Electric scooter : సింగిల్ ఛార్జ్‌తో 150కి.మీ రేంజ్- ఐఫోన్ 16 కన్నా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర తక్కువే!
తక్కువ ధరలో లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! సింగిల్ ఛార్జ్‌తో 150 కి.మీ రేంజ్‌ని ఇచ్చే కొమాకి ఎంజీ ప్రో విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్లో ఆటోమొబైల్ సంస్థల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా వినియోగదారులకు మంచి జరుగుతోంది! లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇలాంటి ఈ-స్కూటర్స్‌లో ఒకటి కొమాకి ఎంజీ ప్రో! ఇది ఎంజీ ప్రో లిథియం సిరీస్ పేరుతో అందుబాటులో ఉంది. సింగిల్ ఛార్జ్‌తో 150 కి.మీ రేంజ్‌ని ఇచ్చే ఈ కొమాకి ఎంజీ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఐఫోన్ 16 ప్రైజ్ కన్నా తక్కువే! ఈ నేపథ్యంలో ఈ వెహికిల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొమాకి ఎంజీ ప్రో- బ్యాటరీ, రేంజ్..
కొమాకి ఎంజీ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం సిరీస్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఎంజీ ప్రో ఎల్ఐ, ఎంజీ ప్రో వీ, ఎంజీ ప్రో +. తక్కువ-స్పీడ్ ఎల్ఐ వేరియంట్ 1.75 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ని పొందుతుంది. ఇది 75 కిలోమీటర్ల (క్లెయిమ్) రేంజ్‌ని ఇస్తుంది. వీ 100 కిలోమీటర్ల (క్లెయిమ్ పరిధి) తో 2.2 కిలోవాట్ల బ్యాటరీని పొందుతుంది. కొమాకీ ఎంజీ ప్రో+ వేరియంట్ 150 కిలోమీటర్ల (క్లెయిమ్) పరిధితో 2.7 కిలోవాట్ల బ్యాటరీని పొందుతుంది. ఛార్జర్ 4 నుంచి 5 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలదు.
బ్యాటరీ ప్యాక్‌లో ఫెర్రో-ఫాస్ఫేట్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది సమస్యలను ముందుగానే గుర్తించడానికి 30కి పైగా సెన్సార్లను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆటో రిపేర్ ఫీచర్ కూడా ఉంది. ఇది చిన్న చిన్న సమస్యలను ఆటోమేటిక్‌గా పరిష్కరిస్తుంది.
కోమాకి ఎంజీ ప్రో లిథియం సిరీస్: ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అడ్వాన్స్ రెజెన్, పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్‌తో కూడిన వైర్లెస్ కంట్రోలర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మోటార్ అనేది బీఎల్ డీసీ హబ్ మౌంటెడ్ యూనిట్. ఈ స్కూటర్ డిజిటల్ మ్యాట్రిక్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు వైర్‌లెస్‌గా అప్డేట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. లాక్ బై రిమోట్ ఫంక్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రిపేర్ స్విచ్, టెలిస్కోపిక్ షాకర్, సెల్ఫ్ డయాగ్నసిస్, యాంటీ థెఫ్ట్ లాక్, మొబైల్ ఛార్జింగ్ స్లాట్ వంటి కొన్ని అదనపు ఫీచర్లు కూడా ఈ-స్కూటర్లో ఉన్నాయి.
ఈ కొమాకి ఎంజీ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జర్‌పై 1 సంవత్సరం వారంటీ, మోటార్, బ్యాటరీ, కంట్రోలర్‌కు 3 సంవత్సరాల లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ లభిస్తోంది.
కోమాకి ఎంజీ ప్రో లిథియం సిరీస్: ధర..
కోమాకి ఎంజీ ప్రో లిథియం నాలుగు రంగుల్లో లభిస్తుంది. అవి.. రెడ్, గ్రే, బ్లాక్, వైట్. కోమాకి ఎంజీ ప్రో లిథియం ఎల్ఐ వేరియంట్ ధర రూ.59,999 (ఎక్స్-షోరూమ్), ఎంజీ ప్రో వీ ధర రూ.69,999, కోమాకి ఎంజీ ప్రో లిథియం + వేరియంట్ ధర రూ.74,999 (ఎక్స్-షోరూమ్).
సంబంధిత కథనం