Best 7 seater car : ఫ్యామిలీకి పర్ఫెక్ట్​గా సెట్​ అయ్యే కారు ఇది- ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..-check out this best selling 7 seater car toyota innova crysta on road price hyderabad details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best 7 Seater Car : ఫ్యామిలీకి పర్ఫెక్ట్​గా సెట్​ అయ్యే కారు ఇది- ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Best 7 seater car : ఫ్యామిలీకి పర్ఫెక్ట్​గా సెట్​ అయ్యే కారు ఇది- ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Jan 14, 2025 10:20 AM IST

Toyota Innova Crysta on road price Hyderabad : బెస్ట్​ సెల్లింగ్​ 7 సీటర్​ టయోటో ఇన్నోవా క్రిస్టా కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? హైదరాాబద్​లో ఈ మోడల ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇన్నోవా క్రిస్టా..
ఇన్నోవా క్రిస్టా..

ఫ్యామిలీ అవసరాల కోసం ఆల్​రౌండ్​ కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో ఇటీవలి కాలంలో 7 సీటర్​ వాహనాలకు డిమాండ్​ బాగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆప్షన్స్​ కూడా వస్తున్నాయి. అయితే, ప్రీమియం లుక్స్​, ఫీచర్స్​ కావాలని కోరుకునే కస్టమర్స్​లు మాత్రం టయోటా ఇన్నోవా క్రిస్టాని ప్రిఫర్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో టయోటా క్రిస్టా ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

హైదరాబాద్​లో ఇన్నోవా క్రిస్టా ఆన్​రోడ్​ ప్రైజ్​..

  • ఇన్నోవా క్రిస్టా 2.4 జీఎక్స్​ 7ఎస్​టీర్​- రూ. 24.65 లక్షలు
  • 2.4 జీఎక్స్​ ప్లస్​ 7ఎస్​టీర్​- రూ. 26.96 లక్షలు
  • 2.4 వీఎక్స్​ 7ఎస్​టీఆర్​- రూ. 31.18 లక్షలు
  • 2.4 జెడ్​ఎక్స్​ 7 ఎస్​టీఆర్​- రూ. 33.24 లక్షలు

అంటే హైదరాబాద్​లో 7 సీటర్​ ఇన్నోవా క్రిస్టా ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 24.65 లక్షల నుంచి రూ. 33.24 లక్షల మధ్యలో ఉంటుంది. ఇవన్నీ డీజిల్​ ఇంజిన్​తోనే వస్తాయి.

కాగా టయోటా ఇన్నోవా క్రిస్టాలో 8 సీటర్​ ఆప్షన్​ కూడా ఉంది. హైదరాబాద్​లో 8 సీటర్​ ఇన్నోవా క్రిస్టా ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

  • ఇన్నోవా క్రిస్టా 2.4 జీఎక్స్​ 8ఎస్​టీఆర్​- రూ. 24.65 లక్షలు
  • 2.4 జీఎక్స్​ ప్లస్​ 8 ఎస్​టీఆర్​- రూ. 27.03 లక్షలు
  • 2.4 వీఎక్స్​ 8ఎస్​టీఆర్​- రూ. 31.24 లక్షలు

ఇవి కూడా డీజిల్​ ఇంజిన్​తోనే వస్తాయి. 2.4 జీఎక్స్​ ప్లస్​ 8ఎస్​టీఆర్​ వేరియంట్​.. మొత్తం ఇన్నోవా క్రిస్టా లైనప్​లో బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా కొనసాగుతోంది.

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్​ని కొనే ముందు, ఎక్స్​షోరూం ప్రైజ్​ కాకుండా ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకుని బడ్జెట్​ వేసుకోవాలి.

మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శిస్తే ఇన్నోవా క్రిస్టా​ 7 సీటర్​​ టెస్ట్​ డ్రైవ్​తో పాటు ఆఫర్స్​, డిస్కౌంట్స్​ వంటి వివరాలపైనా క్లారిటీ వస్తుంది. ఆ మేరకు మీరు మీ బడ్జెట్​ని ప్లాన్​ చేసుకోవచ్చు.

ఇన్నోవా క్రిస్టాలో 148బీహెచ్​పీ పవర్, 343ఎన్ఎమ్ పీక్​ టార్క్ ఉత్పత్తి చేసే 2.4-లీటర్ డీజల్ ఇంజిన్​తో వస్తుంది. కియా కారెన్స్, మారుతీ సుజుకీ ఎర్టిగా, మహీంద్రా ఎక్స్​యూవీ700, టాటా సఫారీ వంటి మల్టీ-సీటర్ ఎస్​యూవీలకు ఈ ఎంపీవీ గట్టిపోటీనిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం