Best selling car : 2024లో ఎక్కువ మంది కొన్ని కారు ఇదే- హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..-check out best selling car of 2024 tata punch on road price in hyderabad full details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Selling Car : 2024లో ఎక్కువ మంది కొన్ని కారు ఇదే- హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Best selling car : 2024లో ఎక్కువ మంది కొన్ని కారు ఇదే- హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Jan 06, 2025 09:00 AM IST

Tata Punch on road price Hyderabad : ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ కారుగా దూసుకెళుతోంది టాటా పంచ్​. 2024లో బెస్ట్​ సెల్లింగ్​ కార్స్​ లిస్ట్​లో టాప్​లో నిలిచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో టాటా పంచ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ కారు ఇదే..
ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ కారు ఇదే..

టాటా మోటార్స్​కి చెందిన టాటా పంచ్​ మైక్రో ఎస్​యూవీ చరిత్ర సృష్టించింది! మారుతీ సుజుకీ వాహనాలను అధిగమించి.. 2024 లో బెస్ట్​ సెల్లింగ్​ కారుగా నిలిచింది టాటా పంచ్​. మారుతీ సుజుకీ టాప్​ సెకెండ్​ ప్లేస్​కి పడిపోవడం ఇదే తొలిసారి. మరి మీరూ టాటా పంచ్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్​లో టాటా పంచ్​ ఆన్​ రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

2024లో బెస్ట్​ సెల్లింగ్​ కారు ఇదే..

2021 అక్టోబర్​లో లాంచ్​ అయిన టాటా పంచ్​.. మైక్రో ఎస్​యూవీ సెగ్మెంట్​ని ఏలుతోంది. మొత్తం 2024లో 2.02 లక్షల యూనిట్ల టాటా పంచ్ ఎస్​యూవీని టాటా మోటార్స్​ విక్రయించింది. రెండొవ స్థానంలో 1.91 లక్షల సేల్స్​తో మారుతీ సుజుకీ వాగన్​ఆర్​ నిలిచింది. హ్యుందాయ్ క్రెటాతో పాటు ఎర్టిగా, బ్రెజా వంటి ఇతర మారుతీ సుజుకీ మోడళ్లు 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-5 జాబితాలో ఉన్నాయి.

టాటా పంచ్​ లాంచ్​ టైమ్​ నుంచే రికార్డులు బ్రేక్​ చేస్తూ వెళుతోంది. డెలివరీలు ప్రారంభించిన పది నెలల్లోనే తొలి లక్ష ఉత్పత్తి మైలురాయిని ఈ ఎస్​యూవీ తాకింది. తర్వాతి లక్ష.. 2023 మే నాటికి రాగా, మూడో లక్ష 2024 జనవరి ప్రారంభంలో వచ్చేసింది. ఎనిమిది నెలల తర్వాత నాలుగో లక్ష ఉత్పత్తి మైలురాయిని అందుకున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కీలకమైన 5 లక్షల మార్కుపై పడింది.

హైదరాబాద్​లో టాటా పంచ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

టాటా పంచ్​ ప్యూర్​ పెట్రోల్​- రూ. 7.34 లక్షలు

ప్యూర్​ ఆప్ట్​ పెట్రోల్​- రూ. 8.01 లక్షలు

అడ్వెంచర్​ పెట్రోల్​- రూ. 8.36 లక్షలు

ప్యూర్​ సీఎన్జీ- రూ. 8.63 లక్షలు

అడ్వెంచర్​ రిథమ్​ పెట్రోల్​- రూ. 8.78 లక్షలు

అడ్వెంచర్​ ఏఎంటీ పెట్రోల్​- రూ. 9.07 లక్షలు

అడ్వెంచర్​ ఎస్​ పెట్రోల్​- రూ. 9.07 లక్షలు

అడ్వెంచర్​ రిథమ్​ ఏఎంటీ పెట్రోల్​- రూ. 9.48 లక్షలు

అడ్వెంచర్​ సీఎన్జీ- రూ. 9.48 లక్షలు

అడ్వెంచర్​ ప్లస్​ ఎస్​ పెట్రోల్​- రూ. 9.66 లక్షలు

అడ్వెంచర్​ ఎస్​ ఏఎంటీ పెట్రోల్​- రూ. 9.78 లక్షలు

అకంప్లీష్​డ్ ప్లస్​ పెట్రోల్​- రూ. 9.89 లక్షలు

అడ్వెంచర్​ రిథమ్​ సీఎన్జీ- రూ. 9.89 లక్షలు

అకంప్లీష్​డ్​ రిథమ్​ సీఎన్జీ- రూ. 9.89 లక్షలు

అకంప్లీష్​డ్​ ప్లస్​ కామో పెట్రోల్​- రూ. 10.07 లక్షలు

అడ్వెంచర్​ ఎస్​ సీఎన్జీ- రూ .10.19 లక్షలు

అడ్వెంచర్​ ప్లస్​ ఎస్​ ఏఎంటీ పెట్రోల్​- రూ. 10.36 లక్షలు

అకంప్లీష్​డ్​ ప్లస్​ ఎస్​ పెట్రోల్​- రూ. 10.48 లక్షలు

అకంప్లీష్​డ్​ ప్లస్​ ఏఎంటీ పెట్రోల్​- రూ. 10.60 లక్షలు

అకంప్లీష్​డ్​ ప్లస్​ ఎస్​ కామో పెట్రోల్​- రూ. 10.66 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ పెట్రోల్​- రూ. 10.72 లక్షలు

అకంప్లీష్​డ్​ ప్లస్​ కామో ఏఎంటీ పెట్రోల్​- రూ. 10.78 లక్షలు

అడ్వెంచర్​ ప్లస్​ ఎస్​ సీఎన్జీ- రూ. 10.78 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ కామో పెట్రోల్​- రూ. 10.89 లక్షలు

అకంప్లీష్​డ్​ ప్లస్​ ఎస్​ ఏఎంటీ పెట్రోల్​- రూ. 11.19 లక్షలు

అకంప్లీష్​డ్​ ప్లస్​ సీఎన్జీ- రూ. 11.19 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ ఎస్​ పెట్రోల్​- రూ. 11.25 లక్షలు

అకంప్లీష్​డ్​ ప్లస్​ ఎస్​ కామో ఏఎంటీ పెట్రోల్​- రూ. 11.36 లక్షలు

అకంప్లీష్​డ్​ ప్లస్​ కామో సీఎన్జీ- రూ. 11.36 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ ఏఎంటీ పెట్రోల్​- రూ. 11.42 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ ఎస్​ కామో పెట్రోల్​- రూ. 11.42 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ కామో ఏఎంటీ పెట్రోల్​- రూ. 11.60 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ ఎస్​ సీఎన్జీ- రూ. 11.78 లక్షలు

అకంప్లీష్​డ్​ ప్లస్​ ఎస్​ కామో సీఎన్జీ- రూ. 12.36 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ ఎస్​ కామో ఏఎంటీ పెట్రోల్​- రూ. 12.48 లక్షలు

సమీప డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శిస్తే ధర వివరాలతో పాటు టెస్ట్​ డ్రైవ్​ చేసే అవకాశం కూడా ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం