Electric scooter : సింగిల్​ ఛార్జ్​తో సూపర్​ రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ స్టైలే వేరు..​-checkout this ampere nexus electric scooter with 100 km range ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooter : సింగిల్​ ఛార్జ్​తో సూపర్​ రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ స్టైలే వేరు..​

Electric scooter : సింగిల్​ ఛార్జ్​తో సూపర్​ రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ స్టైలే వేరు..​

Sharath Chitturi HT Telugu
Published Feb 14, 2025 11:22 AM IST

Ampere Nexus electric scooter : కొత్తగా ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! సింగిల్​ ఛార్జ్​తో 100 కి.మీ రేంజ్​ని ఇచ్చే యాంపియర్​ నెక్సస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో స్టైల్​తో పాటు లాంగ్​ రేంజ్​కూడా..
ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో స్టైల్​తో పాటు లాంగ్​ రేంజ్​కూడా..

ఇండియాన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ 2 వీలర్​ సెగ్మెంట్​లో చాలా ప్రాడక్ట్స్​ ఉన్నాయి. వాటిల్లో ఒకటి యాంపియర్​ నెక్సస్​. ఈ ఈ-స్కూటర్​ స్టైలిష్​గా ఉంటుంది. పైగా లాంగ్​ రేంజ్​ని కూడా కలిగి ఉంది. ఈ మోడల్ ఒక హై పర్ఫార్మింగ్​ ఫ్యామిలీ స్కూటర్​ అని సంస్థ చెబుతోంది. కొత్తగా ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్న వారు ఈ యాంపియర్​ నెక్సస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని ఆప్షన్​గా పెట్టుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

యాంపియర్​ నెక్సస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​..

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ ఈ యాంపియర్. ఈ యాంపియర్ నెక్సస్​లో 3 కిలోవాట్ల ఎల్​ఎఫ్​పీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఫుల్​ ఛార్జ్​ చేసేందుకు 3 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ సింగిల్​ ఛార్జ్​తో 100 కి.మీ రియల్​ వరల్డ్​ రేంజ్​ని ఇస్తుందని సంస్థ చెబుతోంది.

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో మిడ్-మౌంటెడ్ పీఎమ్ఎస్ మోటార్​ ఉంటుంది. 5.3 బీహెచ్​పీ పీక్​ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఈ యాంపియర్​ నెక్సస్​ ఈ- స్కూటర్ ఎకో, సిటీ, పవర్, లింప్ హోమ్ అనే నాలుగు రైడింగ్​ మోడ్స్​లో అందుబాటులో ఉంది. రివర్స్ మోడ్ కూడా ఇందులో ఉంది. ఈ స్కూటర్​ టాప్​ స్పీడ్​.. సిటీ మోడ్​లో గంటకు 63 కిలోమీటర్లు, ఎకో మోడ్​లో గంటకు 42 కిలోమీటర్లు, పవర్​లో గంటకు 93 కిలోమీటర్లు.

నెక్స్.ఆర్మర్​తో ఎనేబుల్ చేసిన లోడ్-స్ట్రాటిఫైడ్ డిజైన్​తో ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఛాసిస్ నాలుగు రెట్లు బలంగా ఉందని ఆంపియర్ తెలిపింది. ఈ-స్కూటర్ సన్నని ఫ్రేమ్, ఫ్లాట్ ఫ్లోర్​బోర్డ్ కలిగి ఉంటుంది. 12-ఇంచ్​ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి. యాంపియర్ నెక్సస్ డైమండ్ కట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఆర్కిటిక్ టెర్న్ ప్రేరేపిత టెయిల్ లైట్లతో వస్తుంది. ఈ మోడల్లో పెద్ద సీటు, అల్యూమినియం గ్రాబ్ హ్యాండిల్ కూడా ఉన్నాయి.

ఫీచర్ల విషయానికొస్తే.. యాంపియర్ నెక్సస్ ఈ-స్కూటర్​ 7 ఇంచ్​ టీఎఫ్​టీ టచ్​స్క్రీన్​ డ్యాష్​బోర్డ్​, కంపెనీ అభివృద్ధి చేసిన Nex.IO యూజర్ ఇంటర్​ఫేస్​తో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బేస్ వెర్షన్ 6.2 ఇంచ్​ ఎల్​సీడీ స్క్రీన్​తో వస్తోంది.

యాంపియర్​ నెక్సస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర..

రెండు వేరియంట్లలో లభిస్తున్న యాంపియర్​ నెక్సస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 1,14,900గా ఉంది.

ఈ యాంపియర్ నెక్సస్.. ఏథర్ రిజ్టా, ఓలా ఎస్ 1 ఎయిర్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తోంది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం