Electric scooter : సింగిల్​ ఛార్జ్​తో 165 కి.మీ రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​తో డబ్బు ఆదా కూడా!-check out vida v2 electric scooter range price and other details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooter : సింగిల్​ ఛార్జ్​తో 165 కి.మీ రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​తో డబ్బు ఆదా కూడా!

Electric scooter : సింగిల్​ ఛార్జ్​తో 165 కి.మీ రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​తో డబ్బు ఆదా కూడా!

Sharath Chitturi HT Telugu
Jan 11, 2025 10:18 AM IST

Vida V2 electric scooter : ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఒకటి విడా వీ2. ఈ మోడల్​ వేరియంట్లు, రేంజ్​, ధరలతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

విడా వీ2 ఎలక్ట్రిక్​ స్కూటర్​..
విడా వీ2 ఎలక్ట్రిక్​ స్కూటర్​..

మీరు ఒక మంచి ఎలక్ట్రిక్​ స్కూటర్​ని కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! మార్కెట్​లో ప్రస్తుతం ఉన్న ఈ-స్కూటర్ల ఆప్షన్​లో విడా వీ2 ఒకటి. ఈ మోడల్​కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విడా వీ2 వేరియంట్లు, ధరలు, రేంజ్​తో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

విడా వీ2 ఎలక్ట్రిక్​ స్కూటర్​..

విడా వీ2 ఎలక్ట్రిక్​ స్కూటర్​లో మొత్తం 3 వేరియంట్లు ఉన్నాయి. అవి లైట్​, ప్లస్​, ప్రో. విడా వీ2 లైట్.. మొత్తం లైనప్​లో అత్యంత సరసమైన ఆఫర్. ఇది 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో వస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 94 కిలోమీటర్ల (ఐడీసీ) రేంజ్​ని అందిస్తుంది. ప్లస్, ప్రో వేరియంట్లతో పాటు విడా ఫ్యామిలీలోకి ఇది పూర్తిగా కొత్త వేరియంట్! వీ2 లైట్ గరిష్ట వేగం గంటకు 69 కిలోమీటర్లు. రైడ్, ఎకో అనే రెండు రైడింగ్ మోడ్స్​తో అందుబాాటులో ఉంది. 7 ఇంచ్​ టీఎఫ్​టీ టచ్​స్క్రీన్ సహా అత్యంత ఖరీదైన వేరియంట్ల మాదిరిగానే ఈ-స్కూటర్​లోనూ అనేక ఫీచర్ సెట్ ఉంటుంది.

విడా వీ2 ప్లస్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రేంజ్​ 143 కిలోమీటర్లు. ఇందులో 3.44 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ ఉంది. ఇక 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ ఉన్న వీ2 ప్రోని ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుంది. ఇవి రిమూవెబుల్​ బ్యాటరీ ప్యాక్స్​. సుమారు ఆరు గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతాయి.

విడా వీ2 ఎలక్ట్రిక్​ స్కూటర్​ స్పెసిఫికేషన్స్..

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ పీఎమ్​ఎస్ మోటార్ 6 కిలోవాట్ల (8బీహెచ్​పీ), 26ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది. వీ2 ప్లస్, ప్రోలో నాలుగు రైడింగ్ మోడ్లు ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీని స్టాండర్డ్​గా పొందుతుంది. బ్యాటరీ ప్యాక్లకు 3 సంవత్సరాల / 30,000 కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది.

విడా వీ2 ఫీచర్లు- ధరలు..

ఈ విడా వీ2 ఎలక్ట్రిక్​ స్కూటర్​లో క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, రీజెనరేటివ్ బ్రేకింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 250 నగరాల్లో ఉన్న 3,100 ఛార్జింగ్ పాయింట్లను వీ2 కస్టమర్లు వినియోగించుకోవచ్చని హీరో తెలిపింది. రిజ్టా, ఐక్యూబ్, చేతక్​లతో పాటు యాంపియర్ నెక్సస్​, హోండా యాక్టివా ఈ వంటి మోడల్స్​కి ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ గట్టిపోటీని ఇస్తుంది.

విడా వీ2 లైట్ ధర రూ.96,000, వీ2 ప్లస్ ధర రూ.1.15 లక్షలు. వీ2 ప్రో ధర రూ.1.35 లక్షలు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ అని గుర్తుపెట్టుకోవాలి.

Whats_app_banner

సంబంధిత కథనం