వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు.
వంటగ్యాస్ ధర పెంపు ఉజ్వల మరియు సాధారణ వినియోగదారులకు ఇద్దరికీ వర్తిస్తుందని మంత్రి చెప్పారు. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 855గా ఉంది. పెరిగిన ధరతో ఇది రూ. 905 కానుంది.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ రేట్లు రూ. 2 పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి నోటిఫికేషన్ వచ్చిందని హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఈ భారాన్ని వినియోగదారుడికి బదలాయించబోమని స్పష్టం చేస్తున్నాను' అని పేర్కొన్నారు.
"అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 60 డాలర్లకు తగ్గింది. అయితే, మా చమురు మార్కెటింగ్ కంపెనీలు 45 రోజుల పాటు నిల్వలను కలిగి ఉంటాయని గుర్తుంచుకోండి. జనవరిలో ముడి చమురు ధర 83 డాలర్లు కాగా, ఆ తర్వాత 75 డాలర్లకు తగ్గింది. కాబట్టి, వారు సగటున 75 డాలర్ల వద్ద ముడి చమురు నిల్వలను కలిగి ఉన్నారు" అని పూరి చెప్పారు.
"ప్రపంచ ధరలకు అనుగుణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మీరు ఆశించవచ్చు. నియంత్రణలు లేని రంగంలో, వారు మార్కెట్ రిటైల్ ధరను తదనుగుణంగా సర్దుబాటు చేస్తారని మీరు ఆశించవచ్చు" అని ఆయన తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్