నగరాల్లో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలతో వాహనాలు సరైన మైలేజ్ ఇవ్వడం లేదు. ఫలితంగా పెట్రోల్ ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ 2 వీలర్లవైపు అడుగులు వేస్తున్నారు. మరి మీరు కూడా ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! సిటీ డ్రైవ్ కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఈ-స్కూటర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి. రేంజ్ ఎక్కువ ఉండటం వీటి ప్రత్యేకత!
బిగాస్ సీ12ఐ- ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 125 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. ఈ ఈ-స్కూటర్ టాప్ స్పీడ్ 60కేఎంపీహెచ్. బ్యాటరీపై 36వేల కి.మీలు లేదా 3ఏళ్ల వారెంటీ లభిస్తోంది. ఈ బ్యాటరీని 0-80శాతం ఛార్జ్ చేసేందుకు కనీసం 3 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. మూడు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. ఈ-స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 99,990 నుంచి రూ. 1,29,990 వరకు అందుబాటులో ఉంది.
బజాజ్ చేతక్ 3501- బెస్ట్ సెల్లింగ్ బజాజ్ చేతక్ ఈవీ వేరియంట్స్‌లో ఇదొకటి. ఇందులో 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని 0-80శాతం ఛార్జ్ చేసేందుకు 3 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది సుమారు 155 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. ఈ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.35 లక్షలుగా ఉంది. టాప్ స్పీడ్ 73 కేఎంపీహెచ్.
టీవీఎస్ ఐక్యూబ్- ఇండియాలో సేల్స్ పరంగా దూసుకెళుతున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ టీవీఎస్ ఐక్యూబ్. టీవీఎస్ నుంచి అందుబాటులో ఉన్న ఏకైక ఈవీ మోడల్ ఇది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 94,000 నుంచి రూ. 1.31లక్షల వరకు ఉంటుంది. ప్రారంభ ధరలో 94 కి.మీ రేంజ్‌ని ఇచ్చే 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ మోడల్ ఉంది. కాగా ఐక్యూబ్ 3.5 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ సింగిల్ ఛార్జ్‌తో 145 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 75 కేఎంపీహెచ్. 0-80శాతం ఛార్జ్ చేసేందుకు 2 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది.
ఏథర్ రిజ్టా- ఇండియాలో బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా పేరొందిన ఈ ఏథర్ రిజ్టా.. సిటీ డ్రైవ్‌కి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సెగ్మెంట్లోనే అతిపెద్ద సీటింగ్ ఫెసిలిటీతో వస్తోంది ఈ ఈ-స్కూటర్. ఈ ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్లో రెండు బ్యాటరీ ప్యాక్‌లు, మూడు వేరియంట్లు ఉన్నాయి. 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో కూడిన రిజ్టా వేరియంట్ 123 కి.మీ రేంజ్‌ని కలిగి ఉంది. ఇక 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 160 కి.మీ వరకు రేంజ్‌ని అందిస్తుంది. ఏథర్ రిజ్టా ఎక్స్‌షోరూం ధర రూ. 1.04 లక్షల నుంచి రూ. 1.42లక్షల వరకు ఉంటుంది.
అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్- ఇదొక లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో 3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 162 కి.మీ రేంజ్ లభిస్తుంది. 5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 220 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది. ఇక 6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని ఛార్జ్ చేస్తే 261 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఈ మూడింటి ఎక్స్‌షోరూం ధరలు వరుసగ రూ. 1.20లక్షలు, రూ. 1.70 లక్షలు, రూ. 2లక్షలు.
సంబంధిత కథనం