ఈ మధ్యకాలంలో అవసరం ఉన్నా, లేకపోయినా.. నెలవారీ జీతం వస్తున్న దాదాపు ప్రతి వ్యక్తి దగ్గర క్రెడిట్ కార్డు కనిపిస్తోంది. నిరంతరం అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థలో, క్రెడిట్ కార్డులు ఒక ముఖ్యమైన ఆర్థిక సాధనంగా ఆవిర్భవించాయి. రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్స్‌తో ఈ క్రెడిట్ కార్డులు మరింత అట్రాక్టివ్‌గా మారుతున్నాయి. దీంతో వినియోగదారుల్లో వీటికి ఆదరణ లభిస్తోంది. అయినప్పటికీ, క్రెడిట్ కార్డులను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా లిమిట్కి మించి క్రెడిట్ వార్డును వాడితే చాలా నష్టాలు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 'ఓవర్ లిమిట్'కు వెళ్లడం వల్ల అదనపు ఛార్జీలు, వడ్డీతో పాటు మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు 'ఓవర్ లిమిట్' ఫెసిలిటీ అంటే ఏంటి? దానితో వచ్చే నష్టాలేంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఓవర్-లిమిట్ సదుపాయం ప్రాథమికంగా క్రెడిట్ కార్డు హోల్డర్లు తమకు మంజూరు చేసిన క్రెడిట్ పరిమితికి మించి ఖర్చు చేయడానికి విలు కల్పిస్తుంది. ఉదాహరణకు, మీ క్రెడిట్ కార్డుపై మీకు రూ .1 లక్ష క్రెడిట్ లిమిట్ ఉంటే, ఈ ఓవర్ లిమిట్ కింద మీరు మీ క్రెడిట్ కార్డుపై అనుమతించిన పరిమితి కంటే ఎక్కువ ఉపయోగించుకోవచ్చు!
ఆకస్మిక పరిణామాలు, అత్యవసర పరిస్థితులు లేదా ఊహించని ఖర్చులను ఎదుర్కొన్నప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే, ఈ ప్రత్యేక సదుపాయాన్ని ఉపయోగించడం వల్ల అదనపు ఫీజులు, వడ్డీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇచ్చిన క్రెడిట్ లిమిట్‌ని దాటినప్పుడల్లా చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఓవర్ లిమిట్ ఫీజులు వసూలు చేస్తాయి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి:
ఈ రుసుములు 18% జీఎస్టీకి లోబడి ఉంటాయి. వీటి పైన, మీ కార్డుకు వర్తించే ప్రామాణిక వడ్డీ రేటు, సాధారణంగా నెలకు 3% నుండి 3.75% వరకు ఉంటుంది, ఓవర్-లిమిట్ మొత్తంపై వసూలు చేస్తారు.
అయితే, ఈ ఛార్జీలు ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధంగా ఉంటుంది. క్రెడిట్ కార్డు తీసుకునే ముందే వీటి గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకారం, క్రెడిట్ కార్డు హోల్డర్లు ఓవర్-లిమిట్ సదుపాయాన్ని పొందడానికి వారి స్పష్టమైన సమ్మతిని అందించాలి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేయడానికి లేదా నిలిపివేయడానికి వినియోగదారులకు ఆప్షన్లను అందించడం తప్పనిసరి.
లిమిట్కి మించి క్రెడిట్ కార్డును వాడితే మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. మీ క్రెడిట్ స్కోరును తగ్గొచ్చు. మీరు మీ క్రెడిట్ పరిమితిని దాటినప్పుడు, మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి ఆటోమెటిక్‌గా పెరుగుతుంది.
అన్ని ఆధునిక క్రెడిట్ స్కోరింగ్ మోడళ్లలో ఇది ఒక ముఖ్యమైన అంశం. అధిక రుణ నిష్పత్తి అంటే ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. మరు రుణంపై అధికంగా ఆధారపడుతున్నారని అర్థమవుతుంది, తద్వారా రుణదాతల దృష్టిలో మీ రుణ అర్హత తగ్గుతుంది.
మీ ఆర్థిక శ్రేయస్సు కోసం క్రెడిట్ కార్డును లిమిట్కి మించి వాడకపోవడం బెటర్. ఇలా చేస్తే మీరు చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు, భవిష్యత్తులో లోన్ తీసుకోవడానికి ఇబ్బందులు ఉండవు.
(గమనిక- క్రెడిట్ కార్డులు రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)
సంబంధిత కథనం