Xiaomi MS11 electric car : షియోమీ నుంచి తొలి ఎలక్ట్రిక్​ కారు.. ఆన్​లైన్​లో ఫొటోలు లీక్​!-chinese smartphone giant xiaomi s first electric car ms11 ev photos leaked online ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Xiaomi Ms11 Electric Car : షియోమీ నుంచి తొలి ఎలక్ట్రిక్​ కారు.. ఆన్​లైన్​లో ఫొటోలు లీక్​!

Xiaomi MS11 electric car : షియోమీ నుంచి తొలి ఎలక్ట్రిక్​ కారు.. ఆన్​లైన్​లో ఫొటోలు లీక్​!

Sharath Chitturi HT Telugu
Feb 04, 2023 10:07 AM IST

Xiaomi MS11 electric car photos leaked : షియోమీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ కారుపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా.. లాంచ్​కి ముందే ఈ ఈవీకి సంబంధించిన ఫొటోలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి!

 షియోమీ నుంచి తొలి ఎలక్ట్రిక్​ కారు.. ఆన్​లైన్​లో ఫొటోలు లీక్​!
షియోమీ నుంచి తొలి ఎలక్ట్రిక్​ కారు.. ఆన్​లైన్​లో ఫొటోలు లీక్​! (HT AUTO)

Xiaomi first electric car photos leaked : "షియోమీ".. ఈ పేరు వినగానే స్మార్ట్​ఫోన్స్​, టీవీలు, వాక్యూమ్​ క్లీనర్లతో పాటు జీవితంలో నిత్యం వినియోగించే అనేక గ్యాడ్జెట్​లు గుర్తొస్తాయి. ఈ చైనీస్​ కంపెనీ ప్రోడక్టులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండే ఉంది. ఇక ఇప్పుడు ప్రపంచ ఈవీ మార్కెట్​పై కన్నేసింది షియోమీ. ఈ క్రమంలోనే ఎమ్​ఎస్​11 సెడాన్​ పేరుతో ఓ ఎలక్ట్రిక్​ వాహనాన్ని రూపొందిస్తోంది. త్వరలోనే ఇది అంతర్జాతీయంగా లాంచ్​ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతలోనే ఈ షియోమీ ఎమ్​ఎస్​11 సెడాన్​కు సంబంధించిన ఫొటోలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలను ఓసారి చూద్దాం..

షియోమీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ కారు ఇదే..

షియోమీ ఎమ్​ఎస్​11 సెడాన్​ డిజైన్​.. ప్రముఖ చైనీస్​ ఆటోమొబైల్​ సంస్థ బీవైడీకి చెందిన సియెల్​ ఎలక్ట్రిక్​ సెడాన్​తో పోలీ ఉంది. బీవైడీ ఈవీని 2023 ఆటోఎక్స్​పోలో సైతం ప్రదర్శించారు. ఇక అంతర్జాతీయంగా ప్రముఖ మోడల్స్​ నుంచి స్ఫూర్తి తీసుకుని.. ఈ షియోమీ తొలి ఎలక్ట్రిక్​ కారును రూపొందించినట్టు కనిపిస్తోంది.

Xiaomi MS11 electric car : ఈ 4 డోర్​ ఎలక్ట్రిక్​ సెడాన్​లో ఫ్లోయింగ్​ లైన్స్​, ఎయిరోడైనమిక్​ సిల్హోయిట్​ ఉన్నాయి. ఫ్రెంట్​లో ట్రైడెంట్​ ఆకారంలో ఎల్​ఈడీ లైట్స్​ ఉండటంతో లుక్​ ఇంకాస్త అగ్రెసివ్​గా మారింది. మెక్​లారెన్​ 720ఎస్​తో ఇది పోలీ ఉంది.

