సింగిల్​ ఛార్జ్​తో 150 కి.మీ రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​కి సూపర్​ క్రేజ్, ధర ఎంతంటే..-checkout best electric scooter bajaj chetak price batter range and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సింగిల్​ ఛార్జ్​తో 150 కి.మీ రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​కి సూపర్​ క్రేజ్, ధర ఎంతంటే..

సింగిల్​ ఛార్జ్​తో 150 కి.మీ రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​కి సూపర్​ క్రేజ్, ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

మంచి ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీరు బజాజ్​ చేతక్​ గురించి తెలుసుకోవాల్సిందే! బజాజ్​ చేతక్​ ధర, రేంజ్​, వేరియంట్లతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​..

ఇండియన్​ 2 వీలర్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ సెగ్మెంట్​లో బెస్ట్​ సెల్లింగ్​గా కొనసాగుతోంది బజాజ్​ చేతక్​. గత ఆర్థిక ఏడాదిలో 2.6లక్షల చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు అమ్ముడుపోయాయి. కొత్త ఈ-స్కూటర్​ కొనాలనుకునే వారికి ఈ మోడల్​ మంచి ఆప్షన్​ అవుతోంది. ఈ నేపథ్యంలో బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర, రేంజ్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​..

బజాజ్​ చేతక్​ సక్సెస్​కి ఉన్న కారణాల్లో ఒకటి దాని డిజైన్​! రెట్రో ఫీల్​తో పాటు మాడర్న్​ లుక్​ని ఇచ్చే విధంగా ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ డిజైన్​ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్​ బ్యాలెన్స్​ అని మార్కెట్​ నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఈ-స్కూటర్​కి ప్రీమియం ఫీల్​ని ఇచ్చే స్టైలిష్​ ఆప్షన్​గా పరిగణించవచ్చు.

పిస్తా గ్రీన్​, హెజిల్​నట్​, ఇండిగో మెటాలిక్​, బ్రూక్లిన్​ బ్లాక్​, మాట్​ స్కార్లెట్​ రెడ్​ వంటి కలర్​ ఆప్షన్స్​లో ఈ బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ అందుబాటులో ఉంటుంది.

ఇక ఇందులో సీబీఎస్​ (కాంబీ బ్రేక్​ సిస్టెమ్​) ఉంటుంది. రెండు బ్రేక్స్​ ఒకేసారి వేసినప్పుడు బ్రేకింగ్​ స్టెబులిటీని ఇది ఇస్తుంది. సిటీ రైడ్​కి ఇది బాగా ఉపయోగపడుతుంది. చేతక్​ సస్పెన్షన్​ కూడా బాగుంటుంది. బంప్స్​ని బాగా అబ్సార్బ్​ చేస్తుంది. రైడ్​ క్వాలిటీ బాగుంటుంది.

బజాజ్​ చేతక్​లోని టీఎఫ్​టీ టచ్​స్క్రీన్​ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​లో బ్లూటూత్​ కనెక్టివిటీ ఆప్షన్​ ఉంటుంది. కన్సోల్​ నుంచే కాల్స్​ని ఆన్సర్​ చేయగలిగ ఫీచర్​ కూడా ఉంది. ఇక ఈ ఈ-స్కూటర్​లో రివర్స్​ మోడ్​, సెల్ఫ్​ క్యాన్సిలింగ్​ బ్లింకర్​, ఆటో హాజర్డ్​ లైట్స్​ వంటివి ఉన్నాయి. బజాజ్​ చేతక్​ టెక్​ప్యాక్​ ఆప్షన్​లో మ్యూజిక్​ కంట్రోల్​, సీక్వెన్షియల్​ రేర్​ బ్లింకర్​, ఈవెన్​ నేవిగేషన్​ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.

బజాజ్​ చేతక్​ వేరియంట్లు- వాటి రేంజ్​, ధరలు..

బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ బజాజ్​ చేతక్​లో 6 వేరియంట్లు ఉన్నాయి. అవి..

చేతక్​ 2903- ఇందులో 2.88 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 123 కి.మీ రేంజ్​ ఇస్తుంది. ఈ స్కూటర్​ టాప్​ స్పీడ్​ 63కేఎంపీహెచ్​. ఈ స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.1లక్షలు.

చేతక్​ 2903 టెక్​ప్యాక్​- ఇందులో చేతక్​ 2903లో ఉన్న బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. రేంజ్​ కూడా ఒకటే. కాగా ఈ మోల్​లో కంఫర్ట్​ని పెంచే విధంగా అదనపు ఫీచర్లు వస్తాయి. దీని ఎక్స్​షోరూం ధర రూ. 1.14లక్షలు.

చేతక్​ 3502- ఇందులో 3.5 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని రేంజ్​ 153 కి.మీలు. ఈ బజాజ్​ చేతక్​ 3502 ఎలక్ట్రిక్​ స్కూటర్​ వేరియంట్ ఎక్స్​షోరూం​ ధర రూ. 1.3లక్షలు. టాప్​ స్పీడ్​ 73 కేఎంపీహెచ్​.

చేతక్​ 3502 టెక్​ప్యాక్​- ఇందులో చేతక్​ 3502లో ఉన్న బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. రేంజ్​ 153 కి.మీలు. కానీ దీని ఎక్స్​షోరూం ధర రూ. 1.35లక్షలు. అధిక ప్రైజ్​లో క్లాక్​, జియో ఫెన్సింగ్​, యాంటీ థెఫ్ట్​ అలారం వంటి అదనపు ఫీచర్లు వస్తాయి.

చేతక్​ 3501- ఇందులోనూ 3.5 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని రేంజ్​ 153 కి.మీ. టాప్​ స్పీడ్​ 73 కేఎంపీహెచ్​. అదనపు కంఫర్ట్​ ఫీచర్స్​ జోడించడం కారణంగా దీని ఎక్స్​షోరూం ధర రూ. 1.42లక్షల వరకు వెళుతుంది.

బజాజ్​ చేతక్​ 3501 టెక్​ప్యాక్​- ఇందులో చేతక్​ 3501కి సమానమైన బ్యాటరీ, రేంజ్​ ఉంటాయి. అదనపు ఫీచర్స్​ రావడంతో దీని ధర రూ. 1.47లక్షల వరకు వెళుతుంది.

ఆ ఎలక్ట్రిక్​ స్కూటర్​కి గట్టిపోటీ..

బెస్ట్​ సెల్లింగ్​ టీవీఎస్​ ఐక్యూబ్​కి బజాజ్​ ఎలక్ట్రిక్​ గట్టిపోటీని ఇస్తోంది. గత ఆర్థిక ఏడాదిలో 2.73లక్షల ఐక్యూబ్​ యూనిట్​లు అమ్ముడుపోగా, బజాజ్​ చేతక్​కి చెందిన 2.6లక్షల యూనిట్ల సేల్స్​ జరిగాయి. అంటే దాదాపు 13వేల వ్యత్యాసం ఉంది. కాగా అంతకుముందు ఆర్థిక ఏడాదిలో అది సుమారు 70వేల వరకు ఉండటం గమనార్హం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం