ఒక ఫ్యామిలీ మొత్తానికి సరిపడా కారు కొనాలంటే 7 సీటర్ ఆప్షన్స్ బెస్ట్! కానీ బెస్ట్ 7 సీటర్ కారు కొనాలంటే రూ. 10 లక్షల -12 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని చాలా మంది అనుకుంటారు. అయితే, మిడిల్ క్లాస్ వారి బడ్జెట్‌కి సరిపోయే విధంగా ఇండియాలో ఒక బెస్ట్ 7 సీటర్ కారు ఉంది. అదే రెనాల్ట్ ట్రైబర్! ఉన్న 7 సీటర్ ఆప్షన్స్‌లో ఈ రెనాల్ట్ ట్రైబర్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రెనాల్ట్ ట్రైబర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రెనాల్ట్ ట్రైబర్ ఆర్ఎక్స్ఈ- రూ. 7.21 లక్షలు
ఆర్ఎక్స్ఎల్- రూ. 8.16 లక్షలు
ఆర్ఎక్స్ఎల్ నైట్ అండ్ డే ఎడిషన్- రూ. 8.30 లక్షలు
ఆర్ఎక్స్టీ- రూ. 9.10 లక్షలు
ఆర్ఎక్స్టీ ఈజీ- ఆర్ ఏఎంటీ- రూ. 9.71 లక్షలు
ఆర్ఎక్స్జెడ్- రూ. 9.83 లక్షలు
ఆర్ఎక్స్జెడ్ డ్యూయెల్ టోన్- రూ. 10.10 లక్షలు
ఆర్ఎక్స్జెడ్ ఈజీ- ఆర్ ఏఎంటీ- రూ. 10.44 లక్షలు
ఆర్ఎక్స్జెడ్ ఈజీ- ఆర్ ఏఎంటీ డ్యూయెల్ టోన్- రూ. 10.71 లక్షలు
అంటే హైదరాబాద్‌లో రెనాల్ట్ ట్రైబర్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 7.21 లక్షల నుంచి రూ. 10.71 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ పెట్రోల్ వేరియంట్లే! డీజిల్, సీఎన్జీ వేరియంట్లు లేవు. కాగా రెనాల్ట్ ట్రైబర్ ఆర్ఎక్స్టీ ప్రస్తుతం బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతోంది.
సాధారణంగా వెహికల్‌కి ఎక్స్‌షోరూం ప్రైజ్, ఆన్‌రోడ్ ప్రైజ్‌లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్‌ని లాంచ్ చేసే సమయంలో ఆటోమొబైల్ సంస్థలు ఎక్స్‌షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్‌రోడ్ ప్రైజ్ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్‌ని కొనే ముందు, ఎక్స్‌షోరూం ప్రైజ్ కాకుండా ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకుని బడ్జెట్ వేసుకోవాలి.
మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శిస్తే రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్ టెస్ట్ డ్రైవ్‌తో పాటు ఆఫర్స్, డిస్కౌంట్స్ వంటి వివరాలపైనా క్లారిటీ వస్తుంది. ఆ మేరకు మీరు మీ బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోవచ్చు.
రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్‌కి అప్డేటెడ్ వర్షెన్‌పై సంస్థ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. 2025 రెండో భాగంలో ఇది ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కొత్త డిజైన్, సరికొత్త ఫీచర్స్ ఈ 7 సీటర్ కారులో ఉంటాయని అంచనాలు ఉన్నాయి. ఇంజిన్ కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
సంబంధిత కథనం