Mahindra XEV 9E : మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారుకు సూపర్ క్రేజ్! ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
Mahindra XEV 9E on road price in Hyderabad : హైదరాబాద్‌లో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతో మీకు తెలుసా? ఆ వివరాలతో పాటు ఈ మోడల్ రేంజ్వంటి విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ దేశవ్యాప్తంగా గత వారమే మొదలయ్యాయి. ఈ మోడల్‌కి కస్టమర్స్ నుంచి మంచి డిమాండ్ కనిపిస్తోంది. మరి మీరు కూడా ఎక్స్ఈవీ 9ఈని బుక్ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్‌లో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి. ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకుని మీ బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోండి.
హైదరాబాద్‌లో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఆన్‌రోడ్ ప్రైజ్..
- మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ప్యాక్ వన్- రూ. 23.01 లక్షలు
- ప్యాక్ టు- రూ. 26.15 లక్షలు
- ప్యాక్ త్రీ సెలెక్ట్- రూ. 29.29 లక్షలు
- ప్యాక్ త్రీ- రూ. 32.20 లక్షలు
అంటే, హైదరాబాద్‌లో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 23.01 లక్షల నుంచి రూ. 32.20 లక్షల వరకు ఉంటుందని అర్థం.
సాధారణంగా వెహికల్‌కి ఎక్స్‌షోరూం ప్రైజ్, ఆన్‌రోడ్ ప్రైజ్‌లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్‌ని లాంచ్ చేసే సమయంలో ఆటోమొబైల్ సంస్థలు ఎక్స్‌షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్‌రోడ్ ప్రైజ్ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్‌ని కొనే ముందు, ఎక్స్‌షోరూం ప్రైజ్ కాకుండా ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకుని బడ్జెట్ వేసుకోవాలి.
మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శిస్తే ఈ మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ టెస్ట్ డ్రైవ్ చేసి, వెహికిల్‌ని బుక్ చేసుకోవచ్చు.
ఎక్స్ఈవీ 9ఈని ఎలా బుక్ చేసుకోవాలి?
ఎక్స్ఈవీ 9ఈతో పాటు బీఈ 6 ఎలక్ట్రిక్ వాహనాల బుకింగ్స్‌ని ఫిబ్రవరి 14న మహీంద్రా సంస్థ ప్రారంభించింది. వీటికి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. మహీంద్రా ఆన్లైన్ వెబ్సైట్ లేదా సమీపంలోని డీలర్షిప్ షోరూమ్‌లో ఈ వెహికిల్స్‌ని బుక్ చేసుకోవచ్చు.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ..
ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారులో 59 కిలోవాట్, 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే వరుసగా 542 కిలోమీటర్లు, 656 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తాయి.
బీఈ 6 ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు తెలుసా?
హైదరాబాద్‌లో మహీంద్రా బీఈ 6 ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
- మహీంద్రా బీఈ 6 ప్యాక్ వన్- రూ. 19.87 లక్షలు
- ప్యాక్ వన్ అబోవ్- రూ. 21.55 లక్షలు
- ప్యాక్ టూ- రూ. 23.01 లక్షలు
- ప్యాక్ త్రీ సెలెక్ట్- రూ. 25.73 లక్షలు
- ప్యాక్ త్రీ- రూ. 28.43 లక్షలు
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని 59 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ రేంజ్‌ని ఇంకా చెప్పలేదు. 79 కిలోవాట్ల ప్యాక్ ఏఆర్ఏఐ టెస్టింగ్ ప్రకారం 682 కిలోమీటర్ల పరిధిని సాధిస్తుందని సంస్థ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం