నూతన ఆర్థిక సంవత్సరం మొదటి రోజే ప్రజలకు గుడ్ న్యూస్ అందింది! ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు తగ్గించాయి. తాజా ప్రకటన ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ .41 దిగొచ్చింది. ఫలితంగా నేడు దేశవ్యాప్తంగా ఈ సిలిండర్ చౌకగా మారింది.
ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ఏప్రిల్ 1 నుంచి రూ .41 తగ్గి రూ .1762కు చేరుకుంది. అంతకుముందు మార్చ్‌లో ఇది రూ.1803గా ఉంది. అదే సమయంలో పాట్నాలో రూ.2031గా ఉంది.
కోల్‌కతాలో మార్చ్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1913గా ఉంది. నేడు రూ.44.50 తగ్గి రూ.1868.50కి చేరింది. ముంబైలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1755.50 నుంచి రూ.1713.50కి తగ్గింది.
మరోవైపు చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1965.50 నుంచి రూ. 1924.50కి దిగొచ్చింది.
ఇక హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 44 తగ్గి, రూ. 1,985.50కి చేరింది.
కాగా ఇళ్లల్లో వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధర తగ్గలేదు, పెరగలేదు. స్థిరంగా ఉంది. ఫలితంగా హైదరాబాద్‌లో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 855 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ని రెస్టారెంట్లతో పాటు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. ఈ ధరలు తగ్గితే రెస్టారెంట్లపై భారం తగ్గుతుంది. ఫలితంగా రేట్లు తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది కస్టమర్స్‌కి మంచి చేస్తుంది.
అంతర్జాతీయ డిమాండ్ ప్రకారం ఎల్పీజీ సిలిండర్ రేట్లను ప్రతి నెల మొదటి రోజున చమురు మార్కెటింగ్ సంస్థలు సవరిస్తుంటాయి. మార్చ్ నెలలో 19 కేజీల సిలిండర్ ధర రూ. 6 పెరిగింది. అంతకముందు నెలలో 9 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 7 తగ్గించాయి.
ఎల్పీజీ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. ప్రధానంగా స్థానిక పన్నులు, రవాణా ఖర్చులలో వ్యత్యాసం ఇందుకు కారణం.
సంబంధిత కథనం