Jackpot to Employees: ‘టేబుల్ పై రూ.80 కోట్లు; లెక్కపెట్టిగలిగినంత తీసుకోండి’; ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్
Jackpot to Employees: చైనాకు చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగులకు ఇయర్ ఎండ్ బోనస్ లో భాగంగా ఒక బంపర్ ఆఫర్ ను ఇచ్చింది. ఒక టేబుల్ పై రూ. 80 కోట్ల నగదును ఉంచి, అందులో నుంచి లెక్కపెట్టుకోగలిగినంత నగదును తీసుకోవచ్చని ఆఫర్ చేసింది. ఉద్యోగులు ఆ నగదును లెక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Jackpot to Employees: కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు సంవత్సరం చివరలో బోనస్ లు ఇస్తుంటాయి. అయితే, చైనాకు చెందిన ఈ కంపెనీ తన ఉద్యోగులకు వినూత్నంగా బోనస్ ను అందించాలని భావించింది. ఉద్యోగుల కోసం ఒక పార్టీని ఏర్పాటు చేసింది. బోనస్ డబ్బును పొందడానికి ఉద్యోగుల మధ్య ఒక ఆసక్తికర పోటీని ఏర్పాటు చేసింది.
టేబుల్ పై 80 కోట్ల నగదు
చైనాకు చెందిన హెనన్ మైనింగ్ క్రేన్ కంపెనీ యాజమాన్యం 11 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన నగదును ఒక టేబుల్ పై ఉంచింది. 15 నిమిషాల్లో ఉద్యోగులు "వారు కోరుకున్నంత నగదును లెక్కించి తీసుకోవచ్చని" ఉద్యోగులకు తెలిపింది. దాంతో, ఉద్యోగులు ఆ టేబుల్ పై ఉన్న నగదులో నుంచి సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని లెక్కించి తీసుకోవడానికి శాయశక్తులా కృషి చేశారు.
సోషల్ మీడియాలో వైరల్
ఉద్యోగులు టేబుల్ పై ఉన్న నగదును లెక్కించి తీసుకుంటుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనా సోషల్ మీడియా సైట్లు డౌయిన్, వీబోలో ఈ వీడియోను షేర్ చేశారు. హెనన్ మైనింగ్ క్రేన్ కంపెనీ లిమిటెడ్ ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వీడియో ప్రారంభంలో డబ్బుతో నిండిన ఒక పెద్ద టేబుల్ కనిపిస్తుంది. ఉద్యోగులు తమ బోనస్ లను ఇంటికి తీసుకెళ్లడానికి నగదును లెక్కించడం ప్రారంభిస్తారు.
15 నిమిషాల్లో 100 కె యువాన్
ఈ పోటీలో ఒక వ్యక్తి 15 నిమిషాల్లో $ 100 కె యువాన్ (18.7 కె) విలువైన నగదును లెక్కించగలిగాడు. ఇతర ఉద్యోగులు నగదును సమీకరించి వీలైనంత వేగంగా డబ్బును లెక్కించడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
సోషల్ మీడియా రియాక్షన్స్..
ఈ వీడియోపై ప్రజలు రకరకాలుగా స్పందించారు. పలువురు సరదాగా సెటైర్లు వేశారు. "నా కంపెనీ కూడా అంతే. కానీ డబ్బుకు బదులుగా వారు పనిభారాన్ని ఇస్తారు. "ఇది నాకు కావలసిన పేపర్ వర్క్, కానీ కంపెనీకి వేరే ప్రణాళికలు ఉన్నాయి" అని మరొకరు చెప్పారు. "మీరు ఈ సర్కస్ చర్యకు బదులుగా కార్మికుల ఖాతాల్లో వీలైనంత మొత్తాన్ని జమ చేయవచ్చు. కానీ గ్రేట్ వాల్ వెనుక వేరే ప్రపంచం ఉంది’’ అని మరో వ్యక్తి విమర్శించారు. ఈ చైనా కంపెనీ 2023లో వార్షిక విందు సందర్భంగా ఉద్యోగులకు పెద్ద మొత్తంలో డబ్బును పంపిణీ చేసింది.