మిడిల్​ క్లాస్​ వారికి అందుబాటు ధరలో బెస్ట్​ ఎస్​యూవీ- హైదరాబాద్​లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..-checkout the best family suv maruti suzuki fronx on road price in hyderabad full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మిడిల్​ క్లాస్​ వారికి అందుబాటు ధరలో బెస్ట్​ ఎస్​యూవీ- హైదరాబాద్​లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

మిడిల్​ క్లాస్​ వారికి అందుబాటు ధరలో బెస్ట్​ ఎస్​యూవీ- హైదరాబాద్​లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

Sharath Chitturi HT Telugu

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్​లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​..

ఈ 2025లో మంచి ఫ్యామిలీ కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? మార్కెట్​లో చాలానే ఆప్షన్స్​ ఉన్నాయి. వాటిల్లో ఒకటి మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఎస్​యూవీ. కంపెనీకి ఈ మోడల్​ బెస్ట్​ సెల్లింగ్​గా కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీలకు అందుబాటు ధరలో ఉన్న మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ (హైదరాబాద్​లో) వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో మారుతీ సుజుకీ ఆన్​రోడ్​ ప్రైజ్​..

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ సిగ్మా- రూ. 8.96 లక్షలు

డెల్టా- రూ. 9.98 లక్షలు

సిగ్మా సీఎన్జీ- రూ. 10.08 లక్షలు

డెల్టా ప్లస్​- రూ. 10.45 లక్షలు

డెల్టా ఏఎంటీ- రూ. 10.57 లక్షలు

డెల్టా ప్లస్​ ఓపీటీ- రూ. 10.64 లక్షలు

డెల్టా ప్లస్​ ఏఎంటీ- రూ. 11.05 లక్షలు

డెల్టా సీఎన్జీ- రూ. 11.10 లక్షలు

డెల్ట్​ ప్లస్​ ఓపీటీ ఏఎంటీ- రూ. 11.23 లక్షలు

డెల్ట్​ ప్లస్​ డర్బో- రూ. 11.58 లక్షలు

జీటా టర్బో- రూ. 12.89 లక్షలు

ఆల్ఫా టర్బో- రూ. 14.01 లక్షలు

ఆలఫా టర్బో డీటీ- రూ. 14.21 లక్షలు

జీటా టర్బో ఏటీ- రూ. 14.60 లక్షలు

ఆల్ఫా టర్బో ఏటీ- రూ. 15.72 లక్షలు

ఆల్ఫా టర్బో డీటీ ఏటీ- రూ. 15.91 లక్షలు

అంటే.. హైదరాబాద్​లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 8.96 లక్షల నుంచి రూ. 15.91 లక్షల మధ్యలో ఉంది. డెల్టా ప్లస్​, డెల్టా సీఎన్జీ వేరియంట్లు బెస్ట్​ సెల్లింగ్​గా కొనసాగుతున్నాయి.

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్​ని కొనే ముందు, ఎక్స్​షోరూం ప్రైజ్​ కాకుండా ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకుని బడ్జెట్​ వేసుకోవాలి.

మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శిస్తే మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఎస్​యూవీ టెస్ట్​ డ్రైవ్​తో పాటు ఆఫర్స్​, డిస్కౌంట్స్​ వంటి వివరాలపైనా క్లారిటీ వస్తుంది. ఆ మేరకు మీరు మీ బడ్జెట్​ని ప్లాన్​ చేసుకోవచ్చు.

ఈ ఏడాది మారుతీ సుజుకీ వాహనాల ధరలు ఇప్పటికే పలుమార్లు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఫ్రాంక్స్​ ధర కూడా పెరిగింది.

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​..

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ పొడవు 3,995 ఎంఎం, వెడల్పు 1,765 ఎంఎం, ఎత్తు 1,550 ఎంఎం. దీని వీల్‌బేస్ 2,520 ఎంఎం- 308 లీటర్ల బూట్ స్టోరేజ్ ఉంది.

ప్రస్తుతం తయారీదారుల లైనప్​లో టర్బోఛార్జ్​డ్ పెట్రోల్ ఇంజిన్​తో వచ్చిన ఏకైక కారు ఫ్రాంక్స్. ఇది గరిష్టంగా 5,500 ఆర్​పీఎమ్ వద్ద 99 బీహెచ్​పీ పవర్, 2,000-4,500 ఆర్​పీఎమ్ వద్ద 147 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఫ్రాంక్స్​ ఎస్​యూవీలో ఉంది. ఇది గరిష్టంగా 6,000 ఆర్​పీఎమ్ వద్ద 89 బీహెచ్​పీ పవర్- 4,400ఆర్​పీఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లేదా 5-స్పీడ్ ఏఎంటీతో లభిస్తుంది.

చివరిగా, నేచురల్లీ ఆస్పిరేటెడ్​ ఇంజిన్​ను ఉపయోగించే సీఎన్జీ పవర్​ట్రైన్ కూడా ఉంది. ఇది సీఎన్జితో నడిచేటప్పుడు, 6,000 ఆర్​పీఎమ్ వద్ద 76 బీహెచ్​పీ పీక్​ పవర్​ని, 4,300 ఆర్​పీఎం వద్ద పీక్​ టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. సీఎన్జీ పవర్ట్రెయిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్​బాక్స్​తో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​ లేదు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం