ఇండియాలో 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు ఎగబడుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కొత్త మోడల్స్‌ని కస్టమర్స్‌కి పరిచయం చేస్తున్నాయి. వీటిల్లో చౌకైన ధరలతో, మంచి రేంజ్‌తో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రజలను మరింత ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హిరో మోటోకార్ప్‌కి చెందిన విడా నుంచి కొత్త ఈ-స్కూటర్ ఇటీవలే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాని పేరు విడా వీఎక్స్2. ఈ మోడల్ రేంజ్, ధరతో పాటు పూర్తి వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి..
విడా వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్‌కి అఫార్డిబుల్ వర్షెన్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టింది ఈ విడా వీఎక్స్2. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి వీఎక్స్2 గో, వీఎక్స్2 ప్లస్. విడా వీఎక్స్2 రెండు వేరియంట్లు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉన్నాయి. వీఎక్స్2 గో ధర రూ. 99,490 (ఎక్స్-షోరూమ్) కాగా, వీఎక్స్2 ప్లస్ ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్).
వినియోగదారులు BaaS పథకాన్ని ఎంచుకుంటే, వీఎక్స్2 గో ఈ-స్కూటర్ ధర రూ. 59,490 (ఎక్స్-షోరూమ్) వీఎక్స్2 ప్లస్ ధర రూ. 64,990 (ఎక్స్-షోరూమ్) అవుతుంది. ఈ ప్లాన్‌లు రోజువారీ వినియోగం, రన్నింగ్ విధానాలపై ఆధారపడి ఉంటాయి. ఈ పథకం కింద, యజమాని కిలోమీటరుకు రూ. 0.96 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని విడా పేర్కొంది.
విడా వీఎక్స్2 గో రిమూవెబుల్ 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 92 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను అందిస్తుంది. దీని గరిష్ట వేగం 70 కేఎంపీహెచ్. మరోవైపు, ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ వేరియంట్ అయిన విడా వీఎక్స్2 ప్లస్ 3.4 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో రెండు రిమూవెబుల్ బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 142 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీ ప్యాక్‌ను ఒక గంటలో 0-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని విడా పేర్కొంది. బండిల్‌తో వచ్చే ఛార్జర్ ఆరు గంటల్లో బ్యాటరీ ప్యాక్‌ను 0-80 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఈ ఈ-స్కూటర్ 3.1 సెకన్లలో 0-40 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 80 కేఎంపీహెచ్ వరకు ఉంటుంది.
విడా వీఎక్స్2ని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో సరసమైన, ఆచరణాత్మకమైన సిటీ కమ్యూటర్‌గా రూపొందించిడం జరిగింది. వీఎక్స్2 ఈ-స్కూటర్ కొన్ని ఆచరణాత్మక డిజైన్ ఎలిమెంట్స్‌తో 33.2-లీటర్ అండర్-సీట్ బూట్, సౌకర్యవంతమైన ఫ్రెంట్ కంపార్ట్‌మెంట్ ఉన్నాయి. అండర్‌సీట్ స్టోరేజ్ బ్యాగులు, బాటిల్స్ వంటి వాటికి తగినంత స్థలాన్ని అందిస్తుంది. ఫ్రంక్ కీలు, కేబుల్స్, ఛార్జర్ వంటి వాటిని ఉంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. మరో ఆచరణాత్మక డిజైన్ అంశం పొడవైన సీటు! ఇది రైడర్, పిలియన్ రైడర్‌కు విశాలమైన సీటింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందిస్తుంది.
విడా వీఎక్స్2 కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. ఇది అగ్రెసివ్‌గా లేదా స్పోర్టీగా లేదా ఆకట్టుకునే విధంగా లేకపోయినా, ఖచ్చితంగా ఆచరణాత్మకంగా ఉంటుంది. ఈ స్కూటర్‌లో విడా వీ2 మాదిరిగానే ఇంటిగ్రేటెడ్ బైఫర్కేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్‌తో కూడిన డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంది. అలాగే, హ్యాండిల్‌బార్‌లలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, ఎల్ఈడీ టెయిల్‌లైట్ ఉన్నాయి. వేగం, మిగిలిన ఛార్జ్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని చూపించే టీఎఫ్టీ డిస్‌ప్లే ఉంది.
వీఎక్స్2 ఏడు విభిన్న రంగులలో లభిస్తుంది – నెక్సస్ బ్లూ, మెటాలిక్ గ్రే, మ్యాట్ వైట్, ఆటం ఆరెంజ్, మ్యాట్ లైమ్, పెర్ల్ బ్లాక్, పెర్ల్ రెడ్.
మరి మీరు ఈ కొత్త అఫార్డిబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కొంటారా?
సంబంధిత కథనం