ఇక షియోమీ ఎమ్​ఎస్​11 సెడాన్​లో విండ్​షీల్డ్​ పెద్దగా ఉండటంతో పాటు సైడ్​ గ్లాస్​ కూడా ఎక్కువగానే ఉంది. పానారోమిక్​ సన్​రూఫ్​ రేర్​ వరకు ఎక్స్​టెండ్​ అయ్యి ఉంది. వీల్స్​ మధ్యలో "షియోమీ" బ్రాండ్​ లోగో కనిపిస్తోంది. యెల్లో బ్రెంబ బ్రేక్​ కాలిపర్స్​ కూడా ఉన్నాయి. విండ్​షీల్డ్​పైన ఎల్​ఐడీఏఆర్​ సెన్సార్​ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందులోని టెయిల్​గేట్స్​ డిజైన్​.. ఆస్టన్​ మార్టిన్​ వెహికిల్​ను పోలి ఉంది.

MS11 electric car photos leaked : ఆన్​లైన్​లో లీక్​ అయిన షియోమీ ఎమ్​ఎస్​11 సెడాన్​లో ఇంటీరియర్​కు సంబంధించి వివరాలేవీ లేవు. టెక్నికల్​ స్పెసిఫికేషన్స్​ గురించి కూడా ఎలాంటి వివరాలు లేవు. సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ కారును షియోమీ ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఈవీకి సంస్థ తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. చైనా రోడ్లపై ఇప్పటికే దీని టెస్టింగ్​ జరిగినట్టు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎమ్​ఎస్​11 సెడాన్ ఈవీ​లో ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్​ మోటార్​ను షియమీ సొంతంగా తయారు చేసినట్టు తెలుస్తోంది. బ్యాటరీలు మాత్రం సీఏటీఎల్​, బీవైడీ సంస్థలు అందిస్తున్నట్టు సమాచారం. ఇందులో 800 వోల్ట్​ సిస్టెమ్​ ఉండొచ్చు. బీవేడీ, సీఏటీఎల్​ ఇస్తున్న బ్యాటరీతో ప్రస్తుతం 1000 కి.మీల రేంజ్​ వస్తోంది. మరి షియోమీ తొలి ఈవీకి కూడా ఇదే రేంజ్​ ఉంటుందో లేదో చూడాలి.

లీక్​ చేసిన వారిపై రూ. 1.2కోట్ల ఫైన్​..!

Xiaomi electric car features : తమ తొలి ఎలక్ట్రిక్​ కారుకు సంబంధించిన ఫోటోలు ఆన్​లైన్​లో లీక్​ అవ్వడాన్ని షియోమీ చాలా సీరియస్​గా పరిగణించింది. బీజింగ్​కు చెందిన మోల్డింగ్​ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్​ అనే వెండర్​ నుంచి ఈ ఫొటోలు లీక్​ అయినట్టు షియోమీ గుర్తించింది. ఫలితంగా.. సంస్థపై 1 మిలియన్​ యువాన్​ ఫైన్​ను వేసేందుకు నిర్ణయించింది. ఇండియా కరెన్సీలో ఇది దాదాపు. రూ.1.22కోట్లు!

ఫైన్​తో పాటు సెక్యూరిటీ బ్రీచ్​కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని వెండర్​కు షియోమీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి లీక్స్​ జరగకుండా చర్యలు చేపట్టాలని తేల్చిచెప్పింది.

Xiaomi EV details : ఆటోమొబైల్​ మార్కెట్​పై షియోమీ సీరియస్​గానే దృష్టిపెట్టింది. ఇప్పటికే 10 బిలియన్​ డాలర్ల పెట్టుబడి పెట్టింది. సంస్థకు సంబంధించిన కారు ఫ్యాక్టరీ బీజింగ్​లో త్వరలో తెరుచుకుంటోంది. ఇందులో ఏడాదికి 3లక్షల కార్లు తయారవుతాయని తెలుస్తోంది. ఇక షియోమీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ కారు ఎంఎస్​11 ఈవీ.. 2024లో లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.

WhatsApp channel