Children's Day 2023: సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయలేదా?.. ఈ ప్రయోజనాలు మిస్ అవుతారు..-childrens day 2023 4 benefits of investing in sukanya samriddhi yojana ssy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Children's Day 2023: సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయలేదా?.. ఈ ప్రయోజనాలు మిస్ అవుతారు..

Children's Day 2023: సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయలేదా?.. ఈ ప్రయోజనాలు మిస్ అవుతారు..

HT Telugu Desk HT Telugu
Nov 14, 2023 02:34 PM IST

Children's Day 2023: ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు పిల్లల చదువులకు, ఇతర ఖర్చులకు సహాయపడే, వారికి ఆర్థిక భరోసాను ఇచ్చే ప్రభుత్వ పథకం సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana - SSY).

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Pixabay)

Sukanya Samriddhi Yojana - SSY: ప్రభుత్వ గ్యారెంటీ ఉన్న సేవింగ్స్ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన. తమ కూతుళ్ల పేరుపై తల్లిదండ్రులు ఈ స్కీమ్ కింద బ్యాంక్ లో ఖాతా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో చాలా ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా, బాలికల భవిష్యత్తుకు సహాయపడే సేవింగ్స్ స్కీమ్ ఇది.

yearly horoscope entry point

మొత్తం 9 పథకాలు

కేంద్ర ప్రభుత్వం మొత్తం 9 సేవింగ్స్ స్కీమ్స్ ను ఆఫర్ చేస్తోంది. వాటిలో ఒకటి సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana - SSY). ఈ స్కీమ్స్ అన్నింటికీ ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటును సమీక్షిస్తారు. సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటును ఈ సెప్టెంబర్ 30వ తేదీన ప్రకటించారు.

సుకన్య సమృద్ధి యోజన వివరాలు

సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లకు ఈ త్రైమాసికం (సెప్టెంబర్ 30, 2023 - డిసెంబర్ 31, 2023) లో 8% వార్షిక వడ్డీ లభిస్తుంది. నెలలోని ఐదవరోజు, నెలలోని చివరి రోజు మధ్య అకౌంట్లో ఉన్న నగదు సగటును లెక్కగట్టి, సంవత్సరానికి ఒకసారి వడ్డీని జమ చేస్తారు. పాప జన్మించిన తరువాత ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంక్ లో ఓపెన్ చేయవచ్చు. ఒక సంవత్సరంలో కనీసం రూ. 250 నుంచి, రూ. 1.5 లక్షల వరకు ఆ అకౌంట్ లో జమ చేయవచ్చు. పాపకు 18 ఏళ్లు నిండిన తరువాత ఆ ఖాతాలోని నగదు మొత్తంలో నుంచి 50% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. విత్ డ్రాను ఏకమొత్తంలో కానీ, ఇన్ స్టాల్ మెంట్లలో కానీ చేసుకోవచ్చు.

ఇవే ప్రయోజనాలు..

సుకన్య సమృద్ధి యోజన స్కీంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులోని నాలుగు ప్రధాన లాభాలు ఇవి..

  • సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వ గ్యారెంటీ స్కీమ్. కచ్చితమైన రిటర్న్స్ ఉంటాయి.
  • వార్షిక వడ్డీ రేటు 8%
  • ఒక ఆర్థిక సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో జమ చేయడం ద్వారా రూ. 1.50 లక్షల మొత్తానికి సెక్షన్ 80 సీ కింద ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు.
  • సుకన్య సమృద్ధి యోజన స్కీంతో లభించే వడ్డీకి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది.
  • ఒక సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

Whats_app_banner