credit score : క్రెడిట్ స్కోర్‌ని మాటిమాటికి చెక్ చేస్తే.. మనకే నష్టమా?
Checking credit score frequently : క్రెడిట్ స్కోర్‌ని తరచూ చెక్ చేస్తే ఏమవుతుంది? మన క్రెడిట్ స్కోర్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందా? ఇక్కడ తెలుసుకోండి..

Checking credit score frequently impact : ఈ మధ్య కాలంలో క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యమైపోయింది. అయితే.. దీని చుట్టూ చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. క్రెడిట్ స్కోర్‌ని మాటిమాటికి చెక్ చేస్తే.. మన మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది కొందరు అంటూ ఉంటారు. ఇందులో నిజం ఎంత? ఇక్కడ తెలుసుకుందాము..
క్రెడిట్ స్కోర్‌ని మాటిమాటికి చెక్ చేస్తే..
క్రెడిట్ స్కోర్‌లో రెండు ఎంక్వైరీలు ఉంటాయి. ఒకటి సాఫ్ట్ ఎంక్వైరీ. రెండు హార్డ్ ఎంక్వైరీ. సాఫ్ట్ ఎంక్వైరీ అంటే.. మీకు మీరు సొంతంగా, లేదా కంపెనీలు మీ క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేయడం.
మరోవైపు, రుణదాత మీరు చేసిన క్రెడిట్ అప్లికేషన్ కోసం వారి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో భాగంగా మీ క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేసినప్పుడు .. దానిని హార్డ్ ఎంక్వైరీ అంటారు.
సాఫ్ట్ ఎంక్వైరీలతో సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. కాగా.. హార్డ్ ఎంక్వైరీలు మీ క్రెడిట్ స్కోరుపై చిన్న ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు. అది కూడా.. సాధారణంగా కొన్ని పాయింట్ల వరకు మాత్రమే అని, ఆ ప్రభావం కాలక్రమేణా తగ్గుతుంది చెబుతున్నారు.
How to check credit score : సాఫ్ట్ ఎంక్వైరీలో ఎలాంటి సమస్యలు లేనందునా.. ప్రజలు వారి క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి మీరు సాఫ్ట్ ఎంక్వైరీలను ఉపయోగించే సేవను ఉపయోగిస్తున్నట్లైతే, మీ క్రెడిట్ స్కోర్ మీద దెబ్బపడదు! ఖచ్చితత్వం కోసం మీ క్రెడిట్ రిపోర్ట్ ను క్రమం తప్పకుండా పర్యవేక్షించడంస మీ క్రెడిట్ స్టాండింగ్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
అయితే, మీరు చాలా తరచుగా క్రెడిట్ కోసం దరఖాస్తు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. తక్కువ వ్యవధిలోనే అనేక హార్డ్ ఎంక్వైరీలు ఉంటే.. క్రెడిట్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావ పడొచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు:
మీ క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేయడం మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుందా?
లేదు. అలా జరగదు. వాస్తవానికి కచ్చితత్వం కోసం ఎప్పటికప్పుడు స్కోర్ చెక్ చేసుకోవడం మంచిది.
సాఫ్ట్ ఎంక్వైరీ అంటే ఏమిటి?
మీ క్రెడిట్ స్కోర్‌ని మీరు చెక్ చేసుకోవడం. ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపదు.
హార్డ్ ఎంక్వైరీ అంటే ఏమిటి?
రుణాన్ని ఇచ్చే నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు.. రుణదాత మీ నివేదికను తనిఖీ చేసినప్పుడు, దానిని హార్డ్ ఎంక్వైరీ అంటారు.
రుణ స్థాయిలు కూడా క్రెడిట్ స్కోర్‌ని ప్రభావితం చేస్తాయా?
అవును, చేస్తాయి. రుణ మొత్తం, ముఖ్యంగా మీ ఆదాయ నిష్పత్తిలో, క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతుంది.
సంబంధిత కథనం