Electric scooter : సింగిల్​ ఛార్జ్​తో 140 కి.మీ రేంజ్​! ఈ టీవీఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ అదుర్స్​..-check out this tvs x electric scooter range price and more details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooter : సింగిల్​ ఛార్జ్​తో 140 కి.మీ రేంజ్​! ఈ టీవీఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ అదుర్స్​..

Electric scooter : సింగిల్​ ఛార్జ్​తో 140 కి.మీ రేంజ్​! ఈ టీవీఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ అదుర్స్​..

Sharath Chitturi HT Telugu
Feb 01, 2025 06:44 AM IST

TVS X price : టీవీఎస్​ ఎక్స్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ మార్కెట్​లోకి వచ్చేసింది. దీని పేరు టీవీఎస్​ ఎక్స్​! ఈ ఫీచర్​ లోడెడ్​, హై పర్ఫార్మెన్స్​ స్కూటర్​ రేంజ్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇదిగో టీవీఎస్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​..
ఇదిగో టీవీఎస్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​..

కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? మీకోసం మరో ఆప్షన్​ అందుబాటులోకి వచ్చింది. అదే.. టీవీఎస్​ ఎక్స్​! ఈ హై- పర్ఫార్మెన్స్​ స్కూటర్​ డెలివరీలను సంస్థ ఇటీవలే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో టీవీఎస్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

టీవీఎస్ ఎక్స్: అదేమిటి?

టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ నిస్సందేహంగా ద్విచక్ర వాహన తయారీదారు నుంచి వస్తున్న సాహసోపేతమైన ఆఫర్! దీని రాడికల్ స్టైలింగ్ హైలైట్​. క్రియోన్ స్కూటర్​ కాన్సెప్ట్ ఆధారంగా వచ్చి ఈ వెహికిిల్​.. షార్ప్ లైన్స్, ప్రీమియం డిజైన్ చాలా వరకు ప్రొడక్షన్ వర్షెన్​ని పోలి ఉంది.

వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని 2023లోనే సంస్థ ప్రదర్శించింది. కానీ 2024 డిసెంబర్​ చివరి నాటికి డెలవరీలను ప్రారంభించింది. దశలవారీగా ఇతర నగరాలకు డెలివరీలను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.

టీవీఎస్ ఎక్స్ : ఫీచర్లు..

ఆండ్రాయిడ్ ఆటో కంపాటబిలిటీని ఇంటిగ్రేట్ చేసే 10.25 ఇంచ్​ టీఎఫ్​టీ డిస్​ప్లే.. ఈ టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ అతిపెద్ద ఫీచర్. టీఎఫ్​టీ స్క్రీన్ కూడా టిల్ట్-అడ్జెస్టెబుల్, నావ్​ప్రో ఆన్​బోర్డ్​ నావిగేషన్ సిస్టమ్, గేమ్స్, లైవ్ వీడియో స్ట్రీమింగ్, బ్రౌజింగ్ సహా మరెన్నో ఫీచర్లతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​లో క్రూయిజ్ కంట్రోల్, యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉన్నాయి.

టీవీఎస్ ఎక్స్ : రేంజ్​..

ఈ టీవీఎస్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 4.4 కిలోవాట్ల బ్యాటరీ ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల (ఐడీసీ) రేంజ్​ని అందిస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 11 కిలోవాట్ల (14.7 బీహెచ్​పీ) ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. ఇది 2.6 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది! ఈ మోడల్ మూడు రైడింగ్ మోడ్స్​తో వస్తుంది - ఎక్స్​టెల్త్, ఎక్స్​రైడ్, ఎక్స్​టానిక్. ఛార్జింగ్ సమయం 0-80 శాతం నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

టీవీఎస్ ఎక్స్​ ఈ-స్కూటర్​ని ఎక్స్​లెటన్ ప్లాట్​ఫామ్​పై సంస్థ నిర్మించింది. అల్యూమినియం ట్విన్-స్పార్ ఫ్రేమ్​తో ఈ స్కూటర్​ వస్తోంది. ఈ మోడల్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ఆఫ్​సెట్ మోనోషాక్ అబ్సార్బర్స్​ని కలిగి ఉంది. బ్రేకింగ్ పనితీరు 220 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 195 ఎంఎం రేర్ డిస్క్ నుంచి వస్తుంది. ఈ హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్-ఛానల్ ఏబీఎస్​ని స్టాండర్డ్​గా పొందుతుంది.

టీవీఎస్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ : ధర..

టీవీఎస్ నుంచి వస్తున్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఈ టీవీఎస్​ ఎక్స్​. ఈ ఫ్లాగ్​షిప్​ ఎక్స్ ఈ-స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 2.5లక్షల వద్ద ప్రారంభమవుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం