Low budget car : ఈ లో- బడ్జెట్​ మారుతీ 5 సీటర్​ కారు ఫ్యామిలీకి బెస్ట్​! ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..-check out this low budget car maruti celerio on road price hyderabad and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Low Budget Car : ఈ లో- బడ్జెట్​ మారుతీ 5 సీటర్​ కారు ఫ్యామిలీకి బెస్ట్​! ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Low budget car : ఈ లో- బడ్జెట్​ మారుతీ 5 సీటర్​ కారు ఫ్యామిలీకి బెస్ట్​! ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Jan 19, 2025 09:50 AM IST

మారుతీ సెలేరియోలో పెట్రోల్​, సీఎన్జీ వేరియంట్​ ఆప్షన్స్​ ఉన్నాయి. హైదరాబాద్​లో మారుతీ సెలేరియో ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సెలేరియో..
మారుతీ సెలేరియో..

ఎస్​యూవీలు, ఈవీల దండయాత్రలోనూ కొన్ని హ్యాచ్​బ్యాక్​, లో- బడ్జెట్​ వాహనాలకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. వాటిల్లో మారుతీ సెలేరియో ఒకటి. ఈ మోడల్​ పెట్రోల్​, సీఎన్జీ ఆప్షన్స్​లో అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్​లో మంచి కారు కొనాలని చూస్తున్న వారికి ఇది చక్కటి ఆప్షన్​ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో మారుతీ సెలేరియో ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో మారుతీ సెలేరియో ఆన్​రోడ్​ ప్రైజ్​..

  • మారుతీ సెలేరియో డ్రీమ్​ ఎడిషన్​- రూ. 5.89 లక్షలు
  • ఎల్​ఎక్స్​ఐ- రూ. 6.37 లక్షలు
  • వీఎక్స్​ఐ- 6.92 లక్షలు
  • జెడ్​ఎక్స్​ఐ- రూ .7.25 లక్షలు
  • వీఎక్స్​ఐ ఏఎంటీ- రూ. 7.44 లక్షలు
  • జెడ్​ఎక్స్​ఐ ఏఎంటీ- రూ. 7.77 లక్షలు
  • జెడ్​ఎక్స్​ఐ ప్లస్​- రూ. 7.81 లక్షలు
  • వీఎక్స్​ఐ సీఎన్జీ- రూ. 7.98 లక్షలు
  • జెడ్​ఎక్స్​ఐ ప్లస్​ ఏఎంటీ- రూ. 8.33 లక్షలు

అంటే హైదరాబాద్​లో 5 సీటర్​ మారుతీ సెలేరియో ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 5.8 లక్షల నుంచి రూ. 8.33 లక్షల వరకు ఉంటుంది. వీఎక్స్​ఐ, వీఎక్స్​ఐ సీఎన్జీ వేరియంట్లు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​గా ఉన్నాయి.

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్​ని కొనే ముందు, ఎక్స్​షోరూం ప్రైజ్​ కాకుండా ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకుని బడ్జెట్​ వేసుకోవాలి.

మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శిస్తే మారుతీ సెలేరియో 5 సీటర్​ టెస్ట్​ డ్రైవ్​తో పాటు ఆఫర్స్​, డిస్కౌంట్స్​ వంటి వివరాలపైనా క్లారిటీ వస్తుంది. ఆ మేరకు మీరు మీ బడ్జెట్​ని ప్లాన్​ చేసుకోవచ్చు.

మారుతీ సెలేరియోలో 998 సీసీ ఇంజిన్​ ఉంటుంది. పెట్రోల్​ వేరియంట్​ 55.92 బీహెచ్​పీ పవర్​ని 82.1 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇందులో మేన్యువల్​, ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఈ మారుతీ సెలేరియో పెట్రోల్​ వేరియంట్​ 25 కేఎంపీఎల్​ మైలేజ్​ని ఇస్తుంది. సీఎన్జీ వేరియంట్​ మైలేజ్​ 26.68 కేఎంకేజీ.

మారుతీ సెలేరియోలో ఏసీ, ఆండ్రాయిడ్​ ఆటో- యాపిల్​ కార్​ప్లే వంటి కనెక్టివిటీ ఫీచర్స్​తో పాటు పవర్​ విండోలు, సెంట్రల్​ లాకింగ్​ సెటప్​ వంటివి ఉన్నాయి. ఇందులో కీ లెస్​ ఎంట్రీతో పాటు కేబిన్​లో 7 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ కూడా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం