తనిఖీ చేసేటప్పుడు జరుగుతుంది. మీరు రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు హార్డ్ ఎంక్వైరీ జరుగుతుంది.

మీ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేసేటప్పుడు క్రెడిట్ స్కోర్ కోల్పోరు. అయితే మీరు రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు మీ స్కోరులో తాత్కాలికంగానైనా కొద్దిగా ప్రభావితం అవుతుంది.

II. రుణం తీసుకుంటే క్రెడిట్​ స్కోరు పడిపోతుంది : రుణం పొందడం క్రెడిట్ స్కోర్​కు చెడ్డదనే మరో తప్పుడు అభిప్రాయం ఉంది.

III. క్రెడిట్ కార్డ్​తో క్రెడిట్ స్కోర్​కి నష్టం జరుగుతుంది: క్రెడిట్ కార్డును తీసుకోవడం క్రెడిట్ ప్రొఫైల్​ను నిర్మించడంలో సహాయపడుతుంది. కాబట్టి, కొందరు నమ్ముతున్నట్లు క్రెడిట్ స్కోర్​కి ఇది హాని చేయదు.

IV.ఎక్కువ క్రెడిట్ కార్డులు క్రెడిట్ స్కోర్​కు చెడ్డవి: మీరు పెద్ద సంఖ్యలో క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నప్పుడు, మీకు అధిక క్రెడిట్ లిమిట్ ఉంటుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్​కు మంచిది! నెగిటివ్​ కాదు.

VI.పాత క్రెడిట్ కార్డులను మూసివేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది: ఇది కూడా నిజం కాదు. వాస్తవానికి, పాత ఖాతాలను మూసివేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.

VII.అధిక ఆదాయం- అధిక క్రెడిట్ స్కోర్​కు దారితీస్తుంది: మీ ఆదాయం మీ క్రెడిట్ స్కోరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపదు. సీఆర్​ఐఎఫ్ హై మార్క్ వంటి క్రెడిట్ బ్యూరోలు మీ జీతం ఆధారంగా కాకుండా మీ క్రెడిట్ బిహేవియర్​ ఆధారంగా మీ స్కోరును లెక్కిస్తాయి. కాబట్టి, సకాలంలో బిల్లులు క్లియర్ చేయడం, క్రెడిట్​ని బాధ్యతాయుతంగా ఉపయోగించడం, రుణాలను సమర్థవంతంగా నిర్వహించడం అనేవి ముఖ్యం కాదు.

(గమనిక: లోన్​ తీసుకోవడం రిస్క్​తో కూడుకున్న వ్యవహారం అని గుర్తుపెట్టుకోవాలి.)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం