JioBharat Diwali Dhamaka : కేవలం రూ. 699కే 4జీ మొబైల్- కస్టమర్స్‌కి జియో దీపావళి కానుక..!
JioBharat Diwali Dhamaka : 4జీ మొబైల్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్! దీపావళి నేపథ్యంలో జియో సంస్థ తన జియోభారత్ 4జీ మొబైల్ ధరను భారీగా తగ్గించి, మరింత అందుబాటు ధరలోకి తీసుకొచ్చింది. ఆ వివరాలు..
రిలయన్స్ జియో తన 'జియోభారత్ దీపావళి ధమాకా' ఆఫర్లను ప్రకటించింది. భారతదేశం అంతటా ఉన్న తన వినియోగదారులకు దీపావళి పండుగ సందర్భంగా ఈ ఆఫర్లను రిలయన్స్ జియో అందిస్తోంది. తక్కువ ధరల్లో జియోభారత్ మొబైళ్లను తీసుకువచ్చింది. ఆ వివరాలు..
జియోభారత్ దీపావళి ధమాకా ఆఫర్..
దీపావళి ధమాకా ఆఫర్ భాగంగా జియో తన అద్భుతమైన జియోభారత్ 4G ఫోన్‌లను కేవలం రూ. 699కే అందిస్తోంది. ఈ దీపావళి ధమాకా ఆఫర్‌తో భారతదేశ వ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు ఆనందాన్ని అందిస్తోంది. ఈ పరిమిత-కాల ఆఫర్‌లో, సాధారణంగా రూ. 999 ధర కలిగిన జియోభారత్ 4G ఫోన్‌లు ఇప్పుడు కేవలం రూ. 699 ప్రత్యేక ఆఫర్ ధరకు అందుబాటులో ఉన్నాయి.
పండుగ సీజన్ ఆఫర్ ప్లాన్‌తో, వినియోగదారులు రూ. 123 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ని ఆస్వాదించవచ్చు. ఇతర ఆపరేటర్లు నెలకు రూ. 199కి అందించే అతి తక్కువ ఫీచర్ ఫోన్ ప్లాన్‌లతో పోలిస్తే… జియో భారత్ ప్లాన్ దాదాపు 40% చౌకగా ఉంటుంది! దీని వల్ల వినియోగదారులు ప్రతి నెలా రూ. 76 ఆదా చేసుకోవచ్చు.
జియోభారత్ ఫోన్ ధర 699 నుంచి ప్రారంభమవుతుంది. రూ. 123 నెలవారీ టారిఫ్ ప్లాన్‌తో అపరిమిత ఉచిత వాయిస్ కాల్‌లు, నెలకు 14 జీబీ డేటా, 455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు, సినిమా ప్రీమియర్లు… తాజా సినిమాలు, వీడియోలు, క్రీడలు, జియోసినిమాలో హైలైట్లు, క్యూఆర్ కోడ్ స్కాన్‌లతో డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. జియో పే ద్వారా అందుకున్న చెల్లింపులపై సౌండ్ అలర్ట్‌లు తదితర సౌకర్యాలను వినియోగదారులు పొందవచ్చు!
ఈ పండుగ సీజన్, జియోభారత్ దీపావళి ధమాకాతో భారతదేశం అంతటా 2జీ, 4జీ వినియోగదారుల జీవితాల్లో జియో వెలుగులు నింపుతోంది.
జియో దీపావళి ధమాకా ఆఫర్స్..
రిలయన్స్ జియో ఇప్పటికే తన 'దీపావళి ధమాకా' ప్రీపెయిడ్ ఆఫర్లను ప్రకటించింది. నిర్దిష్ట త్రైమాసిక లేదా వార్షిక జియో ట్రూ 5జీ ప్రీపెయిడ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసే వినియోగదారులకు ప్రముఖ ట్రావెల్, ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఉపయోగించేలా రూ .3,350 విలువైన వోచర్లు లభిస్తాయి.
కొత్త ఆఫర్ కింద రూ.899 రీచార్జ్ ప్లాన@ను ఎంచుకున్న వినియోగదారులకు ట్రూ అన్ లిమిటెడ్ 5జీ సేవలు, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 90 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. అదనంగా 20 జీబీ డేటా కూడా లభిస్తుంది. లేదా దీనికి ప్రత్యామ్నాయంగా రోజుకు 2.5 జీబీ డేటా, ఏడాది పాటు నిరంతరాయంగా సేవలు అందించే రూ.3,599 వార్షిక ప్లాన్ ను కూడా ఎంచుకోవచ్చు. దీపావళి ధమాకా ఆఫర్ లో భాగంగా హోటల్ బుకింగ్స్, విమాన ప్రయాణాల కోసం జియో రూ. 3,000 ఈజ్ మై ట్రిప్ వోచర్లను అందిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం