ఫ్లాగ్షిప్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్ వరకు.. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి మంచి డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి సెగ్మెంట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్యాడ్జెట్స్‌ని లాంచ్ చేస్తున్నాయి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ. మరి మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలని చూస్తున్నారా? బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! రూ. 10వేల ధరలోపు ఈ బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ (మే 2025) లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి. రూ. 10వేలకు ఏమొస్తుంది? అనుకుంటే పొరబడినట్టే. విపరీతమైన పోటీ ఉండటంతో కంపెనీలు కస్టమర్స్‌ని ఆకర్షించేందుకు కొన్ని సెగ్మెంట్ బెస్ట్ ఫీచర్స్‌ని ఈ గ్యాడ్జెట్స్‌లో ఇస్తున్నాయి. పూర్తి వివరాలు..
శాంసంగ్ గెలాక్సీ ఎం05- ఇందులో 6.74 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. 4జీబీ ర్యామ్ అందుబాటులో ఉంది. 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ సైతం ఉంది. మైక్రో ఎస్డీ కార్డుతో 1000జీబీ వరకు స్టోరేజ్‌ని ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వస్తోంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ రేర్‌లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 8ఎంపీ కెమెరా ఉంది. ఈ మొబైల్ ప్రారంభ ధర రూ. 6,4999గా ఉంది.
పోకో ఎం7 5జీ- ఈ ఏడాది మార్చ్‌లో లాంచ్ అయ్యింది ఈ స్మార్ట్‌ఫోన్. ఇదులో 6.88 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. 6జీబీ, 8జీ ర్యామ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్పై ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. రేర్‌లో 50ఎంపీ కెమెరా, ఫ్రెంట్లో 8 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 8,799గా ఉంది. జీపీఎస్, బ్లూటూత్ వీ5.00, యూఎస్బీ టైప్-సీ, ఎఫ్ఎం రేడియో, రెండు 4జీ స్లిమ్ స్లాట్స్‌తో ఈ మొబైల్ వస్తోంది.
పోకో ఎం6 5జీ- పోకో కంపెనీ నుంచి వచ్చిన మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఇది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది. గ్రఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ వంటి కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 108ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీ రేర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 13ఎంపీ కెమెరా వస్తోంది. ఈ పోకో ఎం6 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 9,999.
మోటో జీ05 5జీ- ఇందులో 6.7 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. 5200ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. 4జీబీ ర్యామ్ దీని సొంతం. 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంటుంది. డ్యూయెల్ సిమ్ మొబైల్ఇది. ఆండ్రాయిడ్ 15పై మోటో జీ45 ఇది పనిచేస్తుంది. రేర్‌లో 50ఎంపీ కెమెరా, ఫ్రెంట్లో 8ఎంపీ కెమెరా దీని సొంతం. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 7,299గా ఉంది.
సంబంధిత కథనం