Electric scooters : బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే- హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
Best electric scooters in India : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ సెల్లింగ్ ఈ-స్కూటర్లు, వాటి రేంజ్, ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్‌కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా ఈ-స్కూటర్స్ విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. మరీ మీరు కూడా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్న ఈ-స్కూటర్లు, వాటి రేంజ్, హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
ఓలా ఎస్1 ప్రో..
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ నుంచి అనేక ప్రాడక్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఓలా ఎస్1 ప్రోకి మంచి డిమాండ్ ఉంది. ఇందులో 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 190 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 120 కేఎంపీహెచ్.
ఇక హైదరాబాద్‌లో ఓలా ఎస్1 ప్రో ఈ-స్కూటర్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 1,40,700గా ఉంది.
ఓలా ఎస్1 ఎయిర్..
ఓలా ఎలక్ట్రిక్ నుంచి మరో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఈ ఓలా ఎస్1 ఎయిర్. ఇందులో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 90 కేఎంపీహెచ్.
హైదరాబాద్‌లో ఓలా ఎస్1 ఎయిర్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 1,12,000గా ఉంది.
టీవీఎస్ ఐక్యూబ్..
దిగ్గజ టీవీఎస్ సంస్థకి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతోంది ఈ ఐక్యూబ్ ఈ-స్కూటర్. ఇందులో 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని రేంజ్ 75 కి.మీ. టాప్ స్పీడ్ 75 కేఎంపీహెచ్. ఇందులో 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కూడా ఉంది. దీని రేంజ్ 100 కి.మీ కన్నా ఎక్కువే.
హైదరాబాద్‌లో టీవీఎస్ ఐక్యూబ్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 1,14,100గా ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ రెండో వేరియంట్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 1.44లక్షల వరకు ఉంటుంది.
బజాజ్ చేతక్..
బజాజ్ చేతక్ ఈవీలో 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150కి.మీ రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ సుమారు 75 కేఎంపీహెచ్.
హైదరాబాద్‌లో బజాజ్ చేతక్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 1,28,800 వద్ద ఉంది.
ఏథర్ 450ఎక్స్..
ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 2.9 కేడబ్ల్యూహెచ్, 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. వీటి రేంజ్ 125 కి.మీ నుంచి 160 కి.మీ మధ్యలో ఉంటుంది. వీటిలో ప్రో ప్యాక్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఏథర్ 450ఎక్స్ 2.9 కేడబ్ల్యూహెచ్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 1,52,800 వరకు ఉంటుంది. ఇక 3.7 కేడబ్ల్యూహెచ్ ప్రైజ్ రూ. 1.63 లక్షలు. మిగిలిన ప్రో ప్యాక్ వేరియంట్ల ధరలు రూ. 1,70లక్షలు, రూ. 1.83 లక్షల మధ్యలో ఉంటాయి.
ఏథర్ రిజ్టా
ఏథర్ రిజ్టా ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి.. ఏథర్ రిజ్టా ఎస్, రిజ్టా జెడ్ (2.9 కేడబ్ల్యూహెచ్), రిజ్టా జెడ్- 93.7 కేడబ్ల్యూహెచ్). వీటి రేంజ్ వరుసగా 120కి.మీ, 120కి.మీ, 160కి.మీ. రిజ్టా ఈ-స్కూటర్ టాప్ స్పీడ్ 80 కేఎంపీహెచ్.
హైదరాబాద్‌లో రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వరుసగా రూ. 1,15లక్షలు, రూ. 1.32లక్షలు, రూ. 1.52లక్షలు.
మరి మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటారు?
సంబంధిత కథనం