Bank holidays in October 2023 : అక్టోబర్​లో బ్యాంక్​లకు సెలవులే- సెలవులు.. లిస్ట్​ ఇదే!-check the list of bank holidays in october 2023 in india and telugu states ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Check The List Of Bank Holidays In October 2023 In India And Telugu States

Bank holidays in October 2023 : అక్టోబర్​లో బ్యాంక్​లకు సెలవులే- సెలవులు.. లిస్ట్​ ఇదే!

Sharath Chitturi HT Telugu
Sep 26, 2023 07:20 AM IST

Bank holidays in October 2023 : అక్టోబర్​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల లిస్ట్​ బయటకు వచ్చింది. నెల చివర్లో దాదాపు అన్ని సెలవులే ఉండటం గమనార్హం.

అక్టోబర్​లో బ్యాంక్​లకు ఎన్ని రోజులు సెలవు అంటే..!
అక్టోబర్​లో బ్యాంక్​లకు ఎన్ని రోజులు సెలవు అంటే..!

Bank holidays in October 2023 : సెప్టెంబర్​లో బ్యాంక్​లకు 16 రోజుల పాటు సెలవులు లభించాయి. ఇక అక్టోబర్​లో కనీసం 15 రోజుల పాటు బ్యాంక్​లు మూతపడి ఉంటాయి. వీటిల్లో శని, ఆదివారాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. దసరా నేపథ్యంలో అక్టోబర్​ చివరి వారంలో బ్యాంక్​ సేవలు.. సెలవుల కారణంగా నిలిచిపోనున్నాయి! బ్యాంకింగ్​ పనుల కోసం వెళ్లేవారు.. సెలవుల లిస్ట్​ను కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తర్వాతే తమ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడక తప్పదు. ఈ నేపథ్యంలో ఆర్​బీఐ రిలీజ్​ చేసిన బ్యాంక్​ సెలవుల లిస్ట్​ను ఇక్కడ చూద్దాము..

ట్రెండింగ్ వార్తలు

అక్టోబర్​లో బ్యాంక్​ సెలవులు లిస్ట్​..

2023 అక్టోబర్​ 2:- సోమవారం, మహాత్మా గాంధీ జయంతి. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 14:- రెండో శనివారం. దేశంలోని అన్ని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 15:- ఆదివారం. అన్ని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 18:- బుధవారం, కాతి బిహు. అసోంలోని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 19:- గురువారం, సంవత్సరి పండుగ. గుజరాత్​లోని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 21:- శనివారం, దుర్గాపూజ.

October bank holidays list : 2023 అక్టోబర్​ 22:- ఆదివారం.

2023 అక్టోబర్​ 23:- సోమవారం, మహా నవమి.

2023 అక్టోబర్​ 24:- మంగళవారం దసరా.

2023 అక్టోబర్​ 25:- దుర్గా పూజ (దసై)

2023 అక్టోబర్​ 26:- యాక్సెషన్​ డే. జమ్ముకశ్మీర్​లోని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 27:- దసై, దుర్గా పూజ.

2023 అక్టోబర్​ 28:- నాలుగో శనివారం, లక్ష్మీ పూజ.

2023 అక్టోబర్​ 29:- ఆదివారం.

2023 అక్టోబర్​ 31:- మంగళవారం, సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ జయంతి.

అంటే.. అక్టోబర్​ నెల చివర్లో బ్యాంక్​లకు దాదాపు అన్ని సెలవులే ఉన్నట్టు కనిపిస్తోంది!

ఇవి పనిచేస్తాయి..

Bank holidays list October in Hyderabad : బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీస్​, ఏటీఎం సేవలు పనిచేస్తాయి. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. అయితే కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవుల గురించి సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు ఉండవు.

WhatsApp channel

సంబంధిత కథనం