Chitfunds Vs Bank Deposit: చిట్‌ఫండ్ లాభమా, బ్యాంక్ డిపాజిట్లు సురక్షితమా.. రెండింటిలో ఏది మేలు..
Chitfunds Vs Bank Deposit: చీటీపాటల్లో పొదుపు చేయడం సురక్షితమా, బ్యాంకు డిపాజిట్లు మేలు చేస్తాయా అనే విషయంలో చాలామందిలో ఒకింత సందిగ్ధం ఉంటుంది. ఆర్థిక భరోసా కల్పించడంలో చీటీపాటలు కీలకమే అయినా వడ్డీ లెక్కలు, లాభనష్టాలను బేరీజు వేసుకోవడం కూడా ముఖ్యమే…
Chitfunds Vs Bank Deposit: చీటీ పాటలు లాభసాటిగా ఉంటాయా, బ్యాంకు డిపాజిట్లతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందా అనే విషయంలో చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. నెలకు రూ.2వేల రూపాయలు కట్టాల్సిన చిట్టీ పాటలో నెల పాట రూ.1300కడితే చాలు ఆ నెలలో రూ.రూ.700 రుపాయలు లాభంవచ్చినట్టు లెక్కలు వేసుకుంటాం.
నెలకు రూ.2వేల చొప్పున 50 నెలలు కడితే లక్ష రుపాయలు అందుకోచ్చు. మొదట్లో చెల్లించే చీటీ పాట కాస్త తక్కువగా ఉన్నా క్రమంగా పెరుగుతుంది తప్ప భారంగా ఉండదని ఏజెంట్లు చెబుతుంటారు. చిట్టీ పాటల్లో డబ్బులు దాచుకుంటే అవసరానికి ఉపయోగపడతాయని చాలా మంది చెబుతుంటారు.
బ్యాంక్ రికరింగ్ డిపాజిట్‌లో డబ్బులు దాచుకుంటే 9.5శాతం వరకు వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి మూడు నెలలకు వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ కూడా లభిస్తుంది. నెలకు రూ.1555చొప్పున బ్యాంకు రికరింగ్ డిపాజిట్‌లో పొదుపు చేస్తే 50 నెలల్లో రూ.95,008 అందుకోవచ్చు.
చిట్‌ఫండ్స్- బ్యాంకు డిపాజిట్లలో ఏది సురక్షితం అనే దానిపై చాలామందిలో గందరగోళం ఉంటుంది. చిట్‌ఫండ్‌లో చేరి 50నెలల పాటు క్రమం తప్పకుండా చెల్లించి చివరిలో డబ్బులు తీసుకుంటే దానపై వచ్చే వడ్డీ 14-18శాతం కంటే ఎక్కువ ఉండదు. బ్యాంకు వడ్డీలలో వచ్చే 9.5శాతంతో పోలిస్తే చిట్‌ఫండ్‌లో వచ్చే వడ్డీ ఎక్కువ ఉంటుందనే వాదన కూడా ఉంటుంది.
చిట్‌ఫండ్ ఎలా పనిచేస్తుంది..
కొంతమందితో ప్రతినెల నిర్ణీత మొత్తాన్ని జమ చేసుకుని వారిలో డబ్బు అవసరం ఉన్న వారికి ప్రతి నెల చిట్ మొత్తాన్ని చెల్లించడాన్ని చిట్టీపాటలు, చిట్‌ఫండ్ వ్యాపారం అంటారు. యాభై మంది నెలకు రూ.2వేల చొప్పున జమ చేస్తే పోగయ్యే లక్ష రుపాయల మొత్తాన్ని ఒక్కో నెలలో ఒక్కొక్కరికి చెల్లిస్తారు. ఏదైనా నెలలో డబ్బు అవసరం ఉన్న వారు ఎక్కువ మంది ఉంటే వారి మధ్య వేలం పాట నిర్వహిస్తారు. చిటీ పాటలో ఎవరు పోటీ పడకుండా ఒక్కరే డబ్బు కోరితే లక్ష రుపాయల చిట్ మొత్తంలో ఐదు శాతాన్ని చిట్టీల నిర్వాహకులు తీసుకుని మిగిలిన మొత్తాన్ని చీటీ పాడుకున్న వారికి చెల్లిస్తారు.
ఒకరి కంటే ఎక్కువ మంది చిటీ డబ్బు కోసం పోటీ పడితే వారి మధ్య వేలం నిర్వహిస్తారు. చిటీ మొత్తంలో ఎవరు ఎక్కువ వదులుకోడానికి సిద్ధమైతే ఎక్కువ వదులకోడానికి సిద్ధమైన వారికి ఆ మొత్తం చెల్లిస్తారు. వారిలో కూడా పోటీ ఉంటే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. చిట్‌ఫండ్ యాక్ట్ నిబంధనల ప్రకారం చిట్ మొత్తంలో 40శాతం కంటే ఎక్కువ చిట్ పాడకూడదు.
చిట్ పాడుకున్న వ్యక్తి 40శాతం లాభం వదులుకున్నందున మిగిలిన సభ్యులు ఆ నెలలో రూ.1200 మాత్రమే కడితే సరిపోతుంది. చిట్ నిర్వాహకుడికి 5శాతం వరకు కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో చిట్ సభ్యులంతా మరో రూ.100అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలా రూ.1300 పాట చెల్లిస్తే వారికి ఆ నెలలో వారికి 35శాతం లాభం దక్కినట్టు అవుతుంది. క్రమంగా ప్రతి నెలలో పాటదారుల మధ్య పోటీ తగ్గుతుంది. చెల్లించాల్సిన వాయిదా మొత్తం పెరుగుతుంది. చివరి నెలకు కట్టాల్సిన సొమ్ము రూ.2వేలకు చేరుతుంది.
