Electric scooter : సిటీ డ్రైవ్‌కి ఈ కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్- రేంజ్, ధర వివరాలు..
Kinetic zing electric scooter : కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే మీరు కైనెటిక్ జింగ్ ఈ-స్కూటర్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ స్కూటర్ రేంజ్, ధరతో పాటు ఇతర వివరాలను చూసేయండి..
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో కైనెటిక్ ఎనర్జీకి చెందిన 'జింగ్' ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి! సిటీ డ్రైవ్‌కి అనుకూలంగా ఉండే విధంగా ఈ ఈ-స్కూటర్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్, ధరతో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సిటీ డ్రైవ్‌కి ఉపయోగపడే ఎలక్ట్రిక్ స్కూటర్..
కైనెటిక్ జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్‌లైట్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్, లో బ్యాటరీ ఇండికేటర్ వంటివి ఉన్నాయి. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ స్పీడోమీటర్, సెంట్రల్ లాకింగ్ సిస్టెమ్, అండర్ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఈ స్కూటర్ సొంతం.
ఈ ఈ-స్కూటర్ ఫ్రెంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్, రేర్‌లో అడ్జెస్టెబుల్ స్ప్రింగ్స్ వంటివి ఉన్నాయి. ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. అలాయ్ వీల్స్ ఈ స్కూటర్ సొంతం. ట్యూబ్‌లెస్ టైర్స్ వస్తున్నాయి.
కైనెటిక్ జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్..
ఈ కైనెటిక్ జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో హబ్ డ్రైవ్ 250వాట్ మోటార్ ఉంటుంది. జింగ్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి జింగ్ స్టాండర్డ్, మరొకటి జింగ్ బిగ్‌బీ. జింగ్ స్టాండర్డ్‌లో 1.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేసతే 70కి.మీ రేంజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఇక జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బిగ్‌బీ వేరియంట్లోని 1.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుందని సంస్థ స్పష్టం చేసింది.
ఈ కైనెటిక్ జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 45 కేఎంపీహెచ్. ఈ స్కూటర్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసేందుకు 4 గంటల సమయం పడుతుంది.
కైనెటిక్ జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు..
కైనెటిక్ జింగ్ స్టాండర్డ్ ఎక్స్‌షోరూం ధర రూ. 67,990గా ఉంది. ఇక జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బిగ్‌బీ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 75,990గా కొనసాగుతోంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రాయల్ వైట్, రొమాంటిక్ రెడ్, బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
కైనెటిక్ ఎనర్జీ నుంచి ఇతర ప్రాడక్ట్స్..
కైనెటిక్ ఎనర్జీ సంస్థ అనేక ఈవీ ప్రాడక్ట్స్‌ని విక్రయిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో జింగ్‌తో పాటు కైనెటిక్ ఎనర్జీకి జులు, జూమ్ వంటి ఇతర మోడల్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు, ఈ-లూనాని కూడా సంస్థ విక్రయిస్తోంది. ఈ లూనా ఎక్స్1, ఎక్స్2, ఎక్స్3 వంటి మోపెడ్లు ఉన్నాయ. 3 వీలర్ సెగ్మెంట్లోనూ కైనెటిక్ ఎనర్జీ పలు ప్రాడక్ట్స్‌ని సేల్ చేస్తోంది.
సంబంధిత కథనం