ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో విపరీతమైన పోటీ ఉంది. కస్టమర్స్‌ని ఆకట్టుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త మోడల్స్‌ని లాంచ్ చేస్తున్నాయి. కాగా ఈ సెగ్మెంట్లో అత్యధిక వాటా కలిగిన సంస్థగా దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కొనసాగుతోంది. ఈ కంపెనీకి చెందిన 5 మోడల్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. బడ్జెంట్ రేంజ్ నుంచి కాస్త ప్రీమియం రేంజ్ వరకు అన్ని ప్రైజ్ పాయింట్స్‌లోనూ టాటా మోటార్స్‌కి చెందిన ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వీటిల్లో సేఫ్టీ ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఫలితంగా, ఒక వేళ మీరు కొత్త ఈవీ కొనాలని అనుకుంటుంటే కింద ఇస్తున్న టాటా కార్ల రేంజ్, సేఫ్టీ ఫీచర్స్, ధరలు వంటి వివరాలను తెలుసుకుని ప్లాన్ చేయడం ఉత్తమం. టాటా కార్ల వివరాలు..
టాటా టియాగో ఈవీ- ఇండియాలో తక్కువ ధరకు లభిస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో టాటా టియాగో ఈవీ ఒకటి. 2025 మార్చ్‌లో 7వేలకు పైగా టియాగో ఈవీలు అమ్ముడుపోయాయి. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 7.99లక్షలు- రూ. 11.14లక్షల మధ్యలో ఉంటుంది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి 19.2 కేడబ్ల్యూహెచ్, 24 కేడబ్ల్యూహెచ్. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే వరుసగా 250, 315 కి.మీ రేంజ్‌ని ఇస్తాయి.
టాటా టియాగో ఈవీలో ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్సీ, రేర్ కెమెరా, 2 ఎయిర్‌బ్యాగ్స్, టీపీఎంఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
టాటా టిగోర్ ఈవీ- ఈ ఎలక్ట్రిక్ కారులో 26 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది. ఈ టిగోర్ ఈవీ ఎక్స్‌షోరూం ధర రూ. 12.49లక్షలు- రూ. 13.75 లక్షల మధ్యలో ఉంటుంది.
టాటా టిగోర్ ఈవీలో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, కార్నర్ స్టెబులిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉననాయి. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ జరిగిన తొలి భారత ఎలక్ట్రిక్ కారు ఇది. టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ సాధించింది.
టాటా పంచ్ ఈవీ- ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా ఉన్న టాటా పంచ్‌కి గతేడాది ఈవీ వర్షెన్‌ని లాంచ్ చేసింది టాటా మోటార్స్. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 9.99లక్షల నుంచి రూ. 14.44లక్షల వరకు ఉంటుంది. ఇందులో 25 కేడబ్ల్యూహెచ్, 35 కేబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే వరుసగా 315 కి.మీ, 420 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తాయి.
టాటా పంచ్ ఈవీకి గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, టీపీఎంఎస్, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ పార్కింగ్ సెన్సార్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రేర్ వైపర్, ఆటో డీఫాగర్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
టాటా నెక్సాన్ ఈవీ- ఇండియాతో పాటు టాటా మోటార్స్‌కి బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా కొనసాగుతోంది టాటా నెక్సాన్ ఈవీ. దీని అప్డేటెడ్ వర్షెన్‌ని గతేడాదే సంస్థ లాంచ్ చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 12.49లక్షలు- రూ. 17.19 లక్షలు. ఇందులోని 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని ఛార్జ్ చేస్తే 275 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది. ఇందులో 46.08 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. ఇది దాదాపు 500 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది.
గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో టాటా నెక్సాన్ ఈవీకి 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబులిటీ ప్రోగ్రామ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, రేర్ పార్కింగ్ కెమెరాతో పాటు అనేక కీలక ఫీచర్స్ ఉన్నాయి.
టాటా కర్వ్ ఈవీ- టాటా మోటార్స్ నుంచి ఈవీ సెగ్మెంట్లోకి అడుగుపెట్టిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఈ టాటా కర్వ్ ఈవీ. ఇదొక ఎస్యూవీ కూపే. ఇందులో 45 కేడబ్ల్యూహెచ్, 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే వరుసగా 430 కి.మీ, 500 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తాయి. టాటా కర్వ్ ఈవీ ఎక్స్‌షోరూం ధర రూ. 17.49 లక్షల- రూ. 22.24లక్షల వరకు ఉంటుంది.
గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్‌లో టాటా కర్వ్ ఈవీకి 5 స్టార్ రేటింగ్ దక్కింది. ఏడీఏఎస్కి చెందిన అనేక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఎయర్బ్యాగ్స్, ఈఎస్సీ, ఫ్రెంట్,రేర్ పార్కింగ్ సెన్సార్లు సైతం ఉన్నాయి.
మరి మీరు ఏ ఎలక్ట్రిక్ కారు ఎంచుకుంటారు?
సంబంధిత కథనం