Budget 2025 : ఎంఎస్ఎంఈలకు ‘బడ్జెట్’- కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులతో పాటు మరిన్ని..
సూక్ష్మ సంస్థలకు రూ.5 లక్షల పరిమితితో కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టడం వల్ల ఎస్ఎంఈలకు వర్కింగ్ క్యాపిటల్ సులభంగా లభిస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ మేరకు బడ్జెట్ 2025లో ప్రసంగించారు.
దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు “బడ్జెట్ 2025”లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త ఇచ్చారు. సీతారామన్ తన ఎనిమిదో బడ్జెట్ ప్రసంగంలో క్రెడిట్ గ్యారంటీ కవర్ పరిమితులు సహా ఈ రంగానికి కేటాయింపులను పెంచబోతున్నట్లు పేర్కొన్నారు.

సూక్ష్మ పరిశ్రమలైన ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కవరేజీని రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు రెట్టింపు చేయనున్నాట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఫలితంగా వచ్చే ఐదేళ్లలో అదనంగా రూ.1.5 లక్షల కోట్ల రుణం లభిస్తుందని వివరించారు.
సూక్ష్మ సంస్థలకు కొత్త క్రెడిట్ కార్డులు..
చిన్న వ్యాపారాల కోసం రూ .5 లక్షల పరిమితితో కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులను అందించనున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇందుకోసం సదరు వ్యాపారాలు “ఉద్యోగ్ పోర్టల్”లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీని వల్ల ఎస్ఎంఈలకు వర్కింగ్ క్యాపిటల్ సులభంగా లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
కేంద్ర బడ్జెట్ 2025లోని ఈ చర్య ఎంఎస్ఎంఈలకు రుణ కవరేజీని గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు.
మొదటి సంవత్సరంలో 10 లక్షల వ్యాపారాలకు ఈ క్రెడిట్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ వివరించారు. ఎంఎస్ఎంఈ వర్గీకరణ పరిమితిని 2.5 రెట్లు చేయబోతున్నామని, అందులోని టర్నోవర్ పరిమితులను కూడా రెట్టింపు చేయబోతున్నామని ఆమె తెలిపారు.
“ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే చర్య”
కేంద్రం చేపట్టిన తాజా చర్యలతో ఎంఎస్ఎంఈలకు ఎంతో అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని లభిస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దేశంలోని యువతకు ఇవి ఉద్యోగాలు తీసుకొస్తాయని అన్నారు. 1 కోటికి పైగా రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు 7.5 కోట్లకు పైగా ప్రజలకు ఎలా ఉపాధి కల్పిస్తున్నాయో ఆమె తన బడ్జెట్ 2025 ప్రసంగంలో వివరించారు.
అందువల్ల, ఇది మొత్తం ఎంఎస్ఎంఈ రంగానికి సానుకూల పరిణామం.
భారత ఎగుమతుల్లో 45 శాతం, దేశ తయారీ రంగంలో దాదాపు 37 శాతం ఎంఎస్ఎంఈల వాటా ఉందని నిర్మల వివరించారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఈ ప్రకటన వల్ల అందులో పనిచేసే వారికి విలువ పెరుగుతుందని భావిస్తున్నారు.
10 లక్షల కొత్త క్రెడిట్ కార్డుల ప్రభావం ఎలా ఉంటుంది?
మొదటి సంవత్సరంలో 10 లక్షల కొత్త క్రెడిట్ కార్డులను వ్యాపారాలకు ప్రవేశపెట్టడం వల్ల పారదర్శకత వస్తుంది. కాగితపు పని తగ్గుతుంది. క్రెడిట్ ప్రాసెసింగ్ మరింత సజావుగా ఉంటుంది. అందువల్ల, ఈ చర్య ఈ రంగం మొత్తం సెంటిమెంట్‌ని బలపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
సంబంధిత కథనం