CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?-cibil score for car loan what is the minimum requirement ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Cibil Score For Car Loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

HT Telugu Desk HT Telugu

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి మంచి సిబిల్ స్కోర్ ఉండడం తప్పని సరేమీ కాదు. కానీ, చాలా బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థలు కార్ లోన్ ఇవ్వడానికి కూడా సిబిల్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటాయి. సిబిల్ స్కోరు 700 కంటే ఎక్కువ ఉన్నవారికి కార్ లోన్ సులభంగా లభిస్తుంది.

క్రెడిట్ స్కోర్ 700 కంటె ఎక్కువ ఉండడం మంచిది

CIBIL score for car loan: సాధారణంగా సిబిల్ అనే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ భారతదేశంలోని ప్రముఖ క్రెడిట్ బ్యూరోలలో ఒకటి. బ్యాంక్ లు, ఇతర ఫైనాన్స్ సంస్థలు సాధారణంగా కార్ లోన్ ఇవ్వడానికి దరఖాస్తుదారు సిబిల్ స్కోరు (లేదా క్రెడిట్ స్కోర్) ను పరిగణనలోకి తీసుకుంటాయి. సిబిల్ స్కోరు తో పాటు రుణ గ్రహీత ఆదాయం, రుణ గ్రహీతకు ఇప్పటికే ఉన్న రుణాలు, ఉద్యోగ స్థిరత్వం, డౌన్ పేమెంట్ మొత్తం వంటి అనేక ఇతర అంశాల ఆధారంగా ఆయా బ్యాంక్ లు, లేదా ఫైనాన్స్ సంస్థలు కార్ లోన్స్ ఇస్తుంటాయి. సిబిల్ స్కోర్ ఉండాలన్న నియమం లేనప్పటికీ, చాలా మంది రుణదాతలు కారు రుణానికి అర్హత పొందడానికి సిబిల్ స్కోరు 700 కంటే ఎక్కువ ఉండాలని చూస్తారు.

వడ్డీ రేట్లు

అధిక క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం వల్ల కార్ లోన్ సులభంగా లభించడమే కాకుండా, మీ కారు రుణంపై తక్కువ వడ్డీ రేటును కూడా పొందవచ్చు. తద్వారా రుణ కాలపరిమితిలో మీకు డబ్బు ఆదా అవుతుంది. అయితే బ్యాంక్ లు లేదా ఫైనాన్స్ సంస్థలు కార్ లోన్ ఇవ్వడానికి అధిక క్రెడిట్ స్కోర్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోరని గుర్తుంచుకోవాలి. వారు మీ ఆదాయం, ఉపాధి స్థిరత్వం, రుణం-ఆదాయ నిష్పత్తి తదితర అంశాలను కూడా పరిశీలిస్తారు. క్రెడిట్ స్కోర్ 700 కంటే తక్కువగా ఉన్నా కారు లోన్ లభిస్తుంది. కానీ అధిక వడ్డీ రేట్లు లేదా కఠినమైన రుణ నిబంధనలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో, సకాలంలో చెల్లింపులు చేయడం ద్వారా మీరు మీ క్రెడిట్ స్కోర్ ను మెరుగుపరుచుకోవచ్చు.

కారు రుణానికి అవసరమైన కనీస సిబిల్ స్కోరు ఎంత?

కారు రుణానికి అవసరమైన కనీస సిబిల్ స్కోరు రుణదాత విధానాలు మరియు ఆదాయం, ప్రస్తుత రుణం, ఉద్యోగ స్థిరత్వం మరియు డౌన్ పేమెంట్ మొత్తం వంటి అనేక ఇతర అంశాల ఆధారంగా మారవచ్చు.

సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువ దేనిని సూచిస్తుంది?

సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువగా ఉంటే మంచి క్రెడిట్ హిస్టరీని చూపిస్తుంది. మీరు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉందని రుణదాతకు చూపిస్తుంది.

క్రెడిట్ రిపోర్టుపై వివరాలను వివాదం చేయడం సాధ్యమేనా?

అవును, సరైన ప్రక్రియను అనుసరించడం ద్వారా అభ్యంతరాన్ని లేవనెత్తడం సాధ్యపడుతుంది.

మీ క్రెడిట్ రిపోర్టును చెక్ చేసుకోవడం మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుందా?

కచ్చితత్వం కోసం ఎప్పటికప్పుడు స్కోర్ చెక్ చేసుకోవడం మంచిది.

క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ఎందుకు తక్కువగా ఉంచాలి?

మీ క్రెడిట్ లిమిట్ తో పోలిస్తే తక్కువ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ లను నిర్వహించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ సానుకూలంగా ప్రభావితం అవుతుంది.