Kavya Maran : లగ్జరీకి కేరాఫ్​ అడ్రెస్​ కావ్య మారన్​! ఈ లిస్ట్​ చూస్తే మతిపోతుంది..-check out srh owner kavya marans luxury car collection bmw i7 ferrari roma and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kavya Maran : లగ్జరీకి కేరాఫ్​ అడ్రెస్​ కావ్య మారన్​! ఈ లిస్ట్​ చూస్తే మతిపోతుంది..

Kavya Maran : లగ్జరీకి కేరాఫ్​ అడ్రెస్​ కావ్య మారన్​! ఈ లిస్ట్​ చూస్తే మతిపోతుంది..

Sharath Chitturi HT Telugu

Kavya Maran luxury cars : సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఓనర్​ కావ్య మారన్​ దగ్గర ఉన్న లగ్జరీ కార్ల కలెక్షన్​ చూస్తే మతిపోతుంది! బీఎండబ్ల్యూ నుంచి బెంట్లే వరకు అనేక లగ్జరీ కార్లు ఆమె గ్యారేజ్​లో ఉన్నాయి. ఆ వివరాలు..

ఎస్​ఆర్​హెచ్​ ఓనర్​ కావ్య మారన్​ (REUTERS)

ఐపీఎల్​ ప్రపంచంలో కావ్య మారన్​ చాలా ఫేమస్​! ఈ సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఓనర్​- సీఈఓ తన టీమ్​ని ఎల్లప్పుడు సపోర్ట్​ చేస్తుంటారు. టీమ్​ గెలుపోటముల్లో ఆమె హావాభావాల వీడియోలు తెగ వైరల్​ అవుతుంటాయి. అవి మీరు చాలానే చూసి ఉంటారు. అయితే, కావ్య మారన్​ దగ్గర ఉన్న కార్ల లిస్ట్​ గురించి మీకు తెలుసా? తెలిస్తే మాత్రం.. కావ్య- లగ్జరీకి కేరాఫ్​ అడ్రెస్​ అని కచ్చితంగా అనుకుంటారు. రూ. 400 కోట్లకుపైగా నెట్​వర్త్​ కలిగిన కావ్య మారన్​ గ్యారేజ్​లో బెంట్లే నుంచి బీఎండబ్ల్యూ వరకు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

కావ్య మారన్​ లగ్జరీ కార్​ కలెక్షన్​..

బెంట్లే బెంటయ్గా ఈడబ్ల్యూబీ- బెంట్లే నుంచి వచ్చిన తొలి ఎస్​యూవీ ఇది. సన్​రైజర్స్​ హైదరాబాద్​ సీఈఓ కావ్య దగ్గర ఉన్న మోడల్​కి రెడ్​ ఫినిషింగ్​ వచ్చింది. ఇందులో 22 ఇంచ్​ వీల్స్​ ఉన్నాయి. ఇందులో 4.0 లీటర్​ ట్విన్​ టర్బో వీ8 ఇంజిన్​ ఉంటుంది. ఇది 542 హెచ్​పీ పవర్​, 770 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇందులో 8 స్పీడ్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ ఉంటుంది. ఈ మోడల్​ ధర రూ. 6కోట్ల కన్నా ఎక్కువే!

రోల్స్​ రాయిస్​ ఫాంటమ్​ 8 ఈడబ్ల్యూబీ- కావ్య మారన్​ గ్యారేజ్​లో అత్యంత ఖరీదైన కారు ఇది. ఇండియాలో దీని ధర రూ. 12కోట్ల కన్నా ఎక్కువే ఉంటుంది. లైట్​ గోల్డ్​, బ్లాక్​ కలర్​ ఆప్షన్​లో వస్తుంది. ఇందులో 21 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ ఉన్నాయి. 6.72 లీటర్​ వీ12 ట్విన్​ టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 571 హెచ్​పీ పవర్​ని, 900 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఆటోమెటిక్​ గేర్​బాక్స్​పై ఇది పనిచేస్తుంది.

బీఎండబ్ల్యూ ఐ7- లగ్జరీ కార్లకు పెట్టింది పేరుగా ఉన్న బీఎండబ్ల్యూకి కూడా కావ్యా మారన్​ గ్యారేజ్​లో చోటు ఉంది. ఆమె దగ్గర బీఎండబ్ల్యూ ఐ7 బ్లాక్​ సఫైర్​ మెటాలిక్​ పెయింట్​ కారు ఉంది. ఇదొక లగ్జరీ, ఎలక్ట్రిక్​ సెడాన్​. ఇందులోని 101.7 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ సింగిల్​ ఛార్జ్​తో 600కి.మీ కన్నా ఎక్కువ రేంజ్​ని ఇస్తుంది. ఇండియాలో ఈ మోడల్​ ప్రారంభ ధర రూ. 2.03 కోట్లు.

ఫెర్రారీ రోమా- కావ్య మారన్​ దగ్గర ఉన్న మరో లగ్జరీ కారు ఈ ఫెర్రారీ రోమా. ఇది రొస్సో కార్సో కలర్​ ఆప్షన్​లో వస్తుంది. లాంచ్​ టైమ్​లో దీని ధర రూ. 4.5కోట్లు. ఇందులో 3.9 లీటర్​ ట్విన్​ టర్బోఛార్జ్​డ్​ వీ8 ఇంజిన్​ ఉంటుంది. ఇది 680 హెచ్​పీ పవర్​ని 760 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇందులో 8 స్పీడ్​ డ్యూయెల్​ క్లచ్​ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ ఉంటుంది.

కావ్య మారన్​ గురించి..

ప్రముఖ సన్​ గ్రూప్​ ఫౌండర్​ కలానిథి మారన్​ కుమార్తె కావ్య మారన్​. ఇంగ్లాండ్​లోని ప్రఖ్యాత వార్​విక్​ బిజినెస్​ స్కూల్​లో ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. క్రికెట్​ మాత్రమే కాదు వ్యాపార ప్రపంచంలోనూ ఆమె మంచి గుర్తింపు ఉంది. తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని ఆమె బాగా చూసుకుంటున్నారు. సన్​ టీవీ నెట్​వర్క్​లో ఆమె కృషికి 2024 దేవీ ఆవార్డు సైతం అందుకున్నారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం