సిట్రోయెన్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ గ్యారేజ్‌లో మరో కారు చేరింది. సిట్రోయన్ బసాల్ట్డార్క్ ఎడిషన్‌కి చెందిన మొదటి యూనిట్‌ని ధోనీకి డెలివరీ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.
సిట్రోయెన్ ఇండియా బసాల్ట్, సీ3, ఎయిర్‌క్రాస్ వంటి తన పోర్ట్‌ఫోలియోలోని మోడల్స్‌కి డార్క్ ఎడిషన్‌ని భారత మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. కొత్త వెర్షన్లు టాప్-ఎండ్ వేరియంట్ల ఆధారంగా వస్తున్నాయి. ఇవి లిమిటెడ్ ఎడిషన్‌గా ఉంటాయి. ఇందులో భాగంగనే సిట్రోయెన్ బసాల్ట్ బ్లాక్ ఎడిషన్‌ని సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ధోనికి డెలివరీ చేశారు.
సిట్రోయెన్ సీ3 డార్క్ ఎడిషన్ ధర రూ.8,38,300, ఎయిర్‌క్రాస్ డార్క్ ఎడిషన్ ధర రూ.13,13,300, బసాల్ట్ డార్క్ ఎడిషన్ ధర రూ.12,80,000. ఇవన్ని ధరలు ఎక్స్-షోరూమ్.
ఈ మూడు ఎస్‌యూవీల డార్క్ ఎడిషన్లు పెర్లా నెరా బ్లాక్‌లో ఫినిష్ చేసిన ఎక్స్టీరియర్తో పాటు బ్యాడ్జ్, ఫ్రంట్ గ్రిల్, బాడీ సైడ్ క్లాడింగ్‌పై డార్క్ క్రోమ్ యాక్సెంట్‌తో వస్తాయి. బంపర్లు- డోర్ హ్యాండిల్స్ కూడా గ్లాస్ బ్లాక్‌లో ఫినిష్ చేయడం జరిగింది.
సిట్రోయెన్ డార్క్ ఎడిషన్ ఇంటీరియర్ కూడా ఇప్పుడు ఆల్ బ్లాక్ థీమ్‌లో వస్తోంది. కాబట్టి, మెట్రోపాలిటన్ బ్లాక్ లెథరెట్ సీట్లు, లెథరెట్ చుట్టిన ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, రెడ్ కలర్ ఫినిషింగ్‌తో కూడిన కార్బన్ బ్లాక్ ఇంటీరియర్స్ ఉంటాయి. డార్క్ ఎడిషన్‌లో కస్టమ్ సీట్ కవర్లు, డార్క్ క్రోమ్ మౌల్డింగ్స్, గ్రిల్ లోగో వంటిలి కూడా ఉన్నాయి.
"ఈ డార్క్ ఎడిషన్ సమకాలీన శైలితో బోల్డ్ డిజైన్ని మిళితం చేయడానికి, భారతీయ వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అభిరుచులను ప్రతిబింబించే విభిన్న వాహనాలను అందించడానికి మా నిబద్ధతను నొక్కి చెబుతుంది," అని సిట్రోయెన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శిశిర్ మిశ్రా అన్నారు. “అద్భుతమైన ఆల్బ్లాక్ సౌందర్యం, పరిమిత లభ్యత, ప్రీమియం అప్‌గ్రేడ్స్‌తో మేము మెరుగైన ప్రత్యేకతను అందిస్తున్నాము. ఇది ఈ లైనప్‌లోని ప్రతి సిట్రోయెన్ కారును నిజంగా ప్రత్యేకమైనదిగా చేస్తుంది. మేము డార్క్ ఎడిషన్‌ని ఆవిష్కరించేటప్పుడు, సిట్రోయెన్ ఓనర్స్ క్లభ్లో అధికారికంగా చేరిన మొదటి కస్టమర్గ ఎంఎస్ ధోనీని స్వాగతించడం మాకు సంతోషంగా ఉంది,” అని అన్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే లేవు! ఏ సిట్రోయెన్ ఎస్యూవీ డార్క్ ఎడిషన్‌లోనూ మెకానికల్ మార్పులు లేవు. డార్క్ ఎడిషన్లు టాప్-ఎండ్ వేరియంట్లపై మాత్రమే ఆధారపడినందున, వీటిల్లోని 1.2-లీటర్ త్రీ-సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 109 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్ 190 ఎన్ఎమ్ టార్క్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ 205 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తాయి.
సంబంధిత కథనం