సిట్రోయెన్ సంస్థ భారత మార్కెట్లో తన నాల్గొవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో కస్టమర్స్‌కి క్రేజీ న్యూస్‌ని అందించింది. పలు ఎంపిక చేసిన మోడళ్లపై రూ.2.80 లక్షల వరకు ఆఫర్స్‌ని ఇస్తున్నట్టు వెల్లడించింది. ఇవి జూన్ 30 వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుత సిట్రోయెన్ వినియోగదారులు ఈ కాలంలో ఉచిత కారు స్పా పొందడానికి అర్హులు. వార్షికోత్సవ ఆఫర్ల గురించి మరింత సమాచారం, కస్టమర్లు Citroen.in ని సందర్శించవచ్చు లేదా వారి సమీప షోరూమ్‌కి వెళ్లొచ్చు.
స్టెలాంటిస్ ఇండియా ఆటోమోటివ్ బ్రాండ్స్ బిజినెస్ హెడ్ అండ్ డైరెక్టర్ కుమార్ ప్రియేష్ మాట్లాడుతూ.. “భారతదేశంలో మా ప్రయాణం సృజనాత్మకత, ఆశయం, వినియోగదారులకు అర్థవంతమైన విలువను అందించడంపై స్పష్టమైన దృష్టితో నడుస్తోంది. కేవలం నాలుగు సంవత్సరాల్లో, మేము సిట్రోయెన్ గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌ని లోతైన స్థానిక ఔచిత్యంతో మిళితం చేసే వాహనాల పోర్ట్‌ఫోలియోను తయారు చేశాము. భారతదేశంలో సిట్రోయెన్ నాలుగు సంవత్సరాల వార్షికోస్తవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, మా యువ బ్రాండ్‌పై విశ్వాసం ఉంచినందుకు మా వినియోగదారులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. వారి ఫీడ్‌బ్యాక్, ప్రోత్సాహం మా ఆఫర్లను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాయి. ఉత్పత్తుల నుంచి అమ్మకాల అనంతర సేవల వరకు బాగా యూజ్ అయ్యాయి. ఈ పునాదిని నిర్మించడానికి, దేశవ్యాప్తంగా మరింత మంది వినియోగదారులకు 'సిట్రోయెన్ కంఫర్ట్' అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము,” అని తెలిపారు.
సిట్రోయెన్కి ప్రస్తుతం ఇండియాలో సీ3, సీ5 ఎయిర్‌క్రాస్, బసాల్ట్తో పాటు ఈసీ3 ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది.
మరోవైపు సిట్రోయెన్ సీ3 హ్యాచ్‌బ్యాక్‌లో సీఎన్జీ వెర్షన్ల అమ్మకాలను ప్రారంభించినట్లు సిట్రోయెన్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ వాహనాల్లో రెట్రోఫిట్ చేసిన సీఎన్జీ కిట్లను డీలర్షిప్ స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు.
ఫ్యాక్టరీ టెస్ట్ చేసిన కిట్లు కిలోకు 28.1 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయని కంపెనీ తెలిపింది. సిట్రోయెన్ సీ3 సీఎన్జీ కోసం ఆన్లైన్ బుకింగ్‌లు అందుబాటులో లేనప్పటికీ, భావి కొనుగోలుదారులు దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత సిట్రోయెన్ డీలర్‌షిప్స్‌లో రూ .93,000 అదనపు ఖర్చుతో కిట్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
లైవ్, ఫీల్, ఫీల్ (ఓ), షైన్ వేరియంట్ల కోసం సీఎన్జీ కిట్లు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ మీద పనిచేస్తాయి. సీ3 సీఎన్జీ పరిచయంతో రన్నింగ్ ఖర్చులు, ఉద్గారాలను తగ్గించడాన్ని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో సీ3 సౌలభ్యం, పనితీరు, ప్రత్యేక శైలిని కాపాడుతుంది.
ప్రత్యేక బటన్ ఉపయోగించి యజమానులు పెట్రోల్, సీఎన్జి మధ్య మారడానికి అవకాశం ఉంటుంది. ట్యాంకు కారణంగా బూట్ స్పేస్ తగ్గుతుందని అంచనా వేసినప్పటికీ, స్పేర్ వీల్ యాక్సెస్‌కు ఆటంకం లేకుండా సీఎన్జీ కిట్లను ఏర్పాటు చేస్తామని సిట్రోయెన్ హామీ ఇచ్చింది. ఇంకా, సీ3 రైడ్ డైనమిక్స్‌ని నిర్వహించడానికి, సిట్రోయెన్ ప్రత్యేకంగా ట్యూన్ చేసిన రేర్ షాక్ అబ్జార్బర్లు, రీఇన్ఫోర్స్డ్ సస్పెన్షన్ స్ప్రింగ్స్, యాంటీ-రోల్ బార్ని చేర్చింది.
సంబంధిత కథనం