ఇండియాలో 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌కి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లకు స్విచ్ అవ్వాలని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీలకు సరిపోయే విధంగా మంచి ఈ-స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే. ఇండియాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
ఏథర్ రిజ్టా- ఇండియాలో ఉన్న బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇదొకటి. ఇంకా చెప్పాలంటే, ఏథర్ సంస్థ ఈ రిజ్టాని ఒక ఫ్యామిలీ వెహికిల్గానే ప్రమోట్ చేస్తోంది. అంతేకాదు, ఈ సెగ్మెంట్లోనే అతిపెద్ద సీటింగ్ ఫెసిలిటీ ఇందులో ఉండటం విశేషం. ఈ ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్, మూడు వేరియంట్లు ఉన్నాయి. 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో కూడిన రిజ్టా వేరియంట్ 123 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. ఇక 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 160 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది. ఏథర్ రిజ్టా ఎక్స్‌షోరూం ధర రూ. 1.04 లక్షల నుంచి రూ. 1.42లక్షల వరకు ఉంటుంది.
హండా యాక్టివా ఈ- యాక్టివా అనేది భారతీయ మధ్యతరగతి కుటుంబాల్లో దశాబ్దాలుగా ఒక భాగంగా ఉంది. ఇక యాక్టివాకి ఎలక్ట్రిక్ వర్షెన్ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. ఈ హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 102 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. రెండు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. హోండా యాక్టివా ఈ ఎక్స్‌షోరూం ధర రూ .1.17లక్షలు- రూ .1.51లక్షల మధ్యలో ఉంటుంది.
టీవీఎస్ ఐక్యూబ్- ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో ఒకటి ఈ టీవీఎస్ ఐక్యూబ్. ఇందులో 4 వేరియంట్లు ఉన్నాయి. అవి ఐక్యూబ్ 2.2 కేడబ్ల్యూహెచ్, ఐక్యూబ్ 3.5 కేడబ్ల్యూహెచ్, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ. ఇవి రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తున్నాయి. 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 94 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. ఇక 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 145 కి.మీ వరకు వెళ్లొచ్చు. వీటి ఎక్స్‌షోరూం ధరలు రూ. 94000 నుంచి రూ. 1.27లక్షల వరకు ఉన్నాయి.
బజాజ్ చేతక్- ఒకప్పుడు భారత దేశంలో టాప్ మోడల్‌గా ఉండి, ఇప్పుడు ఈవీ అవతారంలో వచ్చిన బజాజ్ చేతక్‌కి మంచి డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా బజాజ్ చేతక్ 3501 మోడల్ ఫ్యామిలీకి బెస్ట్ ఛాయిస్ అవుతోంది. ఇందులోని 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 155 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది. ఇందులో 2 వేరియంట్లు ఉన్నాయి. వీటి ఎక్స్‌షోరూం ధరలు రూ. 1,34,500- రూ. 1,39,500గా ఉన్నాయి.
ఓలా ఎస్1ఎక్స్- ఓలా ఎలక్ట్రిక్‌కి బెస్ట్ సెల్లింగ్‌గా కొనసాగుతోంది ఈ మోడల్. ఇందులో ఎస్1ఎక్స్‌తో పాటు ఎస్1ఎక్స్+ కూడా ఉంది. వీటిల్లో 2 కేడబ్ల్యూహెచ్ నుంచి 4 కేబ్ల్యూహెచ్ వరకు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. మినిమం రేంజ్ 108 కి.మీగా ఉండగా టాప్ రేంజ్ దాదాపు 240 కి.మీ వరకు ఉండటం విశేషం. ఇక ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 73,999 నుంచి రూ. 1,09,999 వరకు ఉంది.
మరి మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎంచుకుంటారు?
సంబంధిత కథనం