ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ల ధర 50వేల కన్నా తక్కువే- రేంజ్​లో మాత్రం బెస్ట్​..!-checkout best affordable electric scooters priced below 50000 range and more details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ల ధర 50వేల కన్నా తక్కువే- రేంజ్​లో మాత్రం బెస్ట్​..!

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ల ధర 50వేల కన్నా తక్కువే- రేంజ్​లో మాత్రం బెస్ట్​..!

Sharath Chitturi HT Telugu

రేంజ్​ తగ్గకుండా, బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! రూ. 50వేల బడ్జెట్​లో బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

బడ్జెట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​..

మార్కెట్​లో ఇప్పుడు లెక్కలేనన్నీ ఈవీ ఆప్షన్స్​ లభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా 2 వీలర్​ ఎలక్ట్రిక్​ సెగ్మెంట్​లో కస్టమర్స్​కి అనేక మోడల్స్​ అందుబాటులో ఉన్నాయి. మరి మీరు కొత్తగా ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? బడ్జెట్​ ఫ్రెండ్లీ ఆప్షన్స్​ కోసం వెతుకుతున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో రూ. 50వేల (ఎక్స్​షోరూం) కన్నా తక్కువ ధరలో లభిస్తున్న కొన్ని ఎలక్ట్రిక్​ స్కూటర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

బడ్జెట్​లో బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇవి..

కొమాకి ఎక్స్​ వన్​- ఈ కొమాకి ఎక్స్​ వన్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర రూ. 35,999 వద్ద ప్రారంభమై రూ. 59,999 వరకు వెళుతుంది. ఇందులో 1.5 కేడబ్ల్యూహెచ్​, 1.75 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్స్​ ఉన్నాయి. ఇవి సింగిల్​ ఛార్జ్​తో 55 కి.మీ నుంచి 150 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తాయి. ఈ-స్కూటర్​ టాప్​ స్పీడ్​ 60 కేఎంపీహెచ్​.

ఎక్స్​ వన్​ గ్రఫీనీ, ఎక్స్​ వన్​ లిథియం అయాన్​ 1.5 కేడబ్ల్యూహెచ్​, ఎక్స్​ వన్​ లిథియం ఐయన్​ 1.75 కేడబ్ల్యూహెచ్​, ఎక్స్​ వన్​ ప్రైమ్​ వేరియంట్ల ధరలు రూ. 50వేల లోపే ఉన్నాయి.

ఓలా గిగ్​- ఈ ఓలా గిగ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో రెండు వేరియంట్లు ఉన్నాయి. అవి గిగ్​ ఎస్​టీడీ, గిగ్​ ప్లస్​. వీటి ధరలు వరుసగా రూ. 39,999. రూ. 49,999. వీటిలో 1.5 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. గిగ్​ ఎస్​టడీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 110 కి.మీ వరకు, గిగ్​ ప్లస్​ని ఛార్జ్​ చేస్తే 157 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది.

మొదటి వేరియంట్​ టాప్​ స్పీడ్​ 25 కేఎంపీహెచ్​. అంటే రూల్స్​ ప్రకారం దీనిని నడిపేందుకు డ్రైవింగ్​ లైసెన్స్​ కూడా అక్కర్లేదు. గిగ్​ ప్లస్​ టాప్​ స్పీడ్​ 45కేఎంపీహెచ్​.

టున్వాల్​ మినీ స్పోర్ట్​ 63- ఈ అఫార్డిబుల్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర రూ. 49,990. ఇందులో 1.25 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జ్​ చేస్తే 60 నుంచి 65 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది. సింగిల్​ వేరియంట్​లో ఈ-స్కూటర్​ అందుబాటులో ఉంది. దీని టాప్​ స్పీడ్​ 25 కేఎంపీహెచ్​.

జీలో జూప్​- ఈ జీలో జూప్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర రూ. 45,900 నుంచి రూ. 86,900 వరకు ఉంటుంది. రూ. 50వేల ధరలోపు రెండు వేరియంట్లు వస్తున్నాయి. అవి జూప్​ గ్రఫీనీ 48వీ, జూప్​ గ్రఫీనీ 60వీ. వీటి రేంజ్​ 65 కి.మీ- 140 కి.మీ. వీటి టాప్​ స్పీడ్​ 70 కేఎంపీహెచ్​.

ఉజాస్​ ఈగో లా- 1.56 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉన్న ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర సుమారు రూ. 44వేలు. సింగిల్​ ఛార్జ్​తో ఇది 75 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. సింగిల్​ వేరియంట్​లో ఇది అందుబాటులో ఉంటుంది.

యూకై యువీ- ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర రూ. 44,400 వరకు ఉంటుంది. దీని టాప్​ స్పీడ్​ 25కేఎంపీహెచ్​. ఇందులోని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 55 నుంచి 60 కి.మీ వరకు రేంజ్​ ఇస్తుంది.

  • పైన చెప్పినవి ఎక్స్​షోరూం ధరలు అని గుర్తుపెట్టుకోండి.
  • ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ని సంప్రదించాల్సి ఉంటుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం