Best electric bike : స్టైల్‌తో పాటు లాంగ్ రేంజ్- ఈ ఎలక్ట్రిక్ బైక్ మీకు బెస్ట్!
Long range electric bike : లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ బైక్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! స్పోర్ట్స్ బైక్ లుక్ ఇచ్చే ఈ ఒకాయా ఫెర్రాటో డిస్రప్టర్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే.
ఇండియాలో 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌కి భారీ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. కొత్త కొత్త సంస్థలతో పాటు ప్రముఖ కంపెనీలు కూడా ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ చేయడంతో కస్టమర్స్‌కి మంచి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మరి మీరు కూడా ఒక ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే స్టైల్‌తో పాటు లాంగ్ రేంజ్ ఇచ్చే ఒకాయా ఫెర్రాటో డిస్రప్టర్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్స్, రేంజ్, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బెస్ట్ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఒకాయా సబ్-బ్రాండ్ ఈ ఫెర్రాటో. ఈ ఫెర్రాటో నుంచి వచ్చిన తొలి ప్రాడక్ట్ పేరు డిస్రప్టర్. ఇందులో ఇంజిన్ కాంబీ బ్రేక్ సిస్టెమ్, యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్, బ్లూటూత్- వైఫై వంటి మొబైల్ కనెక్టివిటీ ఆప్షన్స్, రైడింగ్ మోడ్స్ (ఈకో, సిటీ, స్పోర్ట్స్), వెహికిల్ లైవ్ ట్రాకింగ్, జీపీఎస్, ఫైండ్ మై వెహికిల్, డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఓడోమీటర్, లో- బ్యాటరీ అలర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాదు ఫెర్రాటో డిస్రప్టర్ ఎలక్ట్రిక్ బైక్‌లో రివర్స్ అసిస్ట్, స్టోరేజ్ స్పేస్, స్పీకర్స్ వంటివి కూడా ఉన్నాయి.
ఈ ఫెర్రాటో డిస్రప్టర్ని కేవలం ఎలక్ట్రిక్ బైక్లానే కాకుండా ఒక స్పోర్ట్స్ బైక్గానూ ఉపయోగించే విధంగా సంస్థ రూపొందించింది. ఇందులో 3.97 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 110 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 95 కేఎంపీహెచ్. ఇందులోని మోటార్ 228 ఎన్ఎం పీక్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌ని పూర్తిగా ఛార్జ్ చేసేందుకు 5 గంటల సమయం పడుతుందని సంస్థ చెబుతోంది. సస్పెన్షన్స్ కోసం ఫ్రెంట్లో టెలిస్కోపిక్ రేర్‌లో మోనో షాక్ అబ్సార్బర్స్ని ఇందులో సంస్థ అందించింది. ఇందులో సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఉంది. ఈ బైక్‌కి అలాయ్ వీల్స్ వస్తున్నాయి.
ఈ బైక్ బ్యాటరీపై 3ఏళ్లు లేదా 30వేల కిలోమీటర్ల వ్యారంటీని సంస్థ ఆఫర్ చేస్తోంది.
ఒకాయా ఫెర్రాటో డిస్రప్టర్ బైక్ ధర..
ఈ ఒకాయా ఫెర్రాటో డిస్రప్టర్ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.59లక్షల వద్ద ప్రారంభమవుతుంది. ఇన్ఫెర్నో రెడ్, మిడ్నైట్ షైన్, థండర్ బ్లూ వంటి కలర్ ఆప్షన్స్‌లో ఈ ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులో ఉంది.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..