అది లాభం కాదు…
మొదట్లో చిటీ పాట రూ.2వేలకు బదులు రూ.1300చెల్లిస్తే రూ700 మిగులుగా భావించకూడదు. చిట్టీ మొత్తం సొమ్ము రావడానికి పట్టే కాలానికి వడ్డీ కూడా లెక్కించుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెల చెల్లించిన చిటీ సొమ్ముకు బ్యాంకు తరహాలో వడ్డీలు లెక్కిస్తే చివరకు వచ్చే వడ్డీ 7శాతం లోపే ఉంటుంది. కాబట్టి చిట్టీలు వేయడం నయమూ, బ్యాంకులు దాచుకోవడం మేలో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. కాకపోతే బ్యాంకుల్లో అత్యవసరమైతే చిట్టీల మాదిరి అప్పటికప్పుడు నిర్ణీత మొత్తాన్ని అందుకోలేమని గుర్తుంచుకోవాలి.
చిట్టీలో ఉండే మతలబు అదే...
చిట్‌లో చేరే మొదటి నెలలో నిర్ణీత మొత్తం చెల్లించాలి. దీంతో పాటు ప్రవేశరుసుము వసూలు చేస్తారు. 50నెలల చిట్‌లో 50మంది సభ్యులు చేరితే తప్ప చిట్ ప్రారంభం కాదు. మొదట చిట్‌లో చేరిన వ్యక్తి చిట్ మొదలు కావడానికి కనీసం నెల ఎదురు చూడాలి. 51వ నెలలో మాత్రమే తన డబ్బు చేతికి అందుతుంది.
చిట్టీ పాటలో చేరే సమయంలో కట్టే మొత్తాన్ని బ్యాంకులో వేస్తే 6.5శాతం వడ్డీతో అది 51 నెలలకు రూ.2,821 చేరుతుంది. రెండో నెలలో చిట్టీ పాటలో చేరే వారికి మాత్రమే డివిడెంట్ లభిస్తుంది. ప్రస్తుతం ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీలు అన్ని 6.5శాతానికి మించి వడ్డీ చెల్లించడం లేదు.
చిట్టీ పాటల్లో నిర్వాహకులకు చిట్ మొత్తంలో 5శాతం ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి ఇలా చిట్టీ పాటల ద్వారా 60శాతం లాభం వస్తుంది. అందుకే బ్యాంకులతో పోలీస్తే చిట్టీపాటతో ఎక్కువలాభాలు గిట్టుబాటు అవుతాయి.
50నెలల చిటీపాటలో ఎవరైనా 20-30 నెలల పాటు క్రమం తప్పకుండా డబ్బులు చెల్లించి తర్వాత ఏదైనా కారణాలతో చెల్లించలేక మానేస్తే అతను చెల్లించిన సొమ్ములో 5శాతం మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అదే బ్యాంకు రికవరింగ్ డిపాజిట్‌లో చెల్లించిన మొత్తానికి వడ్డీని కూడా చెల్లిస్తారు.
చిట్టీ పాటల్లో చేరే వారికి చక్రవడ్డీ లెక్కలు తెలియక చీటీ పాటల్లో డివిడెంట్ బాగా లాభసాటిగా కనిపిస్తుంది. చిట్‌ఫండ్ అప్పు ఇచ్చే పొదుపుగానే ఎక్కువ మంది భావిస్తారు. అవసరం అయితే చీటీ పాట పడే అవకాశం ఉంటుందని భావిస్తారు. బ్యాంక్ రికరింగ్ డిపాజిట్‌లో ప్రతినెల ఎవరికి వారు క్రమం తప్పకుండా పొదుపు చేయాల్సి ఉంటుంది.
చిట్ మొదట్లో వాడేసుకుంటే...
చీటీ పాటల్లో మొదటి నెలల్లోనే చిట్ మొత్తాన్ని పాడుకుంటే దానికి కావాల్సిన ష్యూరిటీలు సమర్పించడానికి, వాటి వెరిఫికేషన్‌కు నెల నుంచి 2 నెలల సమయం పడుతుంది. చిటీ పాడుకున్న మూడో నెలలో రూ.40శాతం మినహాయించుకుని రూ.60వేలు మాత్రమే పొందడానికి వీలవుతుంది. అప్పటికే మూడు నెలలు చెల్లించిన చీటీ వాయిదాలను మినహాయిస్తే రూ.55,255దక్కుతాయి. బ్యాంకు వడ్డీ రేట్లతో ఈ మొత్తాన్ని లెక్కిస్తే 17.6శాతం వడ్డీ వరకు ఉంటుంది.
ఎవరికి ఉపయోగం అంటే...
చిట్ వ్యవధిలో మధ్యలో డబ్బులు తీసుకునే వారికి ఎలాంటి నష్టం ఉండదు. అది పూర్తిగా లాభసాటి కూడా కాదు. 26నెలల పాటు క్రమం తప్పకుండా చీటీ చెల్లిస్తే 42,010 అవుతుంది. 26వ నెలలో చీటీ ద్వారా రూ.83వేలు లభిస్తాయి. అందులో అప్పటి వరకు చెల్లించిన మొత్తం మినహాయిస్తే రూ.39,990 అప్పు తీసుకున్నట్టు భావించాలి. మిగిలిన 24నెలల పాటు చెల్లించే దానికి అయ్యే వడ్డీని మాత్రమే అదనంగా చెల్లిస్తున్నట్టు గుర్తించాలి. చిట్ మొత