Mahindra BE 6 : మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్ ఎస్యూవీ కొంటున్నారా? ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
Mahindra BE 6 : మహీంద్రా బీఈ 6 కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్‌లో మహీంద్రా బీఈ 6 ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి భారతీయుల నుంచి సూపర్ డిమాండ్ కనిపిస్తోంది. ఇటీవలే ఈ మోడల్ బుకింగ్స్ ప్రారంభమవ్వగా, ఈ కారును కొనేందుకు ప్రజలు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. మరి మీరు కూడా మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే హైదరాబాద్‌లో మహీంద్రా బీఈ 6 ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో మహీంద్రా బీఈ6 ఆన్‌రోడ్ ప్రైజ్..
- మహీంద్రా బీఈ 6 ప్యాక్ వన్- రూ. 19.87 లక్షలు
- ప్యాక్ వన్ అబోవ్- రూ. 21.55 లక్షలు
- ప్యాక్ టూ- రూ. 23.01 లక్షలు
- ప్యాక్ త్రీ సెలెక్ట్- రూ. 25.73 లక్షలు
- ప్యాక్ త్రీ- రూ. 28.43 లక్షలు
అంటే హైదరాబాద్‌లో మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 19.87 లక్షల నుంచి రూ. 28.43 లక్షల వరకు ఉంటుందని అర్థం.
మరి ఈ బీఈ 6వేరియంట్లలో ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్? ఇది తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
సాధారణంగా వెహికల్‌కి ఎక్స్‌షోరూం ప్రైజ్, ఆన్‌రోడ్ ప్రైజ్‌లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్‌ని లాంచ్ చేసే సమయంలో ఆటోమొబైల్ సంస్థలు ఎక్స్‌షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్‌రోడ్ ప్రైజ్ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్‌ని కొనే ముందు, ఎక్స్‌షోరూం ప్రైజ్ కాకుండా ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకుని బడ్జెట్ వేసుకోవాలి.
మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శిస్తే ఈ మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్ కారు టెస్ట్ డ్రైవ్ చేసి, వెహికిల్‌ని బుక్ చేసుకోవచ్చు.
మహీంద్రా బీఈ6 రేంజ్..
మహీంద్రా ప్రకారం.. బీఈ 6 175 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించినప్పుడు కేవలం 20 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 59 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ రేంజ్‌ని ఇంకా చెప్పలేదు. 79 కిలోవాట్ల ప్యాక్ ఏఆర్ఏఐ టెస్టింగ్ ప్రకారం 682 కిలోమీటర్ల పరిధిని సాధిస్తుందని సంస్థ పేర్కొంది.
మహీంద్రా బీఈ6, ఎక్స్ఈవీ 6కి క్రేజీ డిమాండ్..
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి వస్తున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లకు భారతీయుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. వాలెంటైన్స్ డే నేపథ్యంలో మహీంద్రా బీఈ6, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈల బుకింగ్స్‌ని సంస్థ ప్రారంభించగా.. ఈ రెండింటికీ మొదటి రోజే 30,179 బుకింగ్స్ దక్కాయి. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల బుకింగ్ వాల్యూ రూ. 8,472 కోట్ల (ఎక్స్‌షోరూం ధర)కు చేరింది. ఈ 30,179 బుకింగ్స్‌లో 44శాతం మంది బీఈ 6ని ఎంచుకోగా, మిగిలిన 56శాతం మంది ఎక్స్ఈవీ 9ఈని బుక్ చేసుకున్నారు. అంతేకాదు, మొత్తం మీద 79శాతం బుకింగ్స్ టాప్ ఎండ్ వేరియంట్స్కే వెళ్లడం విశేషం.
ఇక ఈ రెండు కార్ల ప్యాక్ త్రీ వేరియంట్ డెలివరీలు 2025 మార్చ్ మధ్య నుంచి ప్రారంభం కానున్నాయి. ప్యాక్ త్రీ సెలెక్ట్, ప్యాక్ టూ డెలివరీలు వరుసగా జూన్ 2025, జులై 2025 నుంచి ప్రారంభమవుతాయి. ఎంట్రీ లెవల్ వేరియంట్లు అయిన వన్, వన్ అబౌవ్ల డెలివరీలు 2025 ఆగస్టులో ప్రారంభం కానున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్