పెట్రోల్, డీజిల్‌తో పోల్చితే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తూ, ఎలక్ట్రిక్ వాహానాల్లో ఉండే రేంజ్ యాంగ్జైటీ (బ్యాటరీ ఛార్జింగ్‌పై ఆందోళనలు) లేని క్లీనర్ ఫ్యూయెల్ టెకనాలజీగా సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ప్రస్తుతం భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో దూసుకెళుతోంది. సీఎన్జీ వాహనాలకు ఉన్న డిమాండ్ చూసి ఈ రంగంలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి దిగ్గజాలు వాహనాలను విక్రయిస్తుండటమే కాకుండా.. రెనాల్ట్, నిస్సాన్ వంటి ఇతర ఓఈఎంలు కూడా తమ వాహనాలకు సీఎన్జీ రెట్రోఫిట్‌మెంట్ కిట్‌లను అందిస్తున్నాయి. టయోటా కూడా మారుతీ సుజుకీ మోడళ్లను రీబ్రాండ్ చేసి భారతదేశంలో సీఎన్జీ కార్లను విక్రయిస్తోంది.
క్యాలెండర్ సంవత్సరం 2024లో, సీఎన్జీ ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు 35 శాతం భారీ వృద్ధిని నమోదు చేశాయి. ఇది క్లీనర్ ఫ్యూయల్ ఆకర్షణీయమైన ప్రయోజనాలను స్పష్టం చేస్తోంది. మారుతీ సుజుకీ తన 15 సీఎన్జీ మోడళ్లతో తొలిసారిగా సంవత్సరానికి 5 లక్షల యూనిట్లకు పైగా విక్రయించి, 71.60 శాతం మార్కెట్ వాటాతో ఈ విభాగంలో తన పట్టును నిలుపుకుంది. టాటా మోటార్స్ 1,15,432 యూనిట్లను విక్రయించి, 16.13 శాతం మార్కెట్ వాటాను పొందింది. వాహన్ డేటా ప్రకారం, గత క్యాలెండర్ సంవత్సరంలో హ్యుందాయ్ 71,811 యూనిట్లు, టయోటా 15,815 యూనిట్లను విక్రయించాయి. ఈ రెండు ఓఈఎంలు వరుసగా 10.04 శాతం, 2.21 శాతం మార్కెట్ వాటాలను నమోదు చేశాయి.
ఒక్క సీవై24లో టాటా సీఎన్జీ కార్ల మార్కెట్ వాటా అత్యధికంగా 77 శాతం పెరిగింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టయోటా వరుసగా 30 శాతం, 16 శాతం, 118 శాతం వృద్ధిని సాధించాయి.
టియాగో, టిగోర్, పంచ్, ఆల్ట్రోజ్ వంటి మోడళ్లలో పెట్రోల్-సీఎన్జీ బై-ఫ్యూయల్ పవర్‌ట్రెయిన్‌లు, ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ ట్విన్-సిలిండర్ సీఎన్జీ కిట్‌లతో ప్యాసింజర్ వాహనాలను విక్రయిస్తోంది టాటా మోటార్స్. సీఎన్జీ ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ 35 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది. దేశీయ ఆటో దిగ్గజం ఎఫ్వై24లో 91,000 యూనిట్లతో పోలిస్తే, ఎఫ్వై25లో 1.39 లక్షల సీఎన్జీ పవర్డ్ ప్యాసింజర్ వాహనాలను విక్రయించి భారీ వృద్ధిని నమోదు చేసింది.
భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఎఫ్వై25లో సుమారు 6.2 లక్షల సీఎన్జీ పవర్డ్ ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ఇది సంవత్సరానికి 28 శాతం కంటే ఎక్కువ వృద్ధిని సూచిస్తుంది. కాగా ఎఫ్వై25లో విక్రయించిన ప్రతి మూడు మారుతీ సుజుకీ కార్లలో ఒకటి సీఎన్జీ కారే అని ఇది స్పష్టం చేస్తోంది. ఆసక్తికరంగా, ఈ సంఖ్య కంపెనీ ప్రారంభ లక్ష్యాన్ని కూడా అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో, ఆటో దిగ్గజం ఆరు లక్షల సీఎన్జీ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశ ప్యాసింజర్ వాహన మార్కెట్లో గణనీయమైన, బహుముఖ మార్పు కనిపిస్తోంది. సీఎన్‌జీ కార్లను విస్తృతంగా స్వీకరించడం కీలకమైన మార్పుల్లో ఒకటి. గతంలో వ్యక్తిగత వాహన విభాగంలో సీఎన్జీ వినియోగం తక్కువగా ఉండేది. ఇది ప్రధానంగా వాణిజ్య వాహన విభాగంలో, ఫ్లీట్ కేటగిరీలో మాత్రమే ఇంధన ఎంపికగా ఉండేది. అయితే, పెట్రోల్- డీజిల్ ధరలు పెరగడం వల్ల ఖర్చుల పట్ల శ్రద్ధ వహించే వినియోగదారులు సీఎన్జీ పవర్డ్ ప్యాసింజర్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడంలో ఎదురవుతున్న సవాళ్లు, అంటే రేంజ్ యాంగ్జైటీ, అధిక ప్రారంభ ఖర్చు, తగినంత పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా సీఎన్జీ కార్ల వైపు వినియోగదారుల ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి. ప్యూర్ ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) మోడల్స్, ఎలక్ట్రిక్ వాహనాల మధ్య అంతరాన్ని పూరించడానికి హైబ్రిడ్ ఒక ఆచరణీయ ఎంపిక అయినప్పటికీ.. అధిక కొనుగోలు ఖర్చు, మార్కెట్లో మోడళ్ల లభ్యత లేకపోవడం సేల్స్ వేగాన్ని అడ్డుకుంటున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో, సీఎన్జీ ఒక ఆచరణీయ ఇంధన పరిష్కారంగా నిలుస్తోంది. ఇది తక్కువ ధర, తక్కువ నిర్వహణ ఖర్చు, తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ప్రభుత్వ నిబంధనల నుంచి కూడా ప్రయోజనాలను పొందుతుంది.
సంబంధిత కథనం