Electric car : ఈ బుడ్డి ఎలక్ట్రిక్​ కారు డోరు ముందు వైపు ఉంటుంది- రేంజ్​ కూడా సూపర్​!-checkout microlino electric car best for city drive see range and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Car : ఈ బుడ్డి ఎలక్ట్రిక్​ కారు డోరు ముందు వైపు ఉంటుంది- రేంజ్​ కూడా సూపర్​!

Electric car : ఈ బుడ్డి ఎలక్ట్రిక్​ కారు డోరు ముందు వైపు ఉంటుంది- రేంజ్​ కూడా సూపర్​!

Sharath Chitturi HT Telugu
Dec 30, 2024 02:08 PM IST

Electric car for city drive : ముందు వైపు డోరు తెరుచుకునే కారును ఎప్పుడైనా మీరు చూశారా? అయితే ఇది మీకోసమే! ఈ మైక్రోలినో ఎలక్ట్రిక్​ కారులో డిజైన్​తో పాటు మరెన్నో క్రేజీ అంశాలు ఉన్నాయి. ఆ వివరాలు..

ఈ బుడ్డి ఎలక్ట్రిక్​ కారు డిజైన్​ నెక్ట్స్​ లెవల్​!
ఈ బుడ్డి ఎలక్ట్రిక్​ కారు డిజైన్​ నెక్ట్స్​ లెవల్​! (@ebiketips)

ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్​ వాహనాలవైపు దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో కస్టమర్స్​ని ఆకట్టుకునేందుకు కొత్త కొత్త మోడల్స్​ అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో ఒకటి మొక్రోలినో ఎలక్ట్రిక్​ కారు! సిటీ డ్రైవ్​కి పర్ఫెక్ట్​గా సరిపోయే బుడ్డి ఈవీ ఇది. అంతేకాదు దీని డిజైన్​ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ 2 సీటర్​ ఎలక్ట్రిక్​ కారు డోరు ముందు వైపు ఉంటుంది. ఈ మైక్రోలినో ఫీచర్స్​, రేంజ్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

సిటీ డ్రైవ్​కి ఈ ఎలక్ట్రిక్​ కారు బెస్ట్​..!

స్విస్​ కంపెనీ అయిన మైక్రో మొబిలిటీ సిస్టెమ్స్​ రూపొందించిన ఈ మైక్రోలినో ఎలక్ట్రిక్​ కారులో 12.4 కేడబ్ల్యూ మోటర్​ ఉంటుంది. దీని టాప్​ స్పీడ్​ 90 కేఎంపీహెచ్​. ఈ ఈవీ 0 నుంచి 50 కేఎంపీహెచ్​కి చేరుకునేందుకు కేవలం 5 సెకన్లు చాలని సంస్థ చెబుతోంది.

ఈ ఎలక్ట్రిక్​ కారులో 5.5 కేడబ్ల్యూహెచ్​, 10.5 కేడబ్ల్యూహెచ్​, 15 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఇవన్నీ లిథియం అయాన్​ బ్యాటరీలే. వీటిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే వరుసగా 93 కి.మీ, 177 కి.మీ, 228 కి.మీ రేంజ్​ని ఇస్తాయని సంస్థ చెబుతోంది.

5.5 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్​ చేసేందుకు 2 గంటల సమయం పడుతుంది. మిగిలిన రెండు బ్యాటరీలను 4 గంటలు, 5.5 గంటల్లో ఫుల్​ ఛార్జ్​ చేసుకోవచ్చు.

మైక్రోలినో డిజైన్​- డైమెన్షన్స్​..

ఫుల్లీ రెట్రో థీమ్​ డిజైన్​ ఈ మైక్రోలినో ఎలక్ట్రిక్​ కారు సొంతం. ముందు వైపు డోర్​ ఓపెన్​ అవ్వడం ఈ డిజైన్​ హైలైట్​. ఇందులో ఫ్రెంట్​- రేర్​ హారిజాంటల్​ లైట్​ బార్స్​, బై- ఎల్​ఈడీ హెడ్​లైట్​, టెయిల్​లైట్​ వంటి ఫ్యూచరిస్టిక్​ డిజైన్​ ఎలిమెంట్స్​ కూడా ఉన్నాయి. ఇందులో స్టైలిష్​ అల్లాయ్​ వీల్స్​ ఉన్నాయి. సాఫ్ట్​ క్లోజ్​ ఫ్రెంట్​ డోర్​ మెకానిజం, 4 వీల్స్​కి ఇండిపెండెంట్​ సస్పెన్షన్​ సిస్టెమ్​, వీగన్​ లెథర్​ ట్రిమ్డ్​ స్టీరింగ్​ వీల్​, ఇంటిగ్రేటెడ్​ పోర్టెబుల్​ బ్లూటూత్​ స్పీకర్​, 3 లేవల్​ ఎలక్ట్రిక్​ హీటింగ్​ సెటప్​, సెంట్రల్​ లాకింగ్​ సిస్టెమ్​, హీటెడ్​ ఫ్రెంట్​ అండ్​ రేర్​ విండ్​స్క్రీన్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​- టచ్​స్క్రీన్​ సెంట్రల్​ డిస్​ప్లే వంటివి ఈ ఈవీలోని మరికొన్ని ఫీచర్స్​.

ఈ బుడ్డి ఎలక్ట్రిక్​ కారు స్టాండర్డ్​ కర్బ్​ వెయిట్​ 496 కేజీలు. దీని పొడవు 2519 ఎంఎం, వెడల్పు 1473 ఎంఎం, ఎత్తు 1501 ఎంఎం. సీటీ డ్రైవ్​కి ఇది బాగా ఉపయోగపడుతుంది. పార్కింగ్​ కష్టాలు కూడా ఉండవు!

మైక్రోలినో ఎలక్ట్రిక్​ కారులో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి మైక్రోలినో అర్బన్​, మైక్రోలినో డాల్సీ, మైక్రోలినో కాంపెటైజియోన్​.

మైక్రోలినో ఎలక్ట్రిక్​ కారు ఇండియాలో అందుబాటులో ఉందా?

ఈ మైక్రోలినో ఎలక్ట్రిక్​ కారు ప్రత్యేకంగా పలు యూరోప్​ దేశాల్లోనే అందుబాటులో ఉంది. సాధారణంగా దీని ప్రారంభ ధర 18,000 పౌండ్లుగా ఉంది. అంటే దీని ధర కాస్త ఎక్కువే! యూరోప్​ దేశాల్లో ఇది సక్సెస్​ అయితే, ఆసియాలోకి కూడా ఈ మోడల్​ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. భారత్​లో లాంచ్​ అవుతుందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ ఒక వేళ లాంచ్​ అయితే మాత్రం.. ఇప్పటికే మన మార్కెట్​లో ఉన్న మరో బుడ్డి ఎలక్ట్రిక్​ కారు ఎంజీ కామెట్​ ఈవీకి ఈ మైక్రోలినో ఈవీ గట్టి పోటీని ఇచ్చే అవకాశం లేకపోలేదు.

Whats_app_banner

సంబంధిత కథనం