Coal India Q2 results : క్యూ2లో.. 106శాతం పెరిగిన కోల్​ ఇండియా లాభాలు!-coal india q2 results profit soars 106 percent to 6044 crores ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Coal India Q2 Results, Profit Soars 106 Percent To 6044 Crores

Coal India Q2 results : క్యూ2లో.. 106శాతం పెరిగిన కోల్​ ఇండియా లాభాలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 07, 2022 08:06 PM IST

Coal India Q2 results 2022 : కోల్​ ఇండియా.. క్యూ2లో 106శాతం లాభాలను నమోదుచేసింది. ఈ మేరకు సోమవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

క్యూ2లో.. 106శాతం పెరిగిన కోల్​ ఇండియా లాభాలు!
క్యూ2లో.. 106శాతం పెరిగిన కోల్​ ఇండియా లాభాలు!

Coal India Q2 results 2022 : ప్రభుత్వ ఆధారిత కోల్​ ఇండియా.. 2023 ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికం ఫలితాలను సోమవారం ప్రకటించింది. క్యూ2లో కోల్​ ఇండియా నెట్​ ప్రాఫిట్​.. 106శాతం వృద్ధి చెంది, రూ. 6,043.55కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో నెట్​ ప్రాఫిట్​ రూ. 2,936.91కోట్లుగా ఉండేది.

ట్రెండింగ్ వార్తలు

క్యూ1తో పోల్చుకుంటే.. క్యూ2లో కోల్​ ఇండియా ప్యాట్​(ప్రాఫిట్​ ఆఫ్టర్​ ట్యాక్స్​).. 32శాతం పతనమైంది. ఈ మైనింగ్​ సంస్థ కన్సాలిడేటెడ్​ రెవెన్యూ ఫ్రం ఆపరేషన్స్​.. రూ. 29,838కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 23,291కోట్లుగా నమోదైంది.

కోల్​ ఇండియా పీబీటీ(ప్రాఫిట్​ బిఫోర్​ ట్యాక్స్​).. గతేడాది ఇదే త్రైమాసికంతో(రూ. 3,643కోట్లు) పోల్చుకుంటే.. 111శాతం పెరిగి రూ. 7,687కోట్లుగా నమోదైంది.

Coal India Q2 results : ఇక కోల్​ ఇండియా ఖర్చులు క్యూ2లో రూ. 23,770కోట్లుకు చేరాయి. గతే ఆర్థిక ఏడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 20,424.52కోట్లుగా ఉండేది.

త్రైమాసిక ఫలితాలతో పాటు డివిడెండ్​ను కూడా ప్రకటించింది కోల్​ ఇండియా. షేరుకు రూ. 15ను డివిడెండ్​గా ఇవ్వనున్నట్టు పేర్కొంది.

Coal India results : ఈ ఆర్థిక ఏడాదిలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల్లో కోల్​ ఇండియా ఇప్పటికే 98శాతం పూర్తి చేసిందని.. బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి ఇటీవలే తెలిపారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో.. 700మిలియన్​ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని టార్గెట్​ పెట్టుకుంది కోల్​ ఇండియా లిమిటెడ్​. దేశీయ కోల్​ ఔట్​పుట్​లో కోల్​ ఇండియా వాటా 80శాతంగా ఉంది.

ఇక ఈ ఏడాది ఏప్రిల్​- అక్టోబర్​ మధ్య కాలంలో కోల్​ ఇండియా ఉత్పత్తి 174శాతం పెరిగి 351.9మిలియన్​ టన్నులకు చేరింది. సెప్టెంబర్​లో 49.8ఎంటీ బొగ్గు ఉత్పత్తి కాగా.. అక్టోబర్​ నెలలో అది 52.9ఎంటీలకు పెరిగింది.

కోల్​ ఇండియా స్టాక్​ ప్రైజ్​..

Coal India share price : సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి.. కోల్​ ఇండియా స్టాక్​ ధర 1.40శాతం పెరిగి రూ. 249.50 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్​.. ఐదు రోజుల్లో 1.7శాతం వృద్ధిచెందింది. ఇక నెల రోజుల్లో ఏకంగా 8.55శాతం పెరిగింది. 6 నెలల్లో 36.3శాతం పెరిగింది కోల్​ ఇండియా షేరు ధర. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 60.66శాతం వృద్ధిని నమోదు చేసింది.

WhatsApp channel

సంబంధిత కథనం