సింగిల్​ ఛార్జ్​తో 181 కి.మీ రేంజ్​- ఈ లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ బెస్ట్​ ఛాయిస్​!-checkout this simple ones long range electric scooter with 181 km range ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సింగిల్​ ఛార్జ్​తో 181 కి.మీ రేంజ్​- ఈ లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ బెస్ట్​ ఛాయిస్​!

సింగిల్​ ఛార్జ్​తో 181 కి.మీ రేంజ్​- ఈ లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ బెస్ట్​ ఛాయిస్​!

Sharath Chitturi HT Telugu

లాంగ్​ రేంజ్​, సూపర్​ ఫీచర్లు, వేగవంతమైన యాక్సిలరేషన్​కు హామీ ఇస్తూ సింపుల్​ వన్ఎస్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ మార్కెట్​లో అందుబాటులో ఉంది. ఈ మోడల్​ పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి. మీకు కచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది.

సింపుల్​ వన్​ఎస్​..

భారత దేశంలో ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్​ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు. మరీ ముఖ్యంగా 2 వీలర్​ ఎలక్ట్రిక్​ సెగ్మెంట్​కు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే మార్కెట్​లో చాలా ఆప్షన్స్​ లభిస్తున్నాయి. మరి మీరు కూడా ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? రేంజ్​ ఎక్కువ ఉంటే బెటర్​ అని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోమే! సింపుల్​ ఎనర్జీకి చెందిన సింపుల్​ వన్​ఎస్​ మీకు సెట్​ అవ్వొచ్చు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ రేంజ్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సింపుల్​ వన్​ఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​..

సింపుల్ వన్​ఎస్​ ఎలక్ట్రిక్ స్కూటర్​లో 8.5 కిలోవాట్ల (11.3 బీహెచ్​పీ) పిఎమ్ ఎస్ మోటార్ ఉంటుంది. 3.7 కిలోవాట్​ ఫిక్స్​డ్​ బ్యాటరీ ప్యాక్​ కూడా ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 181 కి.మీ (ఐడీసీ) రేంజ్​ని ఇస్తుంది.

ధర విభాగంలో వన్ఎస్ వేగవంతమైన, పొడవైన శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్ అని సింపుల్ ఎనర్జీ పేర్కొంది. ఇది 35 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్, 770 ఎంఎం సీటు హైట్​, ఎకో, రైడ్, డాష్, సోనిక్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్​తో వస్తుంది. ఈ ఈ-స్కూటర్​ సోనిక్ మోడ్​లో 0-40 కిలోమీటర్ల వేగాన్ని 2.5 సెకన్లలో అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్ల వేగాన్ని టచ్​ చేస్తుంది.

ఈ ఏడాది మార్చ్​లో లాంచ్​ అయిన ఈ వన్ఎస్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి.. గ్రేస్ వైట్, అజూర్ బ్లూ నమ్మ రెడ్, బ్రేజెన్​ బ్లాక్​.

సింపుల్ ఎనర్జీ ఫౌండర్ అండ్ సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. “సింపుల్ ఎనర్జీలో ఇన్నోవేషన్ అనేది గమ్యం కాదని, ఒక జర్నీ అని నమ్ముతాం. అందువల్ల, ఈ ధర సెగ్మెంట్ కింద మీకు సాధ్యమైనంత ఉత్తమమైన శ్రేణిని అందించే సింపుల్ వన్ఎస్​ను అందుబాటులో ఉంచడం మాకు చాలా సంతోషంగా ఉంది. స్మార్ట్ సొల్యూషన్లను సృష్టించడానికి టెక్నాలజీ సరిహద్దులను నెట్టడంపై మా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ దానికి నిదర్శనం. మెరుగైన ఫీచర్లతో మేము ప్రీమియం ఈవీ టెక్నాలజీని మరింత మంది రైడర్లకు అందుబాటులో ఉంచుతున్నాము. అంతరాయం లేని, ఒత్తిడి లేని అనుభవాన్ని నిర్ధారిస్తున్నాము. మేము ముందుకు సాగుతున్నప్పుడు, ఎలక్ట్రిక్ మొబిలిటీ భవిష్యత్తును నడిపించడానికి, భారతదేశం ప్రయాణించే విధానాన్ని పునర్నిర్వచించడానికి మా నిబద్ధత అలాగే ఉంటుంది,” అని అన్నారు..

సింపుల్ వన్​ఎస్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఫీచర్లు..

సింపుల్ వన్​ఎస్​ ఈ-స్కూటర్​లో 7 ఇంచ్​ టచ్​స్క్రీన్ డిస్​ప్లే, 5జీ ఎనేబుల్డ్ ఈ-సిమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, కస్టమైజబుల్ థీమ్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్డేట్స్, ఫైండ్ మై వెహికల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫార్వర్డ్- రివర్స్ మూవ్​మెంట్​తో కొత్త పార్క్ అసిస్ట్ ఫంక్షన్ కూడా ఉంది.

సింపుల్​ వన్​ఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర-

ఈ సింపుల్​ వన్​ఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.40లక్షల వరకు ఉంటుంది. బెంగళూరు, గోవా, పుణె, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, కొచ్చి, మంగళూరు నగరాల్లోని మొత్తం 15 షోరూమ్స్​లో సింపుల్ వన్​ఎస్​ అందుబాటులో ఉంది.

వచ్చే ఏడాదిలో 150 కొత్త స్టోర్లు, 200 సర్వీస్ సెంటర్లతో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో ఈ సంస్థ ఉనికిని విస్తరిస్తోంది. సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు తమిళనాడులోని హోసూరులో ఉన్న కంపెనీ ప్లాంట్​లో 150,000 వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో తయారవుతాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం