Warranty Fraud : వారంటీల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు.. అమ్మిన తేదీ నుంచే లెక్క!
Warranty Check : వారంటీ పేరుతో వినియోగదారులను తప్పుదోవ పట్టించేవారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు ప్రణాలికలు చేస్తోంది.
ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటుంది. వారంటీ పేరుతో వినియోగదారులను మోసగించే ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వం చెబుతోంది. ఎలక్ట్రానిక్ వస్తువుల కంపెనీలు వారంటీ గురించి వినియోగదారులకు స్పష్టమైన సమాచారం అందించాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కంపెనీలు ఉత్పత్తి కొనుగోలుదారులకు ఉత్పత్తి వారంటీ వ్యవధి గురించి సరైన సమాచారాన్ని అందించాలి.
ఏదైనా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌కు వారంటీ అది విక్రయించిన తేదీ నుంచి ఉంటుందని, తయారీ తేదీ నుంచి కాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అటువంటి షరతు పెట్టడం వల్ల ఉత్పత్తి వారంటీ తగ్గుతుంది. వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్ 2 (9) ప్రకారం, ఏదైనా ఉత్పత్తి సర్వీస్, నాణ్యత, పరిమాణం, సామర్థ్యం, స్వచ్ఛత, ప్రమాణం, ధరను విక్రయించే ముందు కస్టమర్‌కు సమాచారాన్ని పొందే హక్కు ఉంది.
నిజమైన వారంటీ చాలా స్వల్పకాలికమైనది, అయితే వినియోగదారుడికి ఉత్పత్తి వారంటీ గురించి వేరే రీతిలో చెప్పడం కనిపిస్తుంది. దీనిలో అనేక షరతులు దాచిపెడతారు అమ్మేవారు. వస్తువులకు 5 నుండి 10 సంవత్సరాల వారంటీ ఉంటుందని చెబుతారు. అయితే దాని వివరాలను నిశితంగా అధ్యయనం చేసిన తర్వాత వాస్తవ వారంటీ చాలా తక్కువ సమయం. దీనికి అన్ని రకాల షరతులు కూడా జోడిస్తారు.
వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి 125 రోజుల ప్రణాళిక కింద ఐఏఎస్ కోచింగ్ సంస్థలకు తప్పుదోవ పట్టించే ప్రకటనలు, సరోగేట్ యాడ్స్, వివిధ రకాల ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనుంది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ప్రజలను కొనుగోలుకు ఆకర్షించే మోసపూరిత పద్ధతుల ద్వారా వినియోగదారుల హక్కుల ఉల్లంఘన కేసులు పెరుగుతున్నందున ఈ చర్య తీసుకోనుంది.
వినియోగదారులకు సంబంధించిన చాలా అంశాలకు మార్గదర్శకాలను ఖరారు చేసే పనిలో ఉన్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరికొద్ది నెలల్లో అన్ని మార్గదర్శకాలను ఖరారు చేసి ప్రజల అభిప్రాయాల కోసం జారీ చేయాలని భావిస్తున్నారు. ఈ మార్గదర్శకాలను సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ జారీ చేయనుంది.
ముసాయిదా నిబంధనల ప్రకారం సివిల్ సర్వీసెస్ పరీక్షల కోచింగ్ సంస్థలు టాపర్ల వ్యక్తిగత వివరాలను వారి అనుమతి లేకుండా తమ ప్రకటనల్లో ఉపయోగించడానికి వీల్లేదు. ఈ మార్గదర్శకాలు మోసపూరిత వ్యాపార పద్ధతులను నియంత్రించే ప్రయత్నంలో భాగం. దీంతో ఈ కంపెనీల తప్పుడు వాదనలతో వినియోగదారులు మోసపోకుండా చూసుకోవచ్చు. ఇప్పటికే సరోగేట్ యాడ్స్ మీద కేంద్రం ఫోకస్ పెడుతుంది.
టాపిక్