Citroen Basalt : 4 స్టార్ రేటింగ్ ఉన్న ఈ కూపే ఎస్యూవీ ధర పెరిగింది- ఎంతంటే..
సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీని కొనాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సిందే! ఈ మోడల్ ధరలను పెంచుతున్నట్టు సంస్థ ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
2025 మొదటి రోజే అనేక ఆటోమొబైల్ సంస్థలు తమ పోర్ట్‌ఫోలియోలోని వాహనాల ధరలను భారీగా పెంచేశాయి. ఇంకొన్ని సంస్థలు ఇప్పుడిప్పుడే ధరల పెంపును ప్రకటిస్తున్నాయి. ఈ జాబితాలోకి సిట్రోయెన్ తాజాగా చేరింది. సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్యూవీ ధరలను పెంచుతున్నట్టు సంస్థ ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్యూవీ ధర పెంపు..
సిట్రోయెన్ బసాల్ట్ గత ఏడాది ఆగస్టులో భారతదేశంలో అమ్మకానికి వచ్చింది.ఇనీషియల్ ఆఫర్ ముగియడంతో సిట్రోయెన్ బసాల్ట్ ఇప్పుడు కొద్దిగా ఖరీదైన వాహనంగా మారింది. ధరలు రూ .28,000 వరకు పెరిగాయి. కొత్త బసాల్ట్ కూపే ఎస్యూవీ ధర ఇప్పుడు రూ .8.25 లక్షల నుంచి రూ .14 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరిగింది.
ఇటీవలే నిర్వహించిన భారత్ ఎన్సీఏపీలో ఈ వెహికిల్‌కి 4 స్టార్ రేటింగ్ దక్కింది.
సిట్రోయెన్ బసాల్ట్- వేరియంట్ల వారీగా ధరల పెంపు..
సిట్రోయెన్ బసాల్ట్ బేస్ వేరియంట్లు 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌కి చెందిన మాన్యువల్ వేరియంట్‌పై ధర రూ .26,000 పెరిగింది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మ్యాక్స్ వేరియంట్లు ఇప్పుడు మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లపై రూ .21,000, టర్బో-పెట్రోల్ మ్యాక్స్ వేరియంట్లు రూ .17,000 కంటే ఎక్కువ ఖరీదైనవిగా మారాయి. సిట్రోయెన్ బసాల్ట్ టాప్-స్పెక్ ట్రిమ్ అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ప్లస్ మాన్యువల్, ఆటోమేటిక్‌పై రూ .28,000 ధర పెరిగింది. మిడ్-స్పెక్ బసాల్ట్ 1.2-లీటర్ ఎన్ఏ పెట్రోల్ మాన్యువల్ ధర రూ .9.99 లక్షల వద్ద స్థిరంగా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలని గుర్తుపెట్టుకోవాలి.
సిట్రోయెన్ బసాల్ట్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ..
సిట్రోయెన్ 1.2 నేచురల్ ఆస్పిరేటెడ్ మోడల్లో లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని, 1.2 టర్బో పెట్రోల్ మాన్యువల్ లీటర్‌కు 19.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని సంస్థ పేర్కొంది. టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ లీటరుకు 18.7 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
సిట్రోయెన్ బసాల్ట్ ఫీచర్లు..
కొత్త సిట్రోయెన్ బసాల్ట్‌లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ర్యాప్ రౌండ్ టెయిల్ లైట్స్, రేర్ ఏసీ వెంట్స్, రెండో వరుసలో ఉన్నవారికి అడ్జెస్టెబుల్ థై సపోర్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఇందులో ఉన్నాయి.
బసాల్ట్ ఎలక్ట్రిక్ వర్షెన్‌పై కూడా సిట్రోయెన్ పనిచేస్తోందని టాక్ నడుస్తోంది.
సంబంధిత కథనం