Best 6 seater car : ఈ మారుతీ సుజుకీ 6 సీటర్​లో కంఫర్టెబుల్​గా ప్రయాణం- ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..-check out best selling 6 seater maruti suzuki xl6 on road price in hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best 6 Seater Car : ఈ మారుతీ సుజుకీ 6 సీటర్​లో కంఫర్టెబుల్​గా ప్రయాణం- ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Best 6 seater car : ఈ మారుతీ సుజుకీ 6 సీటర్​లో కంఫర్టెబుల్​గా ప్రయాణం- ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Jan 12, 2025 07:20 AM IST

Maruti Suzuki XL6 : ఫ్యామిలీకి కంఫర్టెబుల్​గా ఉండే విధంగా మంచి కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్​లో మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6 ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ మారుతీ సుజుకీ 6 సీటర్​ కారులో కంఫర్ట్​ ఎక్కువ!
ఈ మారుతీ సుజుకీ 6 సీటర్​ కారులో కంఫర్ట్​ ఎక్కువ!

ఇండియాలో 5 సీటర్​ కార్లు చాలానే ఉన్నాయి. కానీ ఒక్కోసారి ఇవి ఫ్యామిలీలకు సరిపోవు! అయితే, మారుతీ సుజుకీకి చెందిన ఒక బెస్ట్​ సెల్లింగ్​ కారులో 6 సీట్స్​ లభిస్తున్నాయి. అదే.. మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6. ప్రీమియం లుక్స్​తో వచ్చే ఈ మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6.. బడ్జెట్​ రేంజ్​​లో ఫ్యామిలీ ట్రిప్స్​కి బాగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో ఈ మోడల్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.

yearly horoscope entry point

హైదరాబాద్​లో మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6 ఆన్​రోడ్​ ప్రైజ్​

  • మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6 జీటీ- రూ. 14.15 లక్షలు
  • జీటా సీఎన్జీ- రూ. 15.28 లక్షలు
  • ఆల్ఫా- రూ. 15.35 లక్షలు
  • జీటా ఏటీ- రూ. 15.84 లక్షలు
  • ఆల్ఫా ప్లస్​- రూ. 16.08 లక్షలు
  • ఆల్ఫా ప్లస్​ డ్యూయెల్​​ టోన్​- రూ. 16.27 లక్షలు
  • ఆల్ఫా ఏటీ- రూ. 17.04 లక్షలు
  • ఆల్ఫా ప్లస్​ ఏటీ- రూ. 17.77 లక్షలు
  • ఆల్ఫా ప్లస్​ ఏటీ డ్యూయెల్​ టోన్​- రూ. 17.96 లక్షలు

అంటే హైదరాబాద్​లో మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6 ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 14.15 లక్షల నుంచి రూ. 17.96 లక్షలు వరకు ఉంటుంది. జీటా సీఎన్జీ మినహా మిగిలిన అన్ని వేరియంట్లు పెట్రోల్​ ఇంజిన్​తోనే వస్తాయి. జీటా పెట్రోల్​, జీటా సీఎన్జీ వేరియంట్లు బెస్ట్​ సెల్లింగ్​గా కొనసాగుతున్నాయి.

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్​ని కొనే ముందు, ఎక్స్​షోరూం ప్రైజ్​ కాకుండా ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకుని బడ్జెట్​ వేసుకోవాలి.

మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శిస్తే మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6 ​ టెస్ట్​ డ్రైవ్ చేయొచ్చు. అంతేకాదు ఆఫర్స్​, డిస్కౌంట్స్​ వంటి వివరాలపైనా క్లారిటీ వస్తుంది. ఆ మేరకు మీరు మీ బడ్జెట్​ని ప్లాన్​ చేసుకోవచ్చు.

మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6..

ఈ మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6లో 1462 సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఇది 86.63 బీహెచ్​పీ పవర్​ని, 121.5 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. గ్లోబల్​ ఎన్​సీఏపీ సేఫ్టీ టెస్ట్​లో మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6కి 3 స్టార్​ రేటింగ్​ లభించింది.

ఇక 1.5 లీటర్​ ఎంటీ వేరియంట్​ గరిష్ఠంగా 20.97 కేఎంపీఎల్​ మైలేజ్​ ఇస్తుంది. 1.5 లీటర్​ ఏటీకి అది 20.27 కేఎంపీఎల్​. 1.5 లీటర్​ ఎంటీ సీఎన్జీ మైలేజ్​ 6.32 కేఎంపీకేజీగా